పంట బీమా కట్టకుండా చేసి.. రైతు పొట్ట కొట్టారు.

పర్చూరు (ప్రజా అమరావతి);


*వీరన్నపాలెంలో తుఫాను బాధితులను ఉద్దేశించి మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు*


- ఈ ప్రభుత్వంలో అన్ని కులాలు, వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి.

- రైతులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులు, మహిళలు అందరూ బాగా నష్టపో యారు

- 45 యేళ్లపాటు నన్ను గౌరవించిన మీ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తాను.

- ఒక్క అసమర్థుడి వల్ల అనేక కుటుబాలు నష్టపోయాయి.

-పట్టిసీమను సరిగ్గా ఉపయోగించుకొని ఉంటే జులైలో పంటలు వేసేవారు, అక్టోబర్ లో పంట చేతికి వచ్చేది ఎవ్వరూ నష్టపోయి ఉండేవారుకాదు.

- పట్టిసీమను సరిగా వినియోగించుకొంటే.. కట్టిన నాకు మంచి పేరు వస్తుందని వినియోగంలోకి తేలేదు.

- ప్రజల ఆస్తిని నిరుపయోగం చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?

- పంట బీమా కట్టకుండా చేసి.. రైతు పొట్ట కొట్టారు.


- ఈ సీఎం తనే తెలివైనవాడనుకుంటాడు

- సమస్యల గురించి అడిగితే సమాధానం చెప్పకుండా అడిగినవారిని ఇబ్బంది పెట్టాడు

- ఈ అజ్ఞాని, అహంభావి వల్ల లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

- తుపానువల్ల జరిగే నష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నించలేదు

-ఓ రైతు తనకు ప్రభుత్వం పై నమ్మకం లేదు, నా భూమిపై నాకు నమ్మకం ఉందని  చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోంది.  

- వైసీపీ చెందిన రైతు 10 ఎకరాల్లో పంట వేసి నష్టపోయానని బాధను వ్యక్తం చేశారు.

- ఇంకో రైతు బాధను చూడలేక రెండు లక్షలు ఆర్థక సహాయం చేసి ఆదుకోవడంతో ఎంతో తృప్తిగా ఉంది

- రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది.

- వాగులకు గండి పడ్డా పట్టించుకోరు

- ఆకాశంలో తిరిగితే రైతుల బాధలు కనపడతాయా? భూమిపైకి వస్తే రైతుల బాధలు తెలుస్తాయి.

- ఎదురు దాడి చేసి బూతులు తిట్టడం వైసీపీ నైజం. 

- నన్ను కష్ట పెట్టారు.. మీ కోసం సహించాను.

- రైతులు బాధపడుతుంటే.. సాధికార సద స్సు లు పెట్టి ఉపన్యాసాలు ఇవ్వడం భావ్యమా?

- తుపాను వల్ల సర్వనాశనమయ్యాం, కోలుకుంటామనే నమ్మకంలేదు, దేవుడిలా మీరొచ్చారని ఓ మహిళ నమ్మకంతో ఆనడంతో ఆనందం వేసింది.

- మళ్లీ రైతు రాజ్యం రావాలి, మిమ్మల్ని ఆదుకొనే రోజులు వస్తాయి. 

- తెలుగుదేశం మీకు చేదోడు, వాదోడుగా ఉంటుంది.

- తెలుగుదేశం, జనసేన మిమ్మల్ని తప్పకుండా ఆదుకుంటాయి.

 - పంట కాలువల్లోని గడ్డి, గుర్రపు డెక్క, జంబు తొలగించకపోవడంతో కాలువల్లో నీరు పారక రైతాంగం మొత్తం  మునిగే పరిస్థితి వచ్చింది.

- నేను ఏదో ఒక విధంగా ఆదుకుంటానని నాపై విశ్వాసంతో ప్రజలు తండోపతండాలుగా రావడం సంతోషదాయకం.

- ప్రస్తుతం రైతులకు కలిగిన నష్టం మామూలు నష్టం కాదు, ఊహించని పరిణామమిది.

- మీలో నాపై ఉన్న నమ్మకం చూస్తుంటే నాలో ఆత్మస్థైర్యం పెరుగుతోంది

Comments