మైనింగ్ తో సంబందం లేని కంపెనీలకు ఇసుక కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారు?

 


తెర వెనుక తన తమ్ముడిని పెట్టి జగన్ రెడ్డి ఇసుక దోపిడికి పాల్పడుతున్నారు


మైనింగ్ తో సంబందం లేని కంపెనీలకు ఇసుక కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారు? - నక్కా ఆనందబాబు 

అమరావతి (ప్రజా అమరావతి);

తెర వెనుక తన తమ్ముడిని పెట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇసుక దోపిడికి పాల్పడుతున్నారని, మైనింగ్ తో సంబందం లేని కంపెనీలకు ఇసుక కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారని పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.....ఇసుక టెండర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీనివెనుక సీఎంవో ప్రమేయం ఉంది. ఏపీఎండీసీని కాదని కోల్ కతా కంపెనీతో టెండర్లు నిర్వహించటం ఏంటి? టెండర్ లో ఏముందో తెలుసుకోవాలంటే రూ.  29.5 లక్షలు కట్టాలంట. బిడ్ సెక్కూరి  రూ. 120 కోట్ల నుంచి రూ. 77 కోట్లకు తగ్గించారు. టెండర్ రిజర్వ్ ధర 1529 కోట్లకే పరిమితం చేశారు. దీని వెనుక సీఎంవో కుట్ర దాగి ఉంది. జేపీ వెంచర్స్ కి మే నెలలోనే  అగ్రిమెంట్ కాలపరిమితి దాటింది. నేటికీ ఏ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. కొత్త టెండర్ పిలిచే వరకు జేపీ వెంచర్స్ కి అనుమతులు పొడుగిస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి  నోటి మాటగా చెప్పారు తప్ప అందుకు ఏమైనా ఆదేశాలిచ్చారా?  పొడిగించినట్టు ఆధారాలు ఏవి? అడ్డగోలుగా వైసీపీ నేతలు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. 110 రీచ్ లలో అనుమతుంటే 500 పైగా రీచ్ లలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఎన్విరాల్ మెంట్  క్లియరెన్స్  లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. వే బిల్లులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతుంటే కలెక్టర్లు ఏం చేస్తున్నారు? సెంట్రల్ సర్వీస్ లో ఉన్న వెంకటరెడ్డిని డిప్యూటేషన్ పై తీసుకొచ్చి ఏపీఎండీసీ డైరక్టర్ గా నియమించి అక్రమ ఇసుక దోపిడి చేస్తున్నారు. అడ్డగోలుగా ఇసుక దోపిడి చేస్తూ చంద్రబాబుపై అక్రమ కేసు పెడతారా? రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్ ల్లో తవ్వకాలు ఆపేయాలని  వైసీపీ ప్రభుత్వానికి ఎన్జీటీ మొట్టికాయలు వేయటం వాస్తవం కాదా? డిప్యుటేషన్ పై వచ్చిన డైరక్టర్ కి మాజీ ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టే అధికారం ఎక్కడిది? గత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్ని డిప్యూటేషన్ పై వచ్చిన అధికారి తప్పు పట్టడం ఏంటి? ఆయన ఫిర్యాదు చేస్తే ఆధారాలు లేకుండా సీఐడీ కేసు నమోదు చేయటం విడ్డూరం. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక భారీ అక్రమాలు జరుగుతున్నాయి. వందల కోట్ల రూపాయలు  వెంకటరెడ్డి లాంటి వాళ్లు దోచుకుంటూ  ముఖ్యమంత్రికి వేల కోట్లు పంపిస్తున్నారు. ఉచిత ఇసుక ఇచ్చి సామాన్యులకు న్యాయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే.  కానీ జగన్ రెడ్డి ఉచిత ఇసుక రద్దు చేసి 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డున పడేశారు. మేం అడిగిన ప్రశ్నలకు వెంకటరెడ్డి సమాదానం చెప్పేవరకు వదలిపెట్టం.  ఇప్పుడు ఇసుకలో దోచుకుంటున్న వారి నుంచి తిన్నదంతా టీడీపీ అధికారంలోకి రాగానే కక్కిస్తామని ఆనందబాబు హెచ్చరించారు.

Comments