అంగన్ వాడీ సిబ్బందిని కట్టుబానిసల్లా చూస్తున్న జగన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ.

 *శ్రీ  ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ.

అమరావతి (ప్రజా అమరావతి);


*అంగన్ వాడీ సిబ్బందిని కట్టుబానిసల్లా చూస్తున్న జగన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ*


• జగన్ రెడ్డి మాటల మనిషే గానీ, చేతల మనిషి కాదనడానికి అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ, సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం.

• అంగన్ వాడీ కేంద్రాల్ని జగన్ రెడ్డి గాలికి వదిలేయడంతో 40లక్షల పైచిలుకు పసికూనల పరిస్థితి దయనీయంగా మారింది.

• తెలంగాణతో సమానంగా అంగన్ వాడీ సిబ్బంది జీతాలు పెంచి, కేంద్రాల్ని బాగుచేసి నాణ్యమైన ఆహారం అందిస్తానన్న జగన్ రెడ్డి, నేడు అధికారబలంతో అంగన్ వాడీ సిబ్బందిని భయపెడుతున్నాడు

• అంగన్ వాడీ సిబ్బంది నిరవధిక సమ్మెకు టీడీపీ మద్ధతు ప్రకటిస్తోంది.

•  ఇచ్చిన హామీ ప్రకారం జగన్ రెడ్డి తక్షణమే అంగన్ వాడీ సిబ్బంది జీతాన్ని రూ.26 వేలకు పెంచాలి.

• సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వారికి సంక్షేమ పథకాలు, గ్రాట్యుటీ తోపాటు, రిటైర్మెంట్ బెనిఫిట్ గా రూ.5 లక్షలు అందించాలి.

• వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలి. అంగన్ వాడీ హెల్పర్ల వయో పరిమితి 50 ఏళ్లకు పెంచాలి


         *ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (మాజీ మంత్రి)*


జగన్ రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ గడప కూడా దాటడం లేదని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎద్దేవాచేశారు.


మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం...!

                                                                                                                                                                                                           “ 4 సంవత్సరాల 6 నెలల పాలనలో జగన్ రెడ్డి పసిపిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని కాపాడే  అంగన్ వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించలేకపోవడం, అంగన్ వాడీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లు సమస్యలు పరిష్కరించలేకపోవడమే  అందుకు నిదర్శనం.

అధికారంలోకి రాకముందు అంగన్ వాడీ సిబ్బంది, ఆశావర్కర్లను  టీడీపీప్రభు త్వంపైకి రెచ్చగొట్టిన జగన్ రెడ్డి, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ జీతభత్యాలు పెంచుతానని హామీ ఇచ్చాడు. తెలంగాణలోని అంగన్ వాడీ సిబ్బం ది కంటే ఏపీలోని సిబ్బందికి ఎక్కువగా ఇస్తానని నమ్మబలికాడు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక వారి ముఖం చూడటానికి కూడా జగన్ రెడ్డి ఇష్టపడలేదు.


*అంగన్ వాడీ సిబ్బందిని కట్టుబానిసల్లా చూస్తున్న జగన్ తీరు, ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ*


గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు అంగన్ వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ.4,200 నుంచి రూ.10,500లకు పెంచారు. అంగన్ వాడీ హెల్పర్ల జీతాన్ని రూ.6వేలకు పెంచారు. చంద్రబాబు హాయాంలో రాష్ట్రంలో 18వేల అంగన్ వాడీ కేంద్రాల్ని కొత్తగా నిర్మించడం జరిగింది. జగన్ రెడ్డి  నాలుగున్నరేళ్లల్లో అంగన్ వాడీ సిబ్బంది జీతాన్ని కేవలం రూ.1000 మాత్రమే పెంచి, వారిని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు. సామాజిక పింఛన్ పెంపులో కూడా వృద్ధులు వికలాంగుల్ని జగన్ రెడ్డి ఇలానే మోసగించాడు. అంగన్ వాడీ మిని కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మారుస్తానన్న హామీని జగన్ రెడ్డి నిలబెట్టుకోలే దు. అంగన్ వాడీ సిబ్బందికి సంక్షేమ పథకాలు, పింఛన్, ఇతర గ్రాట్యుటీలు అందించాలని సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పినా, జగన్ రెడ్డి అవేవీ వారికి లేకుండా చేశాడు. అంగన్ వాడీ సిబ్బంది నోరెత్తకుండా జగన్ రెడ్డి వారిని కట్టుబానిసల్లా చూస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకే మాయని మచ్చలా మిగిలింది. అంగన్ వాడీ కేంద్రాలను పట్టించుకోకుండా జగన్ రెడ్డి గాలికి వదిలేయడంతో రాష్ట్రవ్యాప్తంగా వాటిపై ఆధారపడిన 40లక్షల పైచిలుకు పసికూ నల పరిస్థితి దయనీయంగా తయారైంది. సంక్షేమంలో కూడా అవినీతికి పాల్పడిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి నిలిచాడు.

