ఇసుకలో దోచుకున్న ప్రతి పైసా మొత్తం మీ చేతనే కట్టిస్తాం.

 *ఒక్కొక్కరి అంతు చూస్తాం.. ఇసుకలో దోచుకున్నదంతా కక్కిస్తాం*


*ఇసుకలో దోచుకున్న ప్రతి పైసా మొత్తం మీ చేతనే కట్టిస్తాం* *ఇసుక కుంభకోణం డబ్బులతో రేపు ఎన్నికలకు వెళ్లాలని చూస్తే ఊరుకోం..*


*ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అడ్డగోలుగా డబ్బులు వెదజల్లి ఎలక్షన్ చేస్తామంటే ఒప్పుకోం..*


*మాజీ మంత్రి నక్కా ఆనందబాబు...*


మంగళగిరి (ప్రజా అమరావతి);


భవన నిర్మాణ కార్మికులను అర్ధాకలితో అలమంటించేలా వైసీపీ ప్రభుత్వం చేసిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. 


సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ...... 


రాష్ట్రంలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. మద్యం, ఇసుక రెండు కళ్లుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. మద్యం, ఇసుకయే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. తాడేపల్లి ప్యాలెస్ కు క్యాష్ వెళ్లాలంటే మద్యం, ఇసుక ఉండాలి. రాష్ట్రంలో ఇసుక కుంభకోణంలో అక్షరాల 50 వేల కుంభకోణం జరిగింది.  నాలుగున్నర సంవత్సరాల్లో ఒక సంవత్సరంపాటు ఇసుక పాలసీని రాష్ట్రంలో లేకుండా నడిపారు. ఈ ఒక్క సంవత్సరంపాటు ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు అడ్డగొలుగా దోచుకున్నారు. భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారు. దాదాపు 45 లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. సంవత్సరం తరువాత ఇసుక పాలసీ తెచ్చి జేపీ వెంచర్స్ అనే ఒక బినామీ కంపెనీని తెచ్చారు. ఆ సంస్థను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేశారు. వైసీపీ నాయకుల అడ్డగోలు విధానాలు, దోపిడీని భరించలేక జేపీ వెంచర్స్ మధ్యలో టర్న్ కీ అనే ఒక సంస్థను తీసుకొచ్చారు. ఆ సంస్థ కూడా ఒక యేడాదిపాటు ఒక సబ్ కాంట్రాక్టు నిర్వహించి వారు కూడా పక్కకు తప్పుకున్నారు.  ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు, మైనింగ్ డైరెక్టర్ గా ఉన్న వెంకట్ రెడ్డి, జగన్ ప్యాలెస్ సిబ్బంది  ఏజెంట్లను పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. 40 వేల కోట్లు ఇసుకలో దోచిన వైనాన్ని చంద్రబాబు గతంలోనే ఎండగట్టడం జరిగింది. గతంలో రాష్ట్రంలోని ప్రజలకు ఇసుక దోపిడీ గురించి విడమరచి చెప్పడం జరిగింది. గతంలో ఇసుక ఉద్యమాలు కూడా నడిపాం. జేపీ వెంచర్స్ కు ఇచ్చిన కాంట్రాక్టు మే నెల 12వ తేదితో ముగిసింది. ఒప్పంద పత్రాలు కూడా మేం ఆరోజు చూపాం. ఒప్పందం ముగిసి ఆరు నెలలౌతోంది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలన్నీ నిలిపివేయాలని మార్చి నెలలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆదేశాలు ఇచ్చింది. ఇసుక అనుమతుల్ని రద్దు చేసింది. స్టేట్ లెవల్ ఎన్విరాల్ మెంట్ ఇంపాక్టు అసెస్టెంట్ అథారిటీ వాళ్ల అనుమతులన్నీ రద్దు చేశామని చెప్పారు. ఎన్జీటీ ఆదేశాలను కూడా తుంగలో తొక్కారు. 9 సంవత్సరాల క్రితం జరిగిన ఇసుక పాలసీపై అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకుడిపై కేసులు పెట్టారు. 