వ్యవసాయ శాఖ క్షేత్ర సిబ్బంది రైతు భరోసా కేంద్రం ల ద్వారా పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులో వుంటూ

అమరావతి (ప్రజా అమరావతి);


          మిచాంగ్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు మరియు అధిక గాలులకు దెబ్బతిన్న పంటలను  ముఖ్యమంత్రి  ఆదేశాలతో వ్యవసాయ శాఖ  యంత్రాంగం వేగంగా సహాయక చర్యలు చేపడుతు రైతుల్లో ధైర్యాన్ని నింపుతున్నది .వర్షం తెరిపి ఇవ్వడంతో పంటలను ,పంట ఉత్పత్తులను కాపాడటంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పూర్తి స్థాయి దృష్టి పెట్టడం జరిగింది.

వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ చేవూరు హరికిరన్ ఐఏఎస్  తుఫాను అనంతరం రైతులకు  చేపడుతున్న సహాయ చర్యలను వివరించారు. వ్యవసాయ శాఖ క్షేత్ర సిబ్బంది రైతు భరోసా కేంద్రం ల ద్వారా పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులో వుంటూ
, వరి కోతలు కోసి వర్షానికి తడిచిన పొలంలోని పనలకు గింజ మొలకెత్తకుండా వుండటానికి 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధముగా రైతులకు తోడ్పాటు అందిస్తూ వ్యవసాయ సిబ్బంది దగ్గరుండి పిచికారీ చేపడుతున్నారు. పొలాల్లో నీరు నిలిచి వున్నట్లయితే పనలను గట్ల పైకి తెచ్చి వాటిని విడతీసి ఉప్పు ద్రావణం చల్లే ఏర్పాట్లు ,శిక్షణ తోడ్పాటు అందిస్తున్నారు.

జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు కలెక్టర్ లతో సంప్రదించి కాల్వలు , డ్రైనులు ,దెబ్బతిన్న కాల్వలకు NREGS వారి సహకారముతో మరమ్మతులు చేసి ,పంట పొలాల నుండి వర్షపు నీటిని బయటకు పంపుతూ , రైతులు ఇబ్బంది పడకుండా సహకరిస్తున్నారు అని తెలిపారు.

పంట కోతకు సిద్దముగా వుండి,పైరు నిలువు మీద వున్న పొలాలలో నీరు నిలిచి వున్న పక్షములో , పంట మధ్య భాగములో  చిన్న చిన్న కాలువ లాంటి పాయలు, బాటలు చేసి, మడుల నుండి నీటిని బయటకు పంపే ఏర్పాట్లను సిబ్బంది పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు అని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో  క్షేత్ర సిబ్బంది , చేలలో నేలకు పడిబోయిన వరి దుబ్బులను లేపి ,వాటిని నిలబెట్టి ,కట్టలు కట్టే ప్రక్రియ చేబడుతున్నట్లు తెలిపారు.

        వర్షం తెరిపి ఇవ్వటం ,కొంతమేర ఎండ , ఉష్ణోగ్రత పెరగడం ద్వారా మెరక ప్రాంతం నుండి  పల్లపు ప్రాంతనకు నీరు ప్రవహించటం ,ఎండకు మెరక నేలలలో తేమ  పొడిబారి చీమ నెరలు ఏర్పడం ద్వారా నేల గాలి పోసుకోవడం జరిగిందని తెలిపారు తద్వారా పంటను నీటి ముంపునుండి కాపాడుకోవడం జరిగిందని చెప్పారు.

      పల్లపు భూములలో నీరు ఇంకా వుండటం కొన్ని ప్రాంతాలలో గమనించడం జరిగిందని ,3 నుండి 4 రోజులలో నీరు ఇంకిపోవడం జరుగుతుందని  తెలుపుతూ రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని తెలిపారు.

రంగుమారిన ,తడిచిన ధాన్యమును  ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు జరిగాయన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తలతో క్షేత్ర సందర్శ నలను చేపడుతూ సాంకేతిక సలహాలు ,పంట రక్షిoచు కునే సూచనలను ఇవ్వటం జరుగు తున్నదని తెలిపారు. 

         వర్షాలు తగ్గి వర్షపు నీరు చేల నుండి పూర్తిగా తొలగిన తర్వాత మరికొద్ది రోజులలో పంట నష్టం ను అంచనా వేయటానికి ఎన్యుమరేషన్ టీమ్ లను ఏర్పాటు చేయడం జరుగు తుందని తెలిపారు.

                   

         

Comments