ఆర్.ఎస్ రంగాపురంలో నిర్మించే ఆలయ ముఖ ద్వార పనుల పరిశీలన.
*రూ.50 కోట్లతో శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి క్షేత్రాభివృద్ధి : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*ఆర్.ఎస్ రంగాపురంలో నిర్మించే ఆలయ ముఖ ద్వార పనుల పరిశీలన**జాతీయ రహదారి, ఆలయ ముఖద్వారం నిర్మాణంతో దుకాణదారులకు ఇబ్బంది కలిగించం*


బేతంచెర్ల, నంద్యాల జిల్లా, డిసెంబర్, 12 (ప్రజా అమరావతి); రూ.50 కోట్లతో శ్రీ మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. మంగళవారం ఆర్.ఎస్ రంగాపురం గ్రామంలో రూ.2.75 కోట్లతో గ్రానైట్ తో నిర్మించనున్న ఆలయ ముఖ ద్వార పనులకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తుండడం, జాతీయ నిర్మాణం చేపడుతుండడం వల్ల రహదారిని ఆనుకుని ఉన్న దుకాణదారుల ఉపాధికి ఎటువంటి ఇబ్బంది రానీయమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భరోసా ఇచ్చారు. దైవ కార్యమైన ఆలయ ముఖద్వార స్తంభాలను ఏర్పాటు చేయడంలో భాగంగా ఇప్పటికే సామాగ్రిని సిద్ధం చేసుకున్న నేపథ్యంలో త్వరితగతిన ఆ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వామి వారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తద్వారా స్థానికులు, దుకాణదారులకు లాభమే తప్ప నష్టముండదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మద్దలేటి స్వామి ఆలయ ఈవో పాండురంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.Comments