గర్భిణీలు,బాలింతలు,చిన్నారుల్లో రక్తహీణత,పౌష్టికాహారలోప నివారణకు చర్యలు చేపట్టండి.

 గర్భిణీలు,బాలింతలు,చిన్నారుల్లో రక్తహీణత,పౌష్టికాహారలోప నివారణకు చర్యలు చేపట్టండి


రక్తహీణత గల పిల్లలతో ఐరన్ ఫోలిక్ మాత్రలు మింగించాలి

డిశంబరు నెలాఖరుకు ప్రవేట్ పాఠశాలల్లోని విద్యార్దుల్లో రక్తహీణత గుర్తించే పరీక్షలు

ప్రతి నెలా మొదటి మూడవ శుక్రవారాల్లో విలేజ్ హెల్తు అండ్ న్యూట్రిషన్ డే జరపాలి

బాల్య వివాహాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలి

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి

       ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి

అమరావతి,9 నవంబరు (ప్రజా అమరావతి):రాష్ట్రంలో గర్బిణీలు,బాలింతలు,చిన్నారుల్లో రక్తహీణత,పౌష్టికాహార లోప నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.వైద్య ఆరోగ్యం,మహిళా శిశు సంక్షేమం,విద్యాశాఖలకు సంబంధించి నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రక్తహీనత,పౌష్టికాహార లోపం గల బాలింతలు,చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వారిని ఆసమస్యల నుండి విముక్తులను చేయవచ్చని అన్నారు.అదే విధంగా హైరిస్క్ ప్రెగ్నెంట్ మహిళల డేటాను అందుబాటులో ఉంచుకుని వారి ఆర్యోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా మానిటర్ చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.కౌమార బాలికల్లో రక్తహీనత,ఎదుగుదల లేకపోవడం,పౌష్టికాహార లోపాన్ని నివాకరేంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిఎస్.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.ఈవిషయంలో జిల్లా కలక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆదేశించారు.

డిశంబరు నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని ప్రవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల్లో రక్తహీనత నివారణకు సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు పూర్తి చేసేలా ఆయా విద్యా సంస్థల యమాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేశ్ కుమార్ ను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో రక్త హీనణ నివారణకు స్క్రీనింగ్ పరీశక్షలు నిర్వహించి వారిచే ఐరన్ ఫోలిక్ మాత్రలు మింగించే చర్యలు తీసుకుంటున్నవిధంగానే ప్రవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలకు కూడా ఈవిధమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రతి నెల మొదటి మూడవ శుక్రవారాల్లో విలేజ్ హెల్తు అండ్ న్యూట్రిషన్ డేను క్రమం తప్ప కుండా నిర్వహించడం ద్వారా వివిధ ఆరోగ్య అంశాలపై ప్రజల్లో పెద్దఎత్తున్న అవగాహన  పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యం,మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.అదే విధంగా ఈసందర్భంగా బాల్య వివాహాల నియంత్రణపై కూడా వారిలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.అంతే గాక గ్రామ స్థాయి హల్తీ బేబీ షోలు వంటివి నిర్వహించాలని ఉత్తమంగా నిలిచిన గ్రామాలకు ప్రత్యేకంగా అవార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.అంతకు ముందు వైద్య ఆరోగ్యం,మహిళా శిశు సంక్షేమం,విద్యా శాఖలకు సంబంధించి నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు తీసుకుంటున్న చర్యలను ఇప్పటి వరకూ సాధించిన లక్ష్యాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సమీక్షించారు.

ఈసమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వివిధ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇప్పటి వరకూ వివిధ అంశాల్లో సాధించిన లక్ష్యాలను వివరించారు.అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి మాట్లాడుతూ పెరుగుదల సరిగా లేని మరియు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు గల పిల్లల్లో ఆలోపాలను నివారించేందుకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఐరన్ ఫోలిక్ సిరప్,టేక్ హోం రేషన్ కిట్లు పంపిణీతో పాటు వండిన ఆహారాన్ని అందించడం జరుగుతోందని వివరించారు.విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విద్యాశాఖకు సంబంధించిన ఎస్డిజి గోల్స్ సాధించిన లక్ష్యాలను తెలిపారు.

ఇంకా ఈసమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ జె.నివాస్,గృహనిర్మాణ శాఖ స్పెషల్ సెక్రటరీ దివాన్ మైదీన్,గ్రామ వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్ భావన పాల్గొనగా వీడియో లింక్ ద్వారా మహిళా శిశు సంక్షేమశాఖ కమీషనర్ జానకి,ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎం.గిరిజా శంకర్,స్కూల్ ఇన్ప్రాస్ట్రక్చర్ కమీషనర్ కె.భాస్కర్ పాల్గొన్నారు. 


Comments