ప్రజల్లో నుంచే నాయకుడు వస్తాడు.

 *ప్రజల్లో నుంచే నాయకుడు వస్తాడు


*


*మంచి నాయకత్వంతోనే అభివృద్ధి పనులు*


*- ఎమ్మెల్యే ఆర్కే ఆలోచన చాలా గొప్పది*


*-  ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, కార్పొరేషన్ అధికారుల సహకారంతో నియోజకవర్గంలో చక్కని అభివృద్ధి పనులు.*


*-రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి*



మంగళగిరి (ప్రజా అమరావతి);

ప్రజల్లో నుంచే నాయకుడు వస్తాడని, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ను ఎమ్మెల్యే గా ఎన్నుకున్నందుకు ఆయన మీకు కృతజ్ఞతా భావంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం ఎంతైనా అభినందనీయమని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కొనియాడారు. శుక్రవారం  మంగళగిరి పర్యటన కు విచ్చేసిన ఆయన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కేలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత నగరంలోని తెనాలి రోడ్డు లో గుంటూరు రక్షిత మంచినీటి పథకం వద్ద ప్రారంభోత్సవానికి సిద్ధమైన స్కేటింగ్ రింక్, ఇండోర్ స్విమ్మింగ్ ఫూల్ , నిర్మాణం లో ఉన్న జిమ్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ... మంగళగిరి నియోజకవర్గంలో చాలా చక్కటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇటీవల ప్రకాశం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన  టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం, నగరంలోని చినకాకాని వై జంక్షన్ వద్ద నేతన్న విగ్రహాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. మంగళగిరి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. గుంటూరు- విజయవాడ నగరాలలో కూడా లేని విధంగా మంగళగిరిలో స్కేటింగ్ రింక్,  ఇండోర్ స్విమ్మింగ్ ఫూల్, ఓపెన్ జిమ్  నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అవి అన్ని విధాలుగా  జీవన విధానంలో ఉత్తేజాన్ని  కలిగిస్తాయన్నారు.  ఎమ్మెల్యే ఆర్కే ఆలోచనలు చాలా గొప్పవన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో రెండేళ్లు కరోనా వైరస్ తో గడవగా మిగిలిన రెండున్నరేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టారన్నారు.  నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే ఆర్కే ను గెలిపించినందుకు కృతజ్ఞతా భావంతో ఎన్నో అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు , నగరపాలక సంస్థ అధికారుల సహకారంతో చేపట్టారన్నారు.  ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ... ఎంపీఎంసీ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న స్కేటింగ్ రింక్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ తో పాటు ఓపెన్ జిమ్ నిర్మాణ పనులను ఎంపీ అయోధ్య రామిరెడ్డి గారితో కలిసి పరిశీలించి ఆయన సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగిందన్నారు.  రానున్న 10-15రోజుల్లో  స్విమ్మింగ్ ఫూల్, స్కేటింగ్ రింక్ , ఓపెన్ జిమ్ లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.


*సీసీ రోడ్డు ప్రారంభం.*

నగరంలోని 17వ వార్డు ఉడా కాలనీ నుండి బాపనయ్య నగర్ మెయిన్ రోడ్డు వరకు రూ.70లక్షలతో నిర్మించిన నూతన సిసి రోడ్డును శుక్రవారం రాజ్యసభ సభ్యులు ఆళ్ల  అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) లు  శిలా ఫలకం ఆవిష్కరించి 

ప్రారంభించారు.



*బాబూజీ నగర్ లో కమ్యూనిటీ హాల్ ప్రారంభం.*


మంగళగిరి -తాడేపల్లి కార్పొరేషన్ పరిధి బేతపూడి బాబూజీ నగర్ లో సుమారు రూ.1.50కోట్లతో నిర్మించిన బాబూ జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ ను ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) తో కలిసి ప్రారంభించారు. తొలుత బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ప్రారంభించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ స్థాపించుకునే దిశగా మంగళగిరి నియోజకవర్గంలో మీరంతా  ఒకే మాటపై ఉండి ఎంతో ఆలోచనతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లడం అభినందనీయమన్నారు.  ఒకపక్క రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు... మరోపక్క స్కూల్స్ ఆసుపత్రులు, కమ్యునిటీ  సెంటర్లు ... మరో పక్క పిల్లలను బాగా చదివించుకుంటూ ఆరోగ్య వసతులను పెంపొందించుకుంటూ ప్రభుత్వ సహకారంతో ఎదిగే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే తమ వంతు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు.   సాధారణంగా మనకంటే మన పిల్లలు గొప్పగా ఉండాలని కోరుకుంటామని, దానికి తగిన విధంగా ఎమ్మెల్యే ఆర్కే నియోజకవర్గంలో మంచి పునాది వేశారన్నారు.  కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాన్ని తలపిస్తోందని,   ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ లను  అభినందిస్తున్నానన్నారు. మంచి నాయకత్వం ఉంటే మంచి పనులు జరుగుతాయని, మంచి పనుల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ... వెయ్యి మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో రెక్కాడితే గానీ డొక్కాడని 250 దళిత కుటుంబాలు ఉన్నాయన్నారు. చిన్న కార్యక్రమాన్ని చేసుకోవాలన్నా ఫంక్షన్ హాల్స్ కు లక్షలాది రూపాయల అద్దె చెల్లించాల్సి వస్తుందని, అంత పెద్ద మొత్తంలో పేద దళితులు  అద్దె చెల్లించుకోలేని పరిస్థితితో  కమ్యూనిటీ హాల్ ను నిర్మించడం జరిగిందన్నారు.‌ 1950 ప్రాంతంలో దివంగత మహానేత బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి,  భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్  ప్రాంతానికి విచ్చేసారని, అదే రోజున దేశంలోనే మొట్టమొదటి మోడల్ గ్రామంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారని గుర్తు చేశారు. ఆ మహానీయుడు నడిచిన ఈ ప్రాంతంలో ఇన్ని దశాబ్దాలు గడిచినా కమ్యూనిటీ హాల్ లేకపోవడంతో రూ.1.50 కోట్ల నిధులు వెచ్చించి  నిర్మాణ పనుల్లో రాజీ లేకుండా  నిర్మించినట్లు చెప్పారు. ఇంత గొప్ప కమ్యూనిటీ హాల్ మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ లేదని, రేపటి నుంచి అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. వీలైనంత  త్వరలోనే మంగళగిరి కి ఎస్టేట్ అధికారిని నియమించి ఆస్తులను రిజిస్టర్లో పొందుపరిచి  బైలా మేరకు ఈ కమ్యూనిటీ హాల్ ను అతి తక్కువ ఖర్చుతో  శుభ కార్యక్రమాలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కేలకు గజమాల వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.  ఆయా కార్యక్రమాల్లో నగర కమిషనర్ నిర్మల్ కుమార్, ఎస్ఈ శ్రీనివాసరెడ్డి , డీఈ కృష్ణారెడ్డి, ఏఈ కిషోర్,  రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు,  వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి, జిల్లా అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ మునగాల భాగ్యలక్ష్మి, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్,  రూరల్ జేసీఎస్ కన్వీనర్ అన్నపురెడ్డి బ్రహ్మార్గనరెడ్డి, బేతపూడి నర్సయ్య, ఈదులమూడి డేవిడ్ రాజు, బుర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి, మహిళా నాయకులు మల్లవరపు సుధారాణి, సంకె సునీత తదితరులు పాల్గొన్నారు.

Comments