సురక్ష కార్యక్రమంలో ఐదోదశ అన్నింటికన్నా ముఖ్యమైనది.


అమరావతి (ప్రజా అమరావతి);


*జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంపు కార్యాలయం నుంచి సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.* 



*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:* 


జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ రెండు ముఖ్యమైన కార్యక్రమాలమీద ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశాం:

జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైనది :

సురక్ష కార్యక్రమంలో ఐదోదశ అన్నింటికన్నా ముఖ్యమైనది



హేండ్‌ హోల్డింగ్‌.

దీనిపైన సమగ్రమైన అవగాహన ప్రతి అధికారికి ఉండాలన్న ధృడమైన నిర్ణయంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం :

వైద్య శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు చేయూత నివ్వడం చాలా ముఖ్యం:


జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావు:

శిబిరాలు నిర్వహణ పూర్తయిన తర్వాత అసలు పని మొదలవుతుంది :

శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తిస్థాయిలో చేయూత నివ్వడం అన్నది అత్యంత ముఖ్యమైన అంశం :

కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నయం అయ్యేంతవరకూ మనం చేదోడుగా నిలుస్తాం:


వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చింది:

దాదపు 91 శాతం అర్భన్‌ ఏరియాల్లోనూ ఈ కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్‌ కార్యక్రమం పూర్తయింది :

గ్రామీణ ప్రాంతాల్లో  94.94 శాతం ఇంటింటికీ స్క్రీనింగ్‌ కార్యక్రమం పూర్తయింది :


మొదటగా ప్రతి ఇంటికీ వెళ్లి.. జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహించాం:

ఆ పేషెంట్లను శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇవ్వడం జరుగుతోంది:

1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్‌ పూర్తి చేశారు :

ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు,ఆశావర్కర్లు ద్వారా స్క్రీనింగ్‌ చేయించడమే కాకుండా... దాదాపుగా 6.4 కోట్ల ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు :

అంటే ప్రతి ఇంటిలో సరాసరి 4 టెస్టులు నిర్వహించారు :

10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 9869 క్యాంపులు అంటే 98 శాతం పూర్తి అయ్యాయి.

పట్టణ ప్రాంతాల్లో అయితే 2390 క్యాంపులు చేయాల్సి ఉండగా... 1841 క్యాంపులు వార్డు సచివాలయాల్లో పూర్తయ్యాయి. అంటే దాదాపు 77శాతం శిబిరాల నిర్వహణ పూర్తయ్యింది:

గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్యాంపుల నిర్వహణ ఈ నెల 22 నాటికి దాదాపు పూర్తవుతావు :

పట్టణ ప్రాంతాల్లో 29, నవంబరు నాటికి పూర్తవుతాయని సమాచారం :


ఇప్పుడు మనం జనగనన్న సురక్ష కార్యక్రమం ఐదో దశలో ఉన్నాం :

ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక యాప్‌ను మనం వాడుతున్నాం:

దీని ద్వారా క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుంటున్నాం:

వారి ఆరోగ్య పరిస్థితులను యాప్‌ ద్వారా నమోదు చేస్తున్నాం:

ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలన్న దానిపై మన దగ్గర డేటా ఉంది :

వీటికి సంబంధించి 3 కేటగిరీలు.

ఒకటి మనం జల్లెడ పట్టి క్యాంపులకు తీసుకువచ్చినవారు ఒక  కేటగిరీ. 


1. జగనన్న సురక్ష క్యాంపుల్లో నవంబర్‌ 5  కల్లా దాదాపు 85వేల మంది పేషెంట్లను తదుపరి చికిత్సలకోసం నెట్‌వర్క్‌ ఆసుపత్రికి లేదా టీచింగ్‌ఆస్పత్రులకు రిఫర్‌ చేశాం. 

వీరికి చేయూత నివ్వడం ఒక కార్యక్రమం.

వీరందరినీ మొబైల్‌ యాప్‌ ద్వారా ట్రాక్‌ చేసి, వారిని ఆయా ఆస్పత్రులకు మ్యాప్‌ చేయాలి. 

