కుల గణన అవగాహన కల్పించి సర్వే చేపట్టాలి.

   తెనాలి (ప్రజా అమరావతి);

 కుల గణన అవగాహన కల్పించి సర్వే చేపట్టాలి




 సామాన్యప్రజలకు కుల గణన పై అవగాహన కల్పించి సర్వే  చేపట్టాలని జిల్లా పంచాయతి అథికారి శ్రీదెవి అన్నారు, మంగళవారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో  వఙ సచివాలయ సిబ్బంది ,పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  నిర్వహించే కుల గణన సర్వేను ఎటువంటి తప్పిదాలు లేకుండా సమగ్రంగా పూర్తి చేయాలన్నారు. కులగణన సర్వే ఈనెల 27వ తేదీ నుండి వారం రోజుల పాటు జరుగుతుందని, సర్వే సమయంలో ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని ప్రస్తుత సర్వేలో ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.


తెనాలి కమిషనర్ జస్వంతరావు మట్లాడుతూ  కుటుంబ సభ్యుల విద్య, ఆర్థిక, సామజిక, కులం, ఉపకులం వివరాలను కులగణన ప్రత్యేక యాప్‌లో పొందుపరచాలని సూచించారు. కులగణన కు సంబంధించి ప్రజలు అపోహలు పడకుండా సర్వేకు సహకరించాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో  మేనేజర్ అప్పలరాజు ప్లానింగ్ అథికారులు  కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Comments