 

*అంగన్ వాడీ సిబ్బంది నిరవధిక సమ్మెకు టీడీపీ మద్ధతు పలుకుతోంది*


అంగన్ వాడీలు తమ డిమాండ్ల సాధన సమస్యల పరిష్కారంకోసం చేస్తున్న నిరవధిక సమ్మెకు టీడీపీ మద్థతు పలుకుతోంది. జగన్ రెడ్డి తాను ఇచ్చిన హామీకి కట్టుబడి వెంటనే అంగన్ వాడీ సిబ్బంది జీతాన్ని రూ.26వేలకు పెంచా లి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వారికి సంక్షేమ పథకాలు, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్ గా రూ.5లక్షలు అందించాలి. వేతనంతోకూడిన మెడికల్ లీవు లు మంజూరు చేయాలి. అంగన్ వాడీ హెల్పర్ల వయో పరిమితిని 50 ఏళ్లకు పెంచాలని, 300కు పైగా జనాభా ఉన్న గ్రామాల్లోని అంగన్ వాడీ మినీ కేంద్రాల్ని ప్రధాన కేంద్రాలుగా మార్చాలని, ప్రతి కేంద్రంలో నాణ్యమైన పౌష్టికాహారాన్ని చి న్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద మెస్ ఛార్జీలు పెంచకుండా, గ్యాస్ సిలిం డర్లు అందించకుండా అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పౌష్ఠికాహా రం ఎలా అందుతుందో జగన్ రెడ్డి చెప్పాలి. అలానే ఎస్సీ,బీసీ, ఎస్టీ వసతి గృహా ల్లోని విద్యార్థులకు తక్షణమే మెస్ ఛార్జీలు పెంచాలి. హాస్టళ్లలో సరైన ఆహారం లేక పోవడంతో దళిత, బీసీ విద్యార్థినీ విద్యార్థులు సరిగా చదవుకోలేకపోతున్నారు. మానవత్వంతో ఆలోచించి తీసుకునే నిర్ణయాల్ని కూడా జగన్ రెడ్డి సమర్థవంతం గా అమలుచేయకపోవడం నిజంగా దారుణం.

                                                                                                                                                                                                         *ఇచ్చిన హామీలు అన్ని గాలికి వదిలేసి సిగ్గులేకుండా 98శాతానికి పైగా  అమలుచేశానని చెప్పుకుంటున్నావా జగన్ రెడ్డి?*


అంగన్ వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలు అమలుచేయకుండానే జగన్ రెడ్డి నిస్సిగ్గుగా 98శాతానికి పైగా హామీలు అమలుచేశానంటున్నాడు. 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు పింఛన్ ఇస్తానన్నహామీని విస్మరించాడు. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ దోపిడీకి పాల్పడు తున్నాడు. సీపీఎస్ రద్దు హామీని గాలికి వదిలేసి ఉపాధ్యాయుల ప్రాణాలతో చెల గాటమాడుతున్నాడు. నాలుగేళ్ల 6 నెలల్లో జగన్ రెడ్డి ఏవర్గానికి న్యాయం చేశాడో చెప్పాలి. నిరుద్యోగులు, మహిళలు, రైతులు, యువత అన్నివర్గాలు జగన్ రెడ్డి దోపిడీ, అవినీతికి బలైపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.” అని ఆలపాటి రాజా తెలిపారు.

Comments