పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, వసతుల కల్పన పనులు 25 కల్లా పూర్తి చేయాలి.

 *పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, వసతుల కల్పన పనులు 25 కల్లా పూర్తి చేయాలి


*•అక్రమ మద్య రవాణాను అరికట్టడంతో పాటు పటిష్టమైన బందోబస్తు, చెక్ పోస్టుల ఏర్పాటు పనులను సకాలంలో పూర్తి చేయాలి*

*ప్రభుత్వ ప్రధాన కారదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి*


అమరావతి, జవనరి 11 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను  సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను, పోలీస్ అధికారులను    అదేశించారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సి.ఎస్. సమావేశ మందిరం నుండి డిజిపి, పలు శాఖల ఉన్నత అధికారులు మరియు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన  వీడియో కాన్పరెన్సు నిర్వహించి సార్వత్రిక ఎన్నికల సన్నద్దతకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. శాఖల వారీగా ఏర్పాటు చేస్తున్న పోలింగ్ స్టేషన్లు, వాటిలో కనీస మౌలిక వసతుల కల్పన పనులను ఆయన సమీక్షిస్తూ ఈ పనులన్నింటినీ ఈ నెల 25 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక శాఖకు చెందిన పాఠశాలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ  శాఖ వసతి గృహాలు, పంచాయితీ భవనాలు, అంగన్ వాడీ కేంద్రాల్లో ఈ పోలింగ్ స్టేషన్లు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు ఈ  కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముఖ్యంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పని సరిగా చేపట్టాలని, విద్యుత్ సౌకర్యంతో పాటు లైట్లు, ప్యాన్లు, ఫర్నిచర్, త్రాగునీరు, టాయిలెట్లు తప్పని సరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 


ఈ వీడియో కాన్సరెన్సులో భాగంగా తొలుత డిజిపి  కె.వి.రాజేంద్రనాధ్ రెడ్డితో  సి.ఎస్. సమావేశమై అక్రమ మద్య రవాణాను అరికట్టడం, పటిష్టమైన పోలీస్ బందోబస్తు, చెక్ పోస్టుల ఏర్పాట్లు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, విచారణలో నున్న కేసులకు సంబందించి త్వరలో చార్జిషీట్లు ఫైల్ చేయడం తదితర అంశాలపై సమీక్షించారు. అన్ని  కీలకమైన కేంద్రాల్లో పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి సరిహద్దు  రాష్ట్రాల వద్ద పటిష్టమై చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు పోలీస్ బలగాలను పెద్ద ఎత్తున నియమించాలని సూచించారు.  ప్రక్క రాష్ట్రాల నుండి అక్రమ మద్య రవాణ జరుగ కుండా పటిష్టమైన చర్యలను చేపట్టాలన్నారు. ఇప్పటికే పెండింగ్ లోనున్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, విచారణలోనున్న కేసులకు సంబందించి సాధ్యమైనంత త్వరగా చార్జిషీట్లు ఫైల్ చేయాలని సూచించారు. అదే విధంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్టమై పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 


ఈ సందర్బంగా డిజిపి  కె.వి.రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా  చేస్తున్న ఏర్పాట్లను అన్నింటినీ  సి.ఎస్. కు వివరించారు. 


అడిషనల్ సి.ఇ.ఓ. హరీంద్ర ప్రసాద్, అడిషనల్ డి.జి. (లా అండ్ ఆర్డర్) ఎస్.బాగ్చీ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్, ఎస్.ఇ.బి. డైరెక్టర్ ఎం.రవిప్రకాష్ తదితరులతో అన్ని జిల్లా కలెక్టర్లు ఈ వీడియో కాన్పరెన్సులో పాల్గొన్నారు.Comments