సీడాప్' ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా డాక్టర్ శ్యామ్ ప్రసాద్.

 'సీడాప్' ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా డాక్టర్ శ్యామ్ ప్రసాద్




అమరావతి (ప్రజా అమరావతి): సీడాప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) డాక్టర్ శ్యామ్ ప్రసాద్ నియమితులయ్యారు. గత 15 నెలల కాలంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  పేషీలో అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీగా సేవలందించారు. అంతకుముందు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొమ్మిదేళ్లపాటు కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో ఉన్న పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో టెక్నికల్ వీఏఎస్ గా  క్రియాశీలకంగా విధులు నిర్వర్తించారు.


అంతకుముందు పశుసంవర్థక శాఖ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ గా మంత్రాలయంలో బాధ్యతలు నిర్వర్తించి తనదైన ముద్ర వేశారు.  విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లోని  సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ సంస్థ (ఎస్ఈఈడీ ఏపీ-సీడాప్)  కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కీలక పోస్టులో కొత్త బాధ్యతలు స్వీకరించారు. ఎక్కడ పని చేసినా నిశబ్దంగా తన పని చేసుకుని పోయే స్వభావం ఉన్న శ్యామ్ ప్రసాద్ ఇటీవల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను కలిసినపుడు రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు అందించడం కోసం కష్టపడి పని చేయాలని పేర్కొన్నట్లు  డాక్టర్ శ్యామ్ స్పష్టం చేశారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ కు సీడాప్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిని పరిచయం చేసి ఎండీ, సీఈవో శ్రీనివాస్ ఆల్ ది బెస్ట్ తెలిపారు. అంతకుముందు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ను ఈడీ శ్యామ్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Comments