50 వేల కోట్లు అడ్డగోలుగా దోచుకున్న స్కామ్ ను మేము బయట పెడితే దానికి సమాధానం చెప్పలేదు. ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబుపై కేసులు పెట్టారు. జెపీ వెంచర్స్ లేదు, టర్న్ కీ లేదు, అందరూ పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఇసుక దోపిడీకి పాల్పడుతోంది. మైనింగ్ డైరెక్టర్ గా ఉన్న వెంకట్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఈ పద్ధతి ప్రకారం చేస్తున్నారో ప్రజలకు వివరించగలరా? ప్రజల నుంచి వెంకట్ రెడ్డి తప్పించుకొని తిరగడం మంచిదికాదు. వెంకట్ రెడ్డి తన ఇంటినే ఒక ఆఫీసుగా మార్చుకొని ఇసుక ద్వారా డబ్బు కొల్లగొడుతున్నావు. రాష్ట్రంలోని వనరులను దోచిపెడుతూ, నువ్వు దోచుకుంటున్నావు. మేం అధికారంలోకి వచ్చాక వెంకట్ రెడ్డి ఎక్కడున్నా బయటికి లాగుతామని భయపడి ముందుగా మా నాయకుడు చంద్రబాబుపై కంప్లైంట్ ఇచ్చి యున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా ఆలోచించాలి. ఇసుక పై వే బిల్లు ఇష్యూ అయిందంటే అది కలెక్టర్ ఆఫీసు నుంచి రావాలి కావున కలెక్టర్ల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది. ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో ఇష్యూ చేస్తున్నారు.  మైనింగ్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి అన్యాయానికి అడ్డూ, అదుపు లేకుండా పోయింది. సుప్రీం కోర్టు ఇచ్చిన  ఎన్ జీటీ ఆదేశాలు చిత్తూరుకు మాత్రమే అంటూ వక్రభాష్యం పలికారు. ఎన్జీటీ ఆదేశాలు రాష్ట్రానికి కాదు చిత్తూరుకు మాత్రమే అంటున్నారు. 12 వందలకు వచ్చే ట్రాక్టర్ ఇసుక 6 వేలు పెట్టి కొనాల్సివస్తోంది. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై సీఐడీ డీజీ, ఏజీ సుధాకర్ రెడ్డి హైదరాబాద్, ఏపీ, ఢిల్లీ లలో ప్రెస్ మీట్ లు పెట్టి అభాసుపాలయ్యారు. గ్రావెల్, మైనింగ్, మట్టి లను నాలుగున్నరేళ్లుగా యదేచ్ఛగా దోచుకుంటు వస్తున్నారు.  హైవే పక్కనే డంప్ లు పెట్టి దోచుకుంటున్నారు. రాజమండ్రి బీచ్, తాడేపల్లి మండలం గుండెమెడ లో ప్రొక్లైనర్ తో ఇసుకను దోచుకుంటున్నారు. వీటన్ని్ంటికి మైనింగ్ ఎండి, కార్పొరేషన్ వీసీ  వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాలి. లిక్కర్  కేసులపై వాసుదేవరెడ్డి సమాధానం చెప్పాలి. అసలు నిందితులను వదిలేసి.. ప్రతి దానికి చంద్రబాబుపై కేసులు పెడుతున్నారు.  గతంలో పీతల సుజాతపై కూడా కేసు పెట్టడం జరిగింది. వెంకట్ రెడ్డి ఎక్కడికి పారిపోలేవు, వీటన్నింటికి సమాధానం చెప్పాల్సి వుంటుంది. గంగా, కావేరీల ఎఫ్ఐఆర్ కట్టడం అంతా బూటకం. జగన్ అనుయాయులు, కజిన్ బ్రదర్ అనిల్ రెడ్డికి జగన్ దోచిపెడుతున్నాడు. పారదర్శకత లేకుండా టెండర్ లు పిలవడం అన్యాయం. ఎంఎస్ టిసి బ్రాంచ్ ఆఫీస్ విశాఖపట్నంలో ఉండగా.. కలకత్తా నుంచి టెండర్లు పిలవడంలో డొల్లతనం అర్థమౌతోందని, ప్రజలెవరూ జగన్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి సిద్ధంగా లేరు. తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.

Comments