వైసీపీని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు.

 *వైసీపీని  గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు*



*రాష్ట్రం కోసం యువత ముందుకు రావాలి*


*వైసీపీ  నేతలు హద్దుమీరి అరాచకాలు చేశారు*


*హక్కులను  కాలరాస్తోన్న వైసీపీ ప్రభుత్వం*


*టీడీపీ  అధినేత నారా  చంద్రబాబు నాయుడు*


*గొర్రెల కాపరులు చనిపోతే రూ.10లక్షల బీమా*


*కుప్పంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు*


కుప్పం.  (ప్రజా అమరావతి) : సంస్కృతిని గుర్తు పెట్టుకొని భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలని టీడీపీ  అధినేత నారా  చంద్రబాబు నాయుడు  సూచించారు. కురబ వర్గంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఐటీ రంగంలో కురబ వర్గానికి చెందిన వారు చాలా మంది స్థిరపడ్డారు. కురబలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు బీమా ఇస్తాం. ఎప్పుడూ మన మూలాలను మరచిపోకూడదు. వైసీపీ నాయకులు ఆలయ భూములను కూడా కబ్జా చేస్తున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవకర్గంలో టీడీపీ  అధినేత చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి బస్టాండ్‌ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ప్రజల ఉత్సాహం చూస్తుంటే వైసీపీని  గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని ఉత్సాహాన్ని చూస్తున్నా. 35 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా. గ్రానైట్‌ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక పార్క్‌ ఏర్పాటు చేస్తాం. లక్ష మెజారిటీ ఇచ్చి కుప్పం స్థాయిని మరోసారి చాటిచెప్పండి. రాష్ట్రం కోసం యువత ముందుకు రావాలి. వైసీపీ  నేతలు హద్దుమీరి అరాచకాలు చేశారు. సైకోతో పోరాడాల్సి రావడం బాధాకరం. రాష్ట్ర ప్రజల కోసం సైకోతో పోరాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.*


*హక్కులను  కాలరాస్తోన్న వైసీపీ ప్రభుత్వం :  వైసీపీ ప్రభుత్వం  హక్కులను కాలరాస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపేర్కొన్నారు. శనివారం కుప్పం టౌన్‌లో చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. రోడ్డు పొడవునా చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారలతో స్వాగతాలు పలికారు. రోడ్ షో అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అన్న క్యాంటీన్‌కు చేరుకొని పేదలకు అన్నదాన కార్యక్రమం చంద్రబాబు చేశారు. అంగన్వాడీ శిబిరానికి వెళ్లి అంగన్వాడీల ఆందోళనకు చంద్రబాబు మద్దతు పలికారు. కుప్పంలో అంగన్వాడీల శిబిరానికి వెళ్లి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని అంగన్వాడీలకు హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో సమస్యలపై పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Comments