డోన్ రహదారులు..ప్రగతికి చిహ్నాలు : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్



*డోన్ రహదారులు..ప్రగతికి చిహ్నాలు : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*'రహదారులు' వేసిన మంత్రి బుగ్గనకు వృద్ధ రైతు దంపతుల "పూలదారి"*


*గుండె నిండా ప్రేమతో మంత్రి బుగ్గనకు  అభివాదాలతో అడుగడుగునా నీరాజనం*


*రూ.3.56 కోట్లతో  రహిమాన్ పురం నుండి నాగమళ్ల కుంట వరకు నిర్మించిన రోడ్డు ప్రారంభం*


*రూ.22 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును  ప్రారంభించిన మంత్రి బుగ్గన*


*రూ.2 కోట్లతో నిర్మిస్తోన్న వాల్మీకి భవనాన్ని పరిశీలించిన ఆర్థిక మంత్రి*



 బేతంచెర్ల, నంద్యాల జిల్లా, నవంబర్, 28 (ప్రజా అమరావతి); డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుగ్గన రాజేంద్రనాథ్ కు అడుగడుగునా ప్రజలు అభిమానం చాటుతున్నారు. బేంతచెర్ల రూ.3.56 కోట్లతో  నిర్మించిన రహదారిని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రహిమాన్ పురం నుండి నాగమళ్ల కుంట వరకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కొత్త రోడ్డుపై పాదయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక నాగమళ్లకుంట, రహిమాన్ పురం గ్రామ ప్రజలు ఆర్థిక మంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రజలు, రైతు కూలీలతో మాట్లాడుతు 5 కి.మీ పాదయాత్రను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పూర్తి చేశారు. అనంతరం రూ.22 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ఆర్థిక మంత్రి ప్రారంభించారు. వాల్ ను తిప్పుతూ నీటి సరఫరాను ఆర్థిక శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ రెండు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పైలాన్ లను ఆవిష్కరించారు.


*వృద్ధ రైతు దంపతుల 'ప్రత్యేక' అభిమానం..కృతజ్ఞతతో మంత్రి బుగ్గన ఆత్మీయ అభివాదం*


రోడ్డు వెంట పొలంలో పనులు చేసుకునే కూలీలు గుండె నిండా ప్రేమతో పాదయాత్రకు సంఘీభావంగా స్వయంగా వచ్చి పాదయాత్ర చేస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు అభివాదం చేశారు. ఆ పాదయాత్ర నాగమళ్లకుంట గ్రామానికి  చేరగానే ఉల్లి కృష్ణయ్య  దంపతులు రహదారులు నిర్మించిన ఆర్థిక మంత్రి బుగ్గనకు పూలదారి పరిచారు. రోడ్డు పక్కనే ఉన్న తమ బంతి పూల తోటలోని పువ్వులను కోసి వల్లె (టవల్) లో తీసుకుని వచ్చి..అవి అయిపోయే వరకూ వారిరువురు మంత్రి నడిచే దారిపై వేస్తూ మంత్రి పట్ల అభిమానం చాటారు. పెద్దవారు, అలా చేయవద్దని మంత్రి చెబుతున్నా వినకుండా తమ కల్మషం లేని ప్రేమను ప్రదర్శించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా అంతే కృతజ్ఞతగా వారిరువురికి మన:పూర్వక కృతజ్ఞతలతో అభివాదం చేశారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా పాదయాత్ర వాతవారణం భావోద్వేగంతో నిండిపోయింది.


 *వాల్మీకి భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బేతంచెర్లలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న వాల్మీకి భవనం పనుల పురోగతిని పరిశీలించారు.  కదమ పనులు శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కీలకమైప పునాది పనులు పూర్తయిన నేపథ్యంలో మిగతా పనులు కూడా యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ఈ కార్యక్రమంలో బేతంచెర్ల ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, బేతంచెర్ల మున్సిపల్ ఛైర్మన్ సీ.హెచ్ చలం రెడ్డి, మద్దలేటి స్వామి ఆలయ ఛైర్మన్ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.



Comments