ఏపీ చర్మకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ అనూషకు సత్కారం.

 *ఏపీ చర్మకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ అనూషకు సత్కారం.


*


మంగళగిరి. (ప్రజా అమరావతి);

 నగర పరిధి  గణపతి నగర్  లోని డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిణి డాక్టర్ అనూషను  శుక్రవారం

ఏపీ చర్మకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుల్లా రాజారావు  సత్కరించారు. ఈ సందర్భంగా  రాజారావు మాట్లాడుతూ.... డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిణి డాక్టర్ అనూష పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు ఎనలేనివని కొనియాడారు. ఎయిమ్స్ వంటి ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు చేయించాలంటే దాదాపూ రెండువేల వరకూ ఖర్చవుతాయని, అంతటి విలువైన వైద్య పరీక్షలు గణపతి నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో డాక్టర్ అనూష నేతృత్వంలో వైద్య సిబ్బంది ఉచితంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని పేదలు వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పట్టణ సగర సంఘం ప్రధాన కార్యదర్శి జూట్రు ఏడుకొండలు మాట్లాడుతూ... పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ లను నిర్మించడం జరిగిందని, గణపతి నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిణి డాక్టర్ అనూష రోగులకు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.  అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధికి సగర సంఘం తమ వంతు సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