తాడేపల్లి పట్టణం 14వ వార్డు నివాసితులకు లోకేష్ సహకారంతో తాగునీరు సరఫరా.

 *తాడేపల్లి పట్టణం 14వ వార్డు నివాసితులకు లోకేష్ సహకారంతో తాగునీరు సరఫరా


*


*మంచినీటి ట్యాంకర్‌ను పంపించి తాగునీటిని సరఫరా చేయించిన నారా లోకేష్*


తాడేపల్లి టౌన్, డిసెంబర్ 01 (ప్రజా అమరావతి): తాడేపల్లి పట్టణంలోని 14వ వార్డు ముగ్గురోడ్డు కాలనీ నివాసితులకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో వాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం తాగునీటిని సరఫరా చేయించారు. తాగునీటిని సరఫరా చేసే ఫైపులైన్లు మరమ్మత్తులకు గురికావడంతో ముగ్గురోడ్డు కాలానీ నివాసితులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెంటనే స్పందించారు. జలధార పేరుతో మంచినీటి ట్యాంకర్‌ను పంపించి తాగునీటిని సరఫరా చేయించారు. వాటర్ ట్యాంకర్‌ను పంపి తాగునీటిని సరఫరా చేయించిన నారా లోకే‍ష్‌కు ముగ్గురోడ్డు కాలనీ నివాసితులు ధన్యవాదములు తెలిపారు.

Comments