కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

 జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలను అభివృద్ధి చేయడానికి కార్యచరణ పనులకు నివేదికలు సిద్ధం చేయండి


హిందూపురం పార్లమెంట్ సభ్యులు మరియు దిశ చైర్మన్ గోరంట్ల మాధవ్ 


కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి


 జిల్లా కలెక్టర్

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసినందుకు అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు

పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి.



పుట్టపర్తి. నవంబర్ 8 (ప్రజా అమరావతి):జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలను అభివృద్ధి చేయడానికి కార్యచరణ పనులకు నివేదికలు సిద్ధం చేయండి అందుకు కావలసిన నిధులను ఎంపీ ల్యాండ్స్ కింద నిధులు మంజూరు చేయడం జరుగుతుందనిహిందూపురం పార్లమెంట్ సభ్యులు మరియు దిశ చైర్మన్ గోరంట్ల మాధవ్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోనే సమావేశ మందిరంలో శ్రీ సత్య సాయి జిల్లాఅభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం హిందూపురం పార్లమెంట్ సభ్యులు మరియు దిశ చైర్మన్  గోరంట్ల మాధవ్ అధ్యక్షతన నిర్వహించగా, సమావేశంలో దిశా కమిటీ మెంబర్ సెక్రటరీ మరియు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, 

అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జడ్పీ సీఈఓ కేతన్ గార్గే, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిశా చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర 

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ సత్య సాయి జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టడానికి తమ వంతుగా సంపూర్ణ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం దిశ కమిటీ ఆధ్వర్యంలో  అజెండా మేరకు జల జీవన మిషన్, త్రాగునీటిపై సమీక్ష, ఆసుపత్రులు మరియు ఆరోగ్య సేవలు, ప్రభుత్వ పథకాలకు బ్యాంకు లింకేజీ, పంచాయతీరాజ్ రోడ్లు మరియు భవనాలు జాతీయ రహదారుల రోడ్డు పనుల పురోగతి,  వైకెపి ,మెప్మా పనితీరు ఎంపీ లాడ్స్, వ్యవసాయము ,ఉద్యానవన శాఖ, మైనర్ ఇరిగేషన్ శాఖల కార్యకలాపాలు మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ విద్య, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖల పనితీరుపై సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించి  సాధించిన ప్రగతి గురించి ఆయా శాఖల అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము  అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులను వీలైనంతగా అభివృద్ధి చేయాలన్నారు.డిఆర్డిఏ, మెప్మా పరిధిలో వివిధ పథకాల కింద అర్హత కలిగిన వారికి బ్యాంక్ రుణాలు ఇచ్చేలా చూడాలని, లబ్ధిదారులకు అవగాహన కల్పించి కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. జిల్లాలో ఎంపీ లాండ్స్ కింద మంజూరైన పనులను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, పనులను వేగవంతం చేయాలని సూచించారు.  జిల్లాలో మగ్గాలపై ఆధారపడి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా ఫీల్డ్ అసిస్టెంట్ ల ద్వారా ఉపాధి హామీ పథకం పని తీరు, వలసల నివారణపై మానిటర్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు బీమా పరిహారం అందించేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు.

అనంతరం జల జీవన్ మిషన్ కు సంబంధించి జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులనుఆదేశించారు. ఆరోగ్య సేవలకు సంబంధించి  అక్షయ్ పోషణ యోజనా పథకం ద్వారా ప్రతి టీబి పేషెంట్ కు పౌష్టిక ఆహారం అందించేందుకు నెలకు రూ.500 రూపాయలు చొప్పున  అందిస్తున్నందున జిల్లాలోని టీబి వ్యాధిగ్రస్తులకు కచ్చితంగా ఈ పథకాన్ని అమలు  చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టిని సారించి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఈ క్రమంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉన్నత వైద్యం కొరకు సిఫారసు చేసిన రోగులను ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు తరలించే క్రమంలో ప్రభుత్వం రవాణా భత్యం కింద రూ .500 రూపాయలను మంజూరు చేసిన నేపథ్యంలో సంబంధిత రోగులకు ఈ విషయంపై పూర్తిగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో మాతా, శిశు మరణాలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకొని మాతా,శిశు మరణాలను అరికట్టేందుకు కృషి చేయాలని ఎంపీ గోరంట్ల మాధవ్ సూచించారు. 

జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల లక్ష్యాలను సాధించుటకు ఆయా శాఖ అధికారులకు కేటాయించిన పథకాల పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే  ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఎంపీ లాడ్స్  తదితర పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే దిశా కమిటీ చైర్మన్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఆయా శాఖల కు సంబంధించిన ప్రగతి నివేదికలను సమర్పించి సహకారాలు తీసుకోవాలని సూచించారు. 

నిన్నటి రోజు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేసే విజయవంతం చేసినందు లకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు.


 అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జడ్పీ సీఈవో  సి.హెచ్ . కెతన్ గార్గ్ మాట్లాడుతూ పీఎం కిసాన్ పథకంలో సిసిఆర్ సి కార్డులు కలిగి ఉన్న కౌలు రైతులకు కూడా పీఎం కిసాన్  వర్తింపజేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చర్యలకు కృషి చేయాలని ఎంపీ గోరంట్ల మాధవ్ ను కోరగా దీనిపై ఎంపీ స్పందిస్తూ కౌలు రైతులకు కూడా పీఎం కిసాన్ పథకం అమలు అయ్యే విధంగా పార్లమెంట్ లో చర్చించి కృషి చేస్తానని తెలిపారు.

 

పుట్టపర్తి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు కష్టపడి పనిచేసి ఎలాంటి  పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా మీకు కేటాయించిన విధులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మీరు సక్రంగా పని చేశారని ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ఎమ్మెల్యే  కృతజ్ఞతలు తెలిపారు. నూతన జిల్లా ఏర్పడిన తరుణంలో అధికారులు బాగా పనిచేస్తున్నారని ఈ జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. తన నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇదివరకే నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా రోడ్లు భవనాలు మరియు పంచాయతీరాజ్ నేషనల్ హైవే శాఖలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని వాటిని డిసెంబర్ లోగా పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా కొత్తచెరువు మండలం గోరంట్లపల్లి ,నారేపల్లి ధూపం పల్లి బీటీ.సీసీ రహదారులు సత్వరమే పూర్తి చేయాలని కోరారు. 


అనంతరం ఎంపీ గోరంట్ల మాధవ్ సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులకు ప్రవేట్ పాఠశాలలో 25% అడ్మిషన్లు కల్పించాలని జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యకు పెద్దపీట వేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నందున విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కుటుంబాల్లోని పిల్లలందరూ బంగారు భవిష్యత్తు పొందే విధంగా ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నందున ప్రభుత్వ పాఠశాలలో , వసతి గృహాలు , మోడల్ స్కూల్స్ కేజీబీవీ కేంద్రాల్లోని విద్యార్థులకు అవసరమైన మేరకు అన్ని వసతులు కల్పించాలని ఈ విషయంలో తాను వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారాలు అందిస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలలో ఎలాంటి ఇబ్బందులను ఉన్న నేరుగా జిల్లా కలెక్టర్ లేదా తన దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.


ఈ సమావేశంలో  జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో లలితా  బాయి ,సిపిఓ విజయ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఈ రషీద్ ఖాన్,   డిఆర్డిఏ పిడి నరసయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు,  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిడా .ఎస్ వి కృష్ణారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి, ఏపీఎంఐపి పిడి సుదర్శన్ హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్ , డిపిఓ ఇన్చార్జ్ శివకుమారి  ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ  రషీద్ ఖాన్,వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు డ్వామా పిడి రామాంజనేయులు డిఎంహెచ్ఓ డా.యస్. వి కృష్ణరెడ్డి,డిసిహెచ్ఎస్ డా . తిప్పే నాయక్, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ అధికారులు శివ రంగ ప్రసాద్, నిర్మల జ్యోతి, మోహన్ దాస్  , వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Comments