ప్రగతే లక్ష్యం..ప్రజలతో మమేకం.

 


*ప్రగతే లక్ష్యం..ప్రజలతో మమేకం


*


*బేతంచెర్లలో ఆర్థిక శాఖ మంత్రి సుడిగాలి పర్యటన*


*బీ.పి శేషారెడ్డి సీ.హెచ్.సీ ఆకస్మిక తనిఖీ*


*రూ.2.5 కోట్లతో తీర్చిదిద్దుతున్న బిలసర్గం గుహల నిర్మాణ పనుల పరిశీలన*


*స్వయంగా కార్యకర్తల ఇంటికి వెళ్లి పలకరించిన మంత్రి బుగ్గన*


*మద్దిలేటి స్వామి ముక్కోటి ఏకాదశి మహోత్సవాల ఆహ్వాన వాల్ పోస్టర్ ఆవిష్కరణ*


*'చంద్రయాన్-2' విజయానికి కృషి చేసిన బేతంచెర్ల సైంటిస్ట్ సలీం బాషకు మంత్రి ప్రశంసలు*


*క్రీడల పోటీలో రాణించిన పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి అభినందనలు*


*మంత్రి బుగ్గనను కలిసిన లయన్స్ క్లబ్ కొత్త కార్యవర్గం, భవానీ మాలధారులు*


బేతంచెర్ల, నంద్యాల జిల్లా, డిసెంబర్,11 (ప్రజా అమరావతి); శ్రీ మహాలక్ష్మి సమేత మద్దలేటి నరసింహ స్వామి స్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23వరకు  నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను ఆహ్వానించారు. లక్ష మంది ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు ఆలయ ఛైర్మన్ రామచంద్రుడు, ఆలయ ఈవో పాండురంగారెడ్డి  ఆహ్వానం పలికారు. అనంతరం దానికి సంబంధించిన వాల్ పోస్టర్లను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మద్దలేటి స్వామి ఆలయ అభివృద్ధి పనులపై మంత్రి బుగ్గన ఆరా తీశారు.


*క్రీడల్లో రాణించిన పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి ప్రశంసల జల్లు*


బేతంచెర్ల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను కలిశారు. ఇటీవల నంద్యాల జిల్లాలో జరిగిన గేమ్స్ & స్పోర్ట్స్ రీజనల్ మీట్ కార్యక్రమంలో పలు క్రీడల పోటీల్లో రాణించిన నేపథ్యంలో వారికి మంత్రి బుగ్గన శుభాభినందనలు వెల్లడించారు. చెస్, పరుగు పందెం, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనతో మొదటి స్థానం కైవసం చేసుకున్న విద్యార్థులను మంత్రి బుగ్గన మెచ్చుకున్నారు. విద్యతో  పాటు చదువులలో రాణించడం వల్ల మానసికంగా చిన్నారులు ధృఢంగా అవుతారన్నారు. చిన్నారులను క్రీడా రంగంలో ప్రోత్సహిస్తోన్న ప్రిన్సిపల్ రాజేష్ ను కూడా మంత్రి ప్రశంసించారు.


*ఇస్త్రో సైంటిస్టు సేవలను కొనియాడిని మంత్రి బుగ్గన*


బేతంచెర్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ముళ్ల మీరం సాహేబ్ , వాహిదా దంపతుల పెద్ద కొడుకు సలీం బాషాను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశంసించారు. డాక్టర్ సలీం బాషా ఇస్రోలో లీడ్ సైంటిస్టుగా కృషి చేయడం బేతంచెర్లకు గర్వకారణమని మంత్రి కొనియాడారు. ఇంట్లో పిల్లలందరినీ ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలలో చదివించిన మీరం సాహెచ్ 'జెమ్ ఆఫ్ మెన్' అని మెచ్చుకున్నారు. అనంతరం బేతంచెర్ల పట్టణంలోని కొత్తపేటలో 'పాన్ షాప్' ఖాదర్ ఇంటకి వెళ్లి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆత్మీయంగా పలకరించారు. ఇటీవల గృహ ప్రేవేశం సమయంలో మంత్రి బుగ్గన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం గొల్ల రామాంజనేయులు ఇంటికి వెళ్లారు. ఎప్పటి నుంచో అనుబంధం ఉన్న రామాంజనేయులుకు శాలువాను కప్పి మంత్రి బుగ్గన స్వయంగా  సత్కరించారు. ఆ తర్వాత అదే ప్రాంతంలోని మెకానిక్ శ్రీనివాసులు ఇంటికి వెళ్లి మంత్రి బుగ్గన ఆత్మీయంగా కలుసుకున్నారు. అదే ఏరియాలోని నవ దంపతులు ఖలీల్, రజియాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆశీర్వదించారు. మంత్రి రాకతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత గుండా జయచంద్ర ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించారు.స్థానిక నాయకులతో అక్కడ సమావేశమయ్యారు. 


*బీ.పి శేషారెడ్డి సీ.హెచ్.సీ ఆకస్మిక తనిఖీ*


ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బేతంచెర్ల పట్టణంలోని బీ.పి శేషారెడ్డి సీ.హెచ్.సీ(ఆరోగ్య కేంద్రం)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలింతల వార్డుకు వెళ్లి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. వైద్యానికి ఇబ్బంది లేకుండా అవసరమైన పనిముట్లు, వసతులపై ఆరా తీశారు. సిబ్బంది కొరతపైనా అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి కార్పొరేట్ కు ధీటుగా చికిత్స అందించాలని ఆదేశించారు. సిబ్బంది, పనిముట్ల కొరత ఉంటే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోగులకు సంబంధించిన బెడ్ షీట్లు సహా  ఉతకడానికి వీలుగా వాషింగ్ మెషిన్ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.


*రూ.2.5 కోట్లతో తీర్చిదిద్దుతున్న బిలసర్గం గుహల నిర్మాణ పనుల పరిశీలన*


బేతంచెర్లలోని కనుమకింద కొట్టాలలో ఉన్న బిల్లసర్గం గుహల సమీపంలో వేగంగా సాగుతున్న అభివృద్ధి పనులను ఆర్థిక శాఖ బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. రూ.2.5 కోట్లతో తీర్చిదిద్దుతున్న పర్యాటక అభివృద్ధి పనులు, రహదారి నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జనవరి నెలాఖరు కల్లా ప్రారంభోత్సవం నేపథ్యంలో పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.  గుహల సమీపంలో ఏర్పాటవుతున్న రెస్టారెంట్ పనులను పరిశీలించారు. ఇప్పటికే గుహలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పర్యాటక కేంద్రానికి అవసరమైన సదుపాయాలను సమకూర్చనున్నట్లు మంత్రి వెల్లడించారు.


 ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు సమావేశమయ్యారు. మంత్రి బుగ్గన 'లయన్స్ క్లబ్' మరిన్ని సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అధ్యక్ష, కార్యదర్శులు కల్కి సతీష్, రాజు, వ్యవస్థాపక అధ్యక్షులు మురళీ కృష్ణ సహా సభ్యులంతా మంత్రి బుగ్గనను మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువ పూలమాలలతో సత్కరించారు. అలాగే భవానీ మాలధారులు ఆర్థిక మంత్రి బుగ్గనను కలిశారు. త్వరలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రానికి బయలుదేరుతున్న నేపథ్యంలో వారు మంత్రిని కలిశారు.


ఈ కార్యక్రమంలో బేతంచెర్ల ఎంపీపీ నాగభూషణం రెడ్డి, బేతంచెర్ల మున్సిపల్ ఛైర్మన్ చలం రెడ్డి, మండల వైసీపీ నాయకులు బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Comments