రైతులు అధీకృత విత్తన డీలర్లు వద్ద కొనుగోలు చేయాలి.

 కొల్లిపర మండలం గ్రామ రైతు సోదరులకు విజ్ఞప్తి.

కొల్లిపర (ప్రజా అమరావతి);

మన గ్రామాలలో Mahyco కంపెనీ MSH-51జొన్న విత్తనాలు మరియు ఇతర జొన్న, మొక్కజొన్న  విత్తనాలును కొంత మంది ఎటువంటి బిల్లులు లేకుండా తక్కువ ధరకు ఇచ్చే అవకాశం ఉంది. 

ఆ విత్తనాలు నకిలీ విత్తనాలు కావొచ్చు. 

కావున, రైతులు అప్రమత్తంగా ఉండి అధీకృత విత్తన డీలర్లు వద్ద మాత్రమే సరైన బిల్లు ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. జొన్న పంట కాలం పూర్తి అయ్యేవరకు కొనుగోలు బిల్లులు భద్ర పరుచు కోవాలని వ్యవసాయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.


ఎవరైనా విత్తనాలు సరైన బిల్లులు లేకుండా అమ్మకాలు చేసినచో వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయ బడుతాయి అని తెలిపారు.



Comments