కక్ష సాధింపులపై తప్ప....కేంద్ర పథకాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టిలేదు: టీడీపీ.



కక్ష సాధింపులపై తప్ప....కేంద్ర పథకాల సద్వినియోగంపై  రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టిలేదు: టీడీపీ.



అమరావతి: (ప్రజా అమరావతి)- కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింది రాష్ట్రానికి నిథులు ఇస్తున్నా..వాటని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ అభిప్రాయ పడింది. ఉండవల్లిలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రానున్న పార్లమెంట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్రం  పథకాలకు విరివిగా నిథులు ఇస్తుందని...అయితే నేడు రాష్ట్ర వాటా నిథులు విడుదల చేయకపోవడం వల్ల అనేక పథకాలు నిలిచిపోయాయని...దీని వల్ల అంతిమంగా రాష్ట్ర ప్రజలు నష్టపోయారని సమావేశం అభిప్రాయ పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ద నిధుల సద్వినియోగంపై లేదని నేతలు అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు గాడి తప్పి వ్యవహరిస్తున్న విధానాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని ఎంపిలకు చంద్రబాబు సూచించారు. అన్ని విధాలా విఫలమైన జగన్ ప్రభుత్వం ఓట్ల జాబితాలో అక్రమాల ద్వారా లబ్ది పొందాలని చూస్తుందని...ఈ అంశంపై డిల్లీలో గళం వినిపించాలని పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిలకు సూచించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, విభజన చట్టం హామీల సాధనలో విఫలమవడం వంటి అంశాలను లేవనెత్తాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావన ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు నిమ్మల రామానాయుడు, కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్థన్, గురజాల మాల్యాద్రి పాల్గొన్నారు.

Comments