మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే అభివృద్ధి శూన్యం.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


 *మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే అభివృద్ధి శూన్యం* *ఇప్పటంలో ఆఫ్ కిలోమీటర్ రోడ్డు వేసి అభివృద్ధి అంటే ఎలా*


*జనసేన,టీడీపీ, తాడేపల్లి మండలఅధ్యక్షులు  సామల నాగేశ్వరరావు,అమరా సుబ్బారావు విమర్శలు*


తాడేపల్లి మండలంలో రానున్న రోజులలో జనసేన టిడిపి కలిసి సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు

సామల నాగేశ్వరరావు, టీడీపీ తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు అన్నారు.

శనివారం సాయంత్రం

కొలనకొండలోని జనసేన తాడేపల్లి మండల కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఇప్పటంలో 12 కోట్లు ఖర్చుపెట్టి ఆఫ్ కిలోమీటర్ రోడ్డు వేసి అభివృద్ధి అంటే ఎలా అని ప్రశ్నించారు. కుంచనపల్లి నుండి రేవీంద్ర పాడు వెళ్లే రోడ్డుమరి దారుణంగా ఉందని అన్నారు.ఉండవల్లి రోడ్డు, మంగళగిరి నిడమర్రు రోడ్డుల్లో రోజుకి ఒక ఆక్సిడెంట్ జరుగుతుందని నాలుగున్నర సంవత్సరాల కాలంలో  ఏ రోడ్డు కూడా అభివృద్ధి చేయలేదని అన్నారు. దుగ్గిరాల మండలం రోడ్లన్నీ గుంతల మయంగా ఉన్నాయని విమర్శించారు. వాళ్ళ ఓట్లు కావాలి గాని  వారికి అభివృద్ధి అవసరం లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నేతన్నల విగ్రహం పెడితే సరిపోదని  నేతన్నలకు సీటు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. వైసిపి చేసిన తప్పులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ఎండగడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో

 జనసేన పార్టీ తాడేపల్లి మండల యువజన నాయకులు  తిరుమల శెట్టి నరసింహారావు,మండల కార్యదర్శి గాదె బాలమ్మ కొలనకొండ గ్రామ ఉపాధ్యక్షులు గొట్టిపాటి రాజేష్,తదితరులు పాల్గొన్నారు.

Comments