ఆ తర్వాత విలేజ్‌ క్లినిక్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు, గ్రామ సచివాలయంలోని వైద్య ఆరోగ్య సిబ్బందితో అనుసంధానం చేయించాలి : 

ఈ సిబ్బంది ద్వారా ఇలా ట్రాక్‌ చేసిన పేషెంట్లకు నయం అయ్యేంతవరకూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలి.

ఇది చాలా ముఖ్యమైనది.

ఈ 85 వేల కేసుల్లో 13,850 కేసులను ఇప్పటివరకూ చేయూత నిచ్చి వారిని తదుపరి చికిత్సలకోసం నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు లేదా జిల్లా ఆస్పత్రులకు పంపించడం జరిగింది :

మిగిలిన వారిని కూడా రాబోయే రోజుల్లో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పంపించి వారికి మంచి చికిత్స అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి.

వారికి కావాల్సిన మందులు ఇచ్చి.. వారిని నయం అయ్యేంత వరకూ కూడా తగిన విధంగా చేయూత నివ్వాలి.

దీని మీద ధ్యాసపెట్టాలి :

మిగిలిన ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి వాటి ద్వారా గుర్తించిన మొత్తం రిఫరల్‌ కేసులన్నింటికీ కూడా తదుపరి చికిత్సలు అందించే కార్యక్రమం డిసెంబర్‌ నెలాఖరు నాటికి నాటికి పూర్తిచేయాలి:

వీరు చికిత్సలు చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చాక వారికి తోడుగా ఉంటూ... వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని,  కావాల్సిన మందులు అందించడంతోపాటు, వారు వేసుకునేలా తగిన విధంగా చేయూత నివ్వాలి:

రిఫరల్‌ ఆస్పత్రులకు వెళ్లేందుకు ఈ పేషెంట్లకు రూ.500లు ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వాలి:

ఒకవేళ ఆరోగ్య శ్రీ ప్రొసీజర్‌లో కవర్‌ కాని కేసులు అక్కడక్కడా ఉండొచ్చు :

ప్రస్తుతం 3,300 ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్‌ ఉన్నాయి : 

ఈ ప్రొసీజర్స్‌లో లేని  వ్యాధులుంటే.. ఫ్యామిలీ డాక్టర్‌ రిఫరెన్స్‌ ద్వారా జిల్లా ఆస్పత్రికి, బోధనాసుపత్రులకు పంపించి ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలి:

అలాంటి రోగాలకు కూడా ఆరోగ్య శ్రీకింద ఉచితంగా చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలి:

ఈ మేరకు ఆరోగ్యశ్రీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాను :


*ఆరోగ్యశ్రీ పై విస్తృత అవగాహన*

2. ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు చేయించుకున్న పేషెంట్లపై దృష్టిపెట్టడం అన్నది మరొక విషయం. 

చికిత్సలు చేయించుకున్న తర్వాత వీరికి అందిన వైద్యంపై పూర్తి వివరాలు కనుక్కోవాలి:

ఎలాంటి లంచాలకు తావులేకుండా ఉచితంగా వైద్యం అందిందా? లేదా? అన్నది తెలుసుకోవాలి:

వారు మందులు తీసుకుంటున్నారా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలి. 

ఆరోగ్య ఆసరా అందిందా అని, నిర్ధారించుకుని, వాళ్ల ఫోటో కూడా పెట్టాలి :

ఆరోగ్య శ్రీ సేవలందుకున్న రోగులకు ఏడాదిపాటు ఉచితంగా మందులు అందిస్తున్నారు:

క్రమం తప్పకుండా తిరిగి వీళ్లు ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి:

పేషెంట్లకు తెలియక, సరైన అవగాహన లేక తదితర కారణాల వల్ల చికిత్సలు చేయించుకున్న రోగులు తిరిగి ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకోని సందర్బాలు చూస్తున్నాం:

మూడు నెలల తర్వాత కేవలం 33 శాతం పేషెంట్లు  మాత్రమే తీసుకుంటున్నారు :

సెకండ్‌ రిఫరల్‌ సర్వీసు అంటే ఆరు నెలల తర్వాత 22 శాతానికి, ఏడాది తర్వాత చూస్తే 8 శాతం మాత్రమే ఉంట్నునారు :

ఇలాంటి పరిస్థితులు ఇకపై ఉండకూడదు :

నిర్ణీత సమయానికి పేషెంట్లు వెళ్లి.. మందులు తీసుకునేలా చూడాలి:

ఈమేరకు మొబైల్‌ యాప్‌లో తగిన విధంగా ఫీచర్లు తీసుకురావడం జరిగింది:

పేషెంట్లు నిర్ణీత కాలానికి ఆస్పత్రులకు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత విలేజ్‌ క్లినిక్స్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు ఉంది:

జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల కింద గుర్తించిన పేషెంట్లకు నాణ్యమైన సేవలు అందించడం అన్నది అత్యంత ముఖ్యమైన విషయం:


*ప్రతి మొబైల్‌లో ఆరోగ్య శ్రీ యాప్‌* 

అలాగే ఆరోగ్య శ్రీ సేవలు ఎలా పొందాలన్నదానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి:

డిసెంబరు1 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలి :

మంచి ఫీచర్లతో ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చాను:

డిసెంబర్‌1 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలి:

ఆరోగ్య శ్రీని ఎలా పొందాలన్నదానిపై దానిపై ప్రతి ఒక్కరికీ తెలియాలి:

ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలో తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు :

ప్రతి ఒక్కరి ఫోన్లో, ప్రతి ఇంటిలో ఆరోగ్య శ్రీ యాప్‌ ఉండాలి:

1.24 కోట్ల మంది మహిళలు దిశ యాప్‌ను తమ ఫోన్లలో రిజిష్టర్‌ చేసుకున్నారు :

దిశ తరహాలోనే ప్రతి ఫోన్లో ఆరోగ్య శ్రీ యాప్‌ఉండాలి :

ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేకపోతే...ఆరోగ్య శ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి:

దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదు :

యాప్‌లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్‌ ఆస్పత్రికి మార్గం చూపిస్తుంది:

లేకపోతే విలేజ్‌ క్లినిక్‌ను అడిగినా, అలాగే 104ను అడిగినా తగిన రీతిలో గైడ్‌ చేస్తారు :

ఆరోగ్య శ్రీ సేవలను ఎలా పొందాలన్నదానిపై బుకెట్‌ కూడా ప్రతి కుటుంబానికీ అందిస్తారు:

సీహెచ్‌ఓ, ఏఎన్‌ఎలు, ఆశావర్కర్లు ఆరోగ్యశ్రీని వినియోగించుకోవడం పై అవగాహన కలిగించాలి :

మనం రాకమునుపు 950 నెట్‌ వర్క్‌ ఆసుపత్రులంటే... మనం వచ్చిన తర్వాత 2,295 నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి:

మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోని మంచి ఆసుపత్రులను కూడా ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్‌ చేశాం :

అయినా వైద్యంకోసం ప్రజలు ఎందుకు తమ జేబుల్లోనుంచి డబ్బులు ఖర్చుచేసుకోవాల్సిన అవసరం ఏముంది?

అలాంటి పరిస్థితులు ఇకపై లేకుండా చూడటం మన అందరి బాధ్యత :



*కంటి వెలుగు.*

ఆప్తమాలజీకి సంబంధించిన పేషెంట్ల వివరాలు చూస్తే... 8.72 లక్షల మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారు :

5.22 లక్షల మందికి కంటి అద్దాలు ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు :

వీరికి వెంటనే కంటి అద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలి:

అలాగే 73,474 వేలమందికి కంటి సర్జరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు:

వీరికి కూడా వెంటనే సర్జరీలు చేయించేలా చూడాలి:

డిసెంబర్‌ నెలాఖరు నాటికి ఈ కార్యక్రమాలన్నీకూడా పూర్తికావాలి:

