పల్లెపల్లెలో వరుస ప్రారంభోత్సవాలు..డోన్ లో అభివృద్ధి వారోత్సవాలు : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

 



*పల్లెపల్లెలో వరుస ప్రారంభోత్సవాలు..డోన్ లో అభివృద్ధి వారోత్సవాలు : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*



*బేతంచెర్లలో రూ.30కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆర్థిక మంత్రి*


*అభివృద్ధి చేసిన వారికన్నా చేసే అవకాశం ఇచ్చిన ప్రజలదే ఘనత*


*టీడీపీ విష ప్రచారానికి..కళ్ల ముందు కనిపించే అభివృద్ధే సమాధానం*


*టీడీపీది అక్రమాల పురాణం..అబద్ధాల ప్రచారం*


 *ప్రారంభోత్సవం అనంతరం హెచ్.కొట్టాల సభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధి ప్రవాహంలో ప్రత్యర్థులు కొట్టుకుపోతారు : ఎంపీ పోచా*


*ఎమ్మెల్యేగా బుగ్గనను గెలిపించుకున్న ప్రజలదే అదృష్టం : జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి*


బేతంచెర్ల, నంద్యాల జిల్లా, నవంబర్, 06 (ప్రజా అమరావతి); తాను తొలిసారి గెలిచి ప్రతిపక్షానికే పరిమితమైనా..రెండోసారి కూడా గెలిపించిన డోన్ ప్రజలదే అభివృద్ధి ఘనత అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. బేతంచెర్ల  మండలంలో రూ.30 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను మంత్రి బుగ్గన సోమవారం ప్రారంభించారు. బేతంచెర్ల మున్సిపాలిటీ పరిధిలో రూ.28 కోట్లతో నిర్మించిన నాలుగు లైన్ల రహదారులకు సంబంధించిన పైలాన్ లను నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో కలిసి మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. రూ.19.20 కోట్లతో కాల్వ-బేతంచెర్ల-బనగానపల్లి రహదారి 6.8 కి.మీ మేర నిర్మించినట్లు మంత్రి స్పష్టం చేశారు. రూ.8.20 కోట్లతో  3.4 కి.మీ మేర బేతంచెర్ల-డోన్  నాలుగు లైన్ల రహదారి విస్తరించినట్లు పేర్కొన్నారు. బేతంచెర్ల నుంచి హెచ్.కొట్టాల గ్రామం వరకూ సుమారు 9కి.మీ పాదయాత్ర చేస్తూ జనంతో ఆర్థిక మంత్రి మమేకమయ్యారు. మంత్రి బుగ్గన పాదయాత్రకు సంఘీభావంగా పెద్ద ఎత్తునబేతంచెర్ల పుర ప్రజలు, మహిళలు తరలివచ్చారు.పట్టణంలో వేలాది కుటుంబాలకు జీవనాధారమైన  నాపరాయి పరిశ్రమకు 5% శాతం జీఎస్టీ సాధించినందుకు  మంత్రి బుగ్గనకు సంబంధిత సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు.  నియోజకవర్గ ప్రగతి స్వరూపాన్ని మార్చినందుకు కృతజ్ఞతగా అడుగడుగునా గజమాలలతో సత్కరిస్తూ ఆర్థిక మంత్రికి పుర ప్రజలు నీరాజనం పలికారు.ఈ సందర్భంగా పట్టణంలో ఇటీవల ఏర్పాటైన రావ్ బహదూర్ బీ.పీ శేషారెడ్డి విగ్రహాన్ని ఆర్థిక మంత్రి ఆవిష్కరించారు.మంత్రి బుగ్గన మీద అభిమానంతో తన త్రిచక్ర వాహనంతోనే  రామకృష్ణారెడ్డి అనే దివ్యాంగుడు పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కొత్త బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానకి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత బుగ్గన శేషారెడ్డి సీ.హెచ్.సీ ముందు ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నివాళి పలికారు. హెచ్.కొట్టాల గ్రామానికి సమీపాన ఉన్న దర్గా, ఆంజనేయ స్వామి గుడిని మంత్రి బుగ్గన సందర్శించారు. 


*గెలిపించిన ప్రజల మనసు గెలుచేలా డోన్ లో మౌలికసదుపాయాల అభివృద్ధి : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన*


గత ప్రభుత్వంలో  ఎమ్మెల్యేగా గెలిచినా..అధికార పార్టీ ఆధిపత్యానికి   ఏం చేయలేని నిస్సహాయతలో ప్రతిపక్షం పరిమితమైనా..రెండోసారి డోన్ ప్రజలు గెలిపించారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ప్రజలిచ్చిన అవకాశం, సీఎంకు తనపైగల నమ్మకంతో రాష్ట్రంలోనే డోన్ ను మోడల్ గా తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నా..హెచ్.కొట్టాల వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టే అవకాశం కూడా ఇవ్వకూడదనేలా నాటి జిల్లా మంత్రి ప్రయత్నించిన సందర్భాన్ని మంత్రి గుర్తు చేశారు. ఏది ఏమైనా డిసెంబర్ కల్లా డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి తాగునీరు అందించడం ఖాయమని మంత్రి స్పష్టం చేశారు. 

