పాలవెల్లువ అవినీతి పై సూటిగా స్పందించాలి.

  తెనాలి (ప్రజా అమరావతి);

పాలవెల్లువ అవినీతి పై సూటిగా స్పందించాలి



జగన్ ప్రభుత్వం చేపట్టీన పాలవెల్లువపథకంలో చోటు చెసుకొన్న 2,887కోట్లరూపాయల కుంణం పై సూటిగా స్పందించాలని మంత్రి సిదిరి అప్పలరాజును  నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం మథ్యాహ్నం పార్టీ కార్యాలయం లోఏర్పాటు చెసిన సమావేశంలో ఎప్పుడో

దీనిపై స్పందించాల్సిన మంత్రి  తీరికగా పది రోజుల తర్వాత వ్యక్తిగత విమర్శలతో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్    విమర్శించారు. తాను రాష్ట్రస్థాయి బేంకర్స్ కమిటీ (SLBC) నివేదికలోని అంశం 3.94 లక్షల గేదెలు కొన్న ప్రస్తావించకుండా సమస్య ప్రక్కబారి పట్టించి    ఆయన శాఖలో అవినీతే జరగ లేదంటున్నారని అక్రమాల లేకుంటే   లబ్ధిదారుల జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా అమలు కావాలని పథకాల్లో జరుగుతున్న అవకతవకలపై జనసేన పార్టీ ప్రశ్నిస్తుంటే. బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సిన సంబంధిత మంత్రి మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని నాదెండ్ల విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని మేము అడిగిన ప్రశ్నలు మూడే మూడేనన్నారు. పాడిపశువుల కొనుగోలుపై ఇద్దరు మంత్రులు చెప్పిన సంఖ్యలో తేడాలు ఎందుకు ? కొనుగోలు మీరు చెప్పినట్లే 3.94 లక్షల పాడిపశువులు చేసి ఉంటే పాల ఉత్పత్తి ఏది?అవినీతి జరగకపోతే లబ్ధిదారుల జాబితాను బయటపెట్టడం లేదు? అని నాదెండ్ల నిలదీశారు. మంత్రి అవరమైతే SLBC మూడవపేజీ చూడాలని తాను దానిలో విషయాలే ప్రస్తావించానన్నారు. 


ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పమని సంబంధిత మంత్రిని డిమాండ్ చేస్తే ఆయన  చిత్తూరు, సంగం డెయిరీలో ఏం జరిగింది? చంద్రబాబు ,పవన్ కళ్యాణ్  ఏం మాట్లాడారు? వ్యక్తిగత విమర్శలు, రాజకీయ అంశాలు మాట్లాడి సమస్యను ప్రక్కదారి పట్టిస్తున్నారన్నారు, అంబులెన్స్ ల కొనుగోళ్ళ అక్రమాలపై త్వరలో విచారణ చేపట్టనున్నామన్నారు.


Comments