హైపర్‌ టెన్షన్‌ కేసులు 2,48,638 గుర్తించారు, వీరిందరికీ కన్ఫర్మేషన్‌ టెస్టులు చేసి, అప్పుడు మందులు ఇవ్వాలి :

1,49,879 డయాబెటిస్‌ కేసులు గుర్తించారు :

డయాబెటిస్‌ ఉన్నట్టుగా గుర్తించిన వారికి కూడా తదుపరి నిర్ధారణ పరీక్షలు చేయించాలి:

అందులోకూడా నిర్ధారణ అయిన తర్వాత వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి :

ప్రివెంటివ్‌ కేర్‌లో ఇది కీలక అంశం :

వీరికి చేయూత నందించాలి:


పౌష్టికాహారం లోపం, రక్తహీనత సమస్యలను పూర్తిగా నివారించాలి:

ఈ సమస్యలతో బాధపడుతున్నవారికి సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం అందుతుందా, వారికి మందులు అందుతున్నాయా అన్న విషయాన్ని విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా పరిశీలన చేయించాలి:

లక్ష్యాలను సాధించడానికి దేశంలో ఏ రాష్ట్రాంలోని కలెక్టర్లకు లేని యంత్రాంగం, మన రాష్ట్రంలో కలెక్టర్లకు ఉంది:

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, గ్రామ సచివాలయంలాంటి వ్యవస్ధలు లేవు :

సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో అన్ని రాష్ట్రాలకన్నా ముందు ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి:

కలెక్టర్లకు మంచి అభిరుచి ఉంటే కచ్చితంగా లక్ష్యాలు సాధిస్తాం: 

వీరి మీద కూడా మహిళా, శిశుసంక్షేమశాఖ అధికారులు దృష్టి పెట్టాలి :

వీరికి మందులు, సంపూర్ణ పోషణం ప్లస్‌ ద్వారా తగిన ఆహారం కూడా ఇప్పించాలి :

ప్రతి కలెక్టర్‌ దీన్ని ఛాలెంజ్‌గా తీసుకుని.. జీరో ఎనీమిక్‌ కేసులు దిశగా ప్రయత్నించాలి :


అలాగే 9,969 మందికి లెప్రసీ అనుమానాస్పద కేసులు ఉన్నాయి:

వీరికి వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి:

వీరికి కూడా మరోసారి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి :

అలాగే 442 మందికి టీబీ ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది:

వీరికి సక్రమంగా మందులు అందించాలి :

1239 మంది చిన్నారులు 4–డి(డెఫిసియన్సీస్, డిఫెక్ట్స్‌ ఎట్‌ బర్త్, డిసీసెజ్, డెవలప్‌మెంటల్‌ డిలేస్‌) సమస్యలతో బాధపడుతున్నట్టుగా తేలింది:

వీరికి సాధ్యమైనంత త్వరగా అవసరమైన చికిత్సలు అందించడంపై దృష్టిపెట్టాలి:

కాక్లియర్‌ ఇంప్లాంట్లాంట్‌ చికిత్సలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందించడం వల్ల ఆ పిల్లలు ఈ సమస్యలనుంచి బయటపడతారు :


*దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకూ అండగా...*

3. ఒక మూడోది ఇప్పటికే తీవ్రరోగాలతో బాధపడుతున్న వారికి తగిన రీతిలో చేయూత నందించాలి :

కిడ్నీ పేషెంట్లు, లివర్‌ పేషెంట్లు, మస్క్యులర్‌ డిస్ట్రోపీ వంటి వాళ్లకు మందులు ఖరీదైనవి కాబట్టి, వాళ్లు మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు :

అలాంటి వారికి కూడా మందులు అందించాలి :

వారికి కూడా చేయూత నందించాలి :

మందులు ఎంత ఖరీదైనా సరే, పేషెంట్లకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది : 

ఈ మేరకు అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను :

గ్రామ వార్డు సచివాలయం, విలేజ్‌ క్లినిక్స్‌ ఆధారంగా మ్యాపింగ్‌ చేసి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో అనుసంధానం చేయాలి.


*మరింత విస్తరించనున్న టెర్షరీ కేర్‌ మెడికల్‌ సర్వీసెస్‌.*

రాబోయే రోజుల్లో ఆరోగ్య సేవలు మరింత విస్తరించనున్నాయి:

17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చురుగ్గా సాగుతోంది:

ప్రతి జిల్లాలోకూడా అత్యాధునిక సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉంటుంది:

ఒకవైపు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను కూడా పునరుద్ధరిస్తునే ఇవన్నీ చేపడుతున్నాం :

రిక్రూట్మెంట్‌ పాలసీ మీద కలెక్టర్లు పూర్తిగా అవగాహన పెంచుకోవాలి:

ఏ జిల్లాలోలైనా స్పెషలిస్టులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత లేకుండా సంబంధిత జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలి:

ఇప్పటికే  కేవలం ఆరోగ్య రంగంలో 53 వేల ఖాళీలను మనం భర్తీచేశాం:

ఎక్కడ ఖాళీలు ఉన్నా, వెంటనే భర్తీచేసేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి:

ఆరోగ్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాం కాబట్టే, రాష్ట్రంలో తొలిసారిగా మెడికల్‌ బోర్డును సృష్టించడం జరిగింది :

ప్రివెంటివ్‌ కేర్‌లో జగనన్న సురక్ష, విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌ అత్యంత కీలకం అవుతున్నాయి :


జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు:

ప్రతి వారం కూడా మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించాలి. 

నెలలో నాలుగు క్యాంపులు నిర్వహించాలి:

ఐదు నెలల్లో మళ్లీ అదే గ్రామంలో క్యాంపు నిర్వహణ సమయం వస్తుంది:

దీనివల్ల సంతృప్త స్థాయిలో సేవలు అందుతాయి:

ఆరోగ్య పరంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి అవసరాలు తీర్చడం మన బాధ్యత:

ఆరు నెలల్లో ప్రతి మండంలో ప్రతి గ్రామంలో క్యాంపు జరుగుతుంది, ఇదొక నిరంతర ప్రక్రియ :

ఆరోగ్య శ్రీ కింద నమోదుకాని రోగాలు ఏమైనా కనిపించినా.. ప్రత్యేక కేసుల కింద పరిగణించి వారికి ఉచితంగా ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు అందిస్తాం:

ఈ పేషెంట్లను గుర్తించి, వారికి చికిత్సలు అందించే బాధ్యతను మనమే తీసుకోవాలి:



*వై ఏపీ నీడ్స్‌ జగన్‌.*

నవంబర్‌ 9 నుంచి వై ఏపీ నీడ్స్‌ జగన్‌ పేరిట కార్యక్రమం:

ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచి గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది:

ఇంటింటికీ ఎలాంటి మేలు జరిగింది, మన ఇంటికి, మన గ్రామానికి ఏం మేలు జరిగింది అన్నది తెలియాలి :

గ్రామాల వారీగా ఎంత డీబీటీ ఇచ్చాం, ఎంతమందికి ఎలా లబ్ధి జరిగింది అన్నదానిపై ప్రతి ఒక్కరికీ వివరాలు అందించాలి:

గ్రామాల వారీగా ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారో చెప్పాలి:

గ్రామాలవారీగా ఎంత మంచి జరిగిందో చెప్పాలి:

డీబీటీ ద్వారా, నాన్‌ డీబీటీ ద్వారా ఏయే పథకాలలో ఎంత మేలు పొందుతున్నారో వారికి తెలియాలి :

ఏయే పథకాలు అమలు అవుతున్నాయో కూడా తెలియాలి :

ఒకవేళ ఎవరికైనా ఏమైనా అందకపోతే వారికి అందించేలా చర్యలు తీసుకోవాలి:

అదే విధంగా ఆ గ్రామంలో స్కూళ్లో నాడు – నేడు ద్వారా వచ్చిన మార్పులు చెప్పాలి:

ఇంగ్లిషు మీడియం, స్కూళ్లలో 6వతరగతి నుంచే ఐఎఫ్‌ఫీ ప్యానెల్స్, 8వతరగతిలో ట్యాబులు పంపిణీ వరకూ మారుతున్న స్కూళ్ల వ్యవస్ధ గురించి చెప్పాలి :

వైద్యరంగంలో విలేజ్‌ క్లినిక్స్‌తో సహా గ్రామంలో వచ్చిన మార్పు గురించి చెప్పాలి :

ఆర్బీకేల్లాంటి వ్యవస్థతోపాటు, వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు గురించి చెప్పాలి :

ప్రతి ఎకరాకు ఇ–క్రాప్‌ చేపడుతున్న విషయం కూడా చెప్పాలి :

పారదర్శకత ఏరకంగా పాటిస్తున్నామో చెప్పాలి:

సోషల్‌ఆడిడ్‌ ద్వారా  నాణ్యంగా అందుతున్న సేవలు :

దిశ యాప్‌ ద్వారా అందుతున్న సేవలు :

తదితర అంశాలన్నింటిపైనా ప్రజలకు ఈ కార్యక్రమంద్వారా చెప్పాలి:

ప్రభుత్వ పరిపాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి వారికిచెప్పాలి:

ఆర్థిక ప్రగతిలో గతంలో ఎలా ఉండేవాళ్లం? ఇప్పుడు ఎలా ఉన్నాం? అన్న అంశాలపై చెప్పాలి:

డీబీటీ, నాన్‌ డీబీడీ, గ్రామంలో లబ్ధిదారుల గురించి పూర్తి అవగాహన కల్పించాలి:

ఈ వివరాలతో కూడిన డేటాతో సహా, జరిగిన మంచిపై ఆధారాలు చూపిస్తూ చేయాలి:

ఇది చాలా ముఖ్యమైన అంశం:

ప్రభుత్వ పరిపాలనలో వచ్చిన మార్పులపై అవగాహన తెలియజేయడంతోపాటు, అంతేకాక ఆ పథకాలను ఏరకంగా వాడుకోవాలన్నదానిపై  కూడా వారికి అవగాహన కల్పించాలి:

ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బోర్డులు పెట్టాలి:

ఏయే పథకంద్వారా ఎంతమందికి లబ్ధి పొందింది అన్నదీ దీనిద్వారా చెప్పాలి:

డీబీటీ ఎంత? నాన్డీబీటీ ఎంతో వివరాలు పొందుపరచాలి:

నాడు – నేడు ద్వారా చేసిన ఖర్చు ఎంత?

గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ కోసం ఎంత ఖర్చు చేశామో చెప్పాలి?

అలాగే గడపగడపకూ మన ప్రభుత్వం(జీజీఎంపీ) ద్వారా గుర్తించిన ప్రాధాన్యతా కార్యక్రమాలకోసం చేసిన ఖర్చును చెప్పాలి:

ప్రతి మండలంలో ప్రతిరోజూ ఒక సచివాలయంలో ఈ కార్యక్రమం జరగాలి:

అలాగే అర్బన్‌ ఏరియాలో కూడా ఒక సచివాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించాలి:

ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఈవో పంచాయితీరాజ్, పట్టణప్రాంతాల్లో అడిషనల్‌ కమిషనర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా ఉంటారు :

ఇందులో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొంటారు :

నవంబరు 9 నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది :


ఆ తర్వాత తగిన టైం తీసుకుని వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాన్ని అభిమానించే వారు ఎవరైనా...  జరిగిన మంచి ఏమిటన్నది ప్రతి ఇంటికీ వివరిస్తారు :

గతానికి భిన్నంగా పరిస్థితులు ఎలా మెరుగుపడ్డాయి, ఎంత  మంచి జరిగింది అన్నదాన్ని ప్రతి ఇంటికీ తీసుకుని వెళ్తారు :

Comments