బేతంచెర్లలో దాదాపు 110 గదులతో బీసీ రెసిడెన్షియల్, బాలుర పాఠశాల, మరియు జూనియర్ కళాశాల నిర్మాణానికి రూ.36 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఐటీఐ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి, వివిధ వృత్తి పనులవారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణను ఇచ్చే ఎమ్ఎస్ఎమ్ఈ సెంటర్ ను కూడా రూ.4 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.7.8 కోట్లతో నిర్మించనున్న ఐటీఐ కాలేజీ , అత్యాధునిక వసతులైన యంత్రాలు, పరికరాలు, సామాగ్రీ కోసం మరో రూ.3 కోట్ల నిధులను మంజూరు చేశామన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని కూడా రూ.25 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రూ.750 కోట్లతో నియోజకవర్గంలోని ఒక మండలంలో మొదలై..మరో మండలంలో అంతమయ్యే ఏకైక జాతీయ రహదారి డోన్ లో వేగంగా పనులు సాగుతున్నాయన్నారు. ఏడాదిలోనే జాతీయ రహదారి నిర్మాణం పూర్తైతే  కొట్టాల గ్రామ ప్రజలు కోటీశ్వరులవుతారన్నారు. బేతంచెర్లలో బీ.పీ శేషారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల సీ.హెచ్.సీ గా తీర్చిదిద్దామన్నారు. హాస్టల్ ల్ కి వెళ్లినప్పుడే గోరుముద్ద,తల్లి ప్రేమ విలువ అర్థమవుతుందన్నారు. అదేవిధంగా మంచి పరిపాలన స్వార్థంలేని  నాయకుడి ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కోవిడ్ సమయంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించిన సేవలు ప్రపంచానికే ఆదర్శమన్నారు. 


*టీడీపీది..అక్రమాల పురాణం..అబద్ధాల ప్రచారం : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


బేతంచెర్ల పట్టణంలో సెంటున్నర ప్లాట్లు ఇస్తామనే టీడీపీ ప్రచారం ఆచరణలో అసాధ్యమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. 12వేల మంది రేషన్ కార్డుదారులకు 12 వేల ప్లాట్లు ఇవ్వాలంటే 300 ఎకరాలవసరమన్నారు. ఒక్క బేతంచెర్లకే ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున 300 ఎకరాలకు రూ.600 కోట్లపైన వ్యయం చేయడం సాధ్యమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల మోసాలు, కుతంత్రాలను లోతుగా ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిత్యం ఇంట్లో తినేవారికి అప్పుడప్పుడు హోటల్ కి వెళ్తే బాగుండనిపిస్తుంది..కానీ ఇంటి వంటే ఆరోగ్యమన్నారు. హోటల్ మీల్ గురించి అసలు ఆలోచించవద్దన్నారు. ప్రసంగం అనంతరం రూ.2.5 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును హెచ్.కొట్టాల గ్రామస్థుడు మంత్రి బుగ్గన చేతుల మీదుగా తీసుకున్నారు. 


*36 చెరువులకు నీరు నింపడం చిన్న విషయం కాదు : నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి*


ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధి ప్రవాహంలో ప్రత్యర్థులు ఎవ్వరైనా కొట్టుకుపోవాల్సిందేనని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. డోన్ నియోజకవర్గవ్యాప్తంగా 36 చెరువులకు  నీరు నింపడం చిన్న విషయం కాదని మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధిని మెచ్చుకున్నారు. మౌలికసదుపాయాలన్నీ కలగలిసి సమగ్రాభివృద్ధిలో ముందున్నది డోన్ నియోజకవర్గం ఒక్కటేనన్నారు.  డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ప్రజలకు మంత్రి బుగ్గన రూపంలో అదృష్టం వరించిందని జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి వెల్లడించారు. రూ.2,500 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసిన ఏకైక నాయకుడు మంత్రి బుగ్గన అని  ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు.


ఈ కార్యక్రమంలో  నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, బేతంచెర్ల మున్సిపల్ ఛైర్మన్ చలం రెడ్డి, మద్దలేటి స్వామి ఆలయ ఛైర్మన్ రామచంద్రుడు, ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, వైసీపీ నాయకులు బాబుల్ రెడ్డి, డోన్ ఆర్డీవో వెంకటరెడ్డి, బేతంచెర్ల మండల తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Comments