శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి): 

    దసరా మహోత్సవములు -2023 విజయవంతముగా పూర్తి అయిన సందర్భంగా  మహా మండపం 6వ అంతస్తు నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది.

    ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు , ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు  పాల్గొని వైభవముగా జరిగిన దసరా-2023 ఉత్సవముల గురించి మాట్లాడారు. అనంతరం దసరా మహోత్సవములు దిగ్విజయముగా నిర్వహించుటకు తమవంతు పాత్ర పోషించి, సహకరించిన అన్ని శాఖల వారికి మరియు మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలిపారు.

  అనంతరం కార్తీకమాసం సందర్బంగా దేవస్థానం నందు జరుగు కార్యక్రమములు, గాజుల అలంకరణ ఉత్సవం, భవాణీ దీక్షా వివరములు తెలిపారు. 


ఈ సమావేశం నందు ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె వి ఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి , స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ , ట్రస్ట్ బోర్డు సభ్యులు చింతా సింహాచలం, బచ్చు మాధవీ కృష్ణ, కేసరి నాగమణి , సహాయ కార్యనిర్వాహణాధికారులు పి చంద్రశేఖర్, సుధారాణి, ఎన్ రమేష్, బి వెంకట రెడ్డి, జంగం శ్రీనివాసులు , వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్యా  పాల్గొన్నారు.

Comments