రైతు స్థిరంగా ఉండాలి.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రైతుబంధు తెచ్చాం సీఎం కేసీఆర్‌.

 రైతు స్థిరంగా ఉండాలి.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రైతుబంధు తెచ్చాం సీఎం కేసీఆర్‌


రంగారెడ్డి (ప్రజా అమరావతి);

రైతు అనేవాడు స్థిరంగా ఉండాలి.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలనే ఆలోచనతో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.


మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 


 రైతు అనేవాడు స్థిరంగా ఉండాలి.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలనే ఆలోచనతో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఇబ్రహీంపట్నంలో చాలా వరకు భూములు రియల్‌ ఎస్టేట్‌కు పోయినయ్‌. మిగిలిన రైతాంగం నీళ్లు లేక కష్టపడుతున్నరు. ఈ విషయం నాకు తెలుసు. కరెంటు, బోర్లపైనే ఆధారపడ్డం. ఇబ్రహీంపట్నం చెరువు బాగాలేక ఎండిపోయి ఎడారిగా ఉంటే.. కిషన్‌రెడ్డి నాప్రాణం తీసి.. హైదరాబాద్‌కు వెళ్లే నల్లా నీళ్లతోనైనా ఒకసారైనా నింపాలని పట్టువట్టి మెట్రోవాటర్‌తోని చెరువు నింపించారు. ఆ తర్వాత చెరువు ఎందుకు నిండుతలేదు చెరువు.. మామూలు వర్షానికే నిండాలి. 30 కిలోమీటర్ల నుంచి వాగు వస్తుందని చూస్తే.. దానిపై అన్నీ ఇసుక ఫిల్టర్లు. అనేక ఆటంకాలు కాంగ్రెస్‌ రాజ్యంలో గందరగోళంగా ఉండేది' అని గుర్తు చేశారు.


నిండుకుండలా ఇబ్రహీంపట్నం చెరువు కనిపిస్తున్నది


'కిషన్‌రెడ్డి పట్టుపట్టి 36 కిలోమీటర్ల నదిని క్లీన్‌ చేయించారు. దేవుడి దయతో వర్షాలు పడుతుండడంతో నిండుకుండలా ఇబ్రహీంపట్నం చెరువు బ్రహ్మాండంగా కనిపిస్తున్నది. హెలీకాప్టర్‌ దిగుతుంటే కండ్లకు ఆనందం కలిగేలా చెరువు నిండా నీళ్లు కనిపిస్తున్నయ్‌. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాలు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు కృష్ణా నది నీళ్లే రావాలి. మనం కృష్ణా బేసిన్‌లోనే ఉంటం. మన వాటా కూడా అలాగే ఉంటది. దాన్ని తేవాలని చెప్పి విశ్వప్రయత్నం చేసి పాలమూరు-రంగారెడ్డి పథకం పెడితే.. 196 కేసులు కాంగ్రెస్‌ నాయకులు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌, హైకోర్టు, సుప్రీంకోర్టు అని.. కాలికి పెడితే మెడకు పెట్టి.. మెడకు పెడితే కాలుకు పెట్టి ఆపారు. అయినా ధైర్యంతో కొన్ని పనులు చేశాం. దేవుడి దయతో మొన్నమొన్ననే అన్ని క్లియరెన్స్‌లు వచ్చాయి. మొన్ననే ట్రిబ్యునల్‌ అపాయింట్‌ అయ్యింది. నేనుపోయి పాలమూరు ఎత్తిపోతల పథకం స్విచ్‌ ఆన్‌ చేశాను. ఒకసారి అది వస్తే ఆటోమెటిక్‌గా మునుగోడు వద్ద రిజర్వాయర్‌ ఏదైతే నిండుతుందో.. దాన్ని నుంచి మీకు నీరు వస్తయ్‌. సుమారు లక్ష ఎకరాలు పారుతుంది. దాని నుంచి దాదాపు వంద చెరువులను నింపుకొని.. ఆ చెరువుల ద్వారా పారకం చేసుకుంటాం' అన్నారు.


గవర్నమెంట్‌ సపోర్ట్‌ లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు


'రైతు అనేవాడు స్థిరంగా ఉండాలి. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. దాని కోసం ఆలోచన చేసి రైతుబంధు పథకం తీసుకువచ్చాం. ఈ పథకం ఇండియాలో లేదు. బయటి దేశాల్లో కూడా లేదు. దాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌. గవర్నమెంట్‌ సపోర్ట్‌ లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు. గతంలో ఎవరూ పట్టించుకోలేదు. గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని చూశాం. కరెంటు, నీళ్లులేక చాలాబాధలు పడ్డాం. చెరువుల ద్వారా నీరు ఇచ్చినా నీటి తీరువా లేదు. పాత బకాయిలు రద్దు చేశాం. ఏడాదిన్నరలోనే నాణ్యమైన విద్యుత్‌ను సంపాదించి.. 24గంటలు సరఫరా చేస్తున్నాం. రైతుబంధు కింద పెట్టుబడి ఇస్తున్నాం. రైతులకు బీమా సదుపాయం సైతం వర్తింపజేస్తున్నాం. దాదాపు లక్ష కుటుంబాలకు బీమా సదుపాయం వచ్చింది. పంటలు రైతులు పండితే ఎక్కడో పోయి అమ్ముకోకుండా 7500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేసి పంపుతున్నాం' అని వివరించారు.

Comments