తెలుగు జాతి కోసం పనిచేసే శక్తినివ్వమని శ్రీవారిని ప్రార్ధించా:- తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో చంద్రబాబు నాయుడు.*తెలుగు జాతి కోసం పనిచేసే శక్తినివ్వమని శ్రీవారిని ప్రార్ధించా:- తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో చంద్రబాబు నాయుడు


*


తిరుమల (ప్రజా అమరావతి):- తెలుగు జాతి ప్రపంచలో నెం. 1 గా ఉండాలని, ఆ సంకల్పంతో పని చేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం 8 గం.లకు ఏడుకొండలు శ్రీవారిని చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.....వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ప్రజా సేవకు  అంకితమయ్యా. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం, ఏ పనైనా ఆయన్ను తలచుకునే ప్రారంభిస్తా. 2003 శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో అలిపిరిలో నాపై దాడి జరిగినపుడు నాకు ఆ వెంకటేశ్వర స్వామి ప్రాణ భిక్ష పెట్టారు. మొన్న నాకు కష్టం వచ్చినపుడు కూడా వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నా. మొదటగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతే మిగతా కార్యక్రమాలు చేపట్టాలి అని అనుకున్నా. భారతదేశం ప్రపంచంలో అగ్రస్ధానంలో ఉండాలనేది, అందులో తెలుగుజాతి నెం - 1 గా  ఉండాలనేది నా  ఆకాంక్ష. ప్రపంచంలోనే అత్యున్నత నాగరికత భారత దేశం సొంతం. అందులో తెలుగుజాతి ప్రత్యేకం. తెలుగు జాతి అగ్రస్ధానంలో ఉండాలని స్వామిని కోరుకున్నా. తెలుగు జాతిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలనే నా సంకల్పానికి శక్తిని ప్రసాదించమని దేవున్ని ప్రార్దించా. నా కష్ట సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలలోని తెలుగు ప్రజలు మద్దతుగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు. మనం చేసే పనులకు దైవ సంకల్పం, సహకారం ఉండాలి అప్పుడే అవి విజయవంతం అవుతాయి అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు కూడా చంద్రబాబు తో కలిసి దర్శనం చేసుకున్నారు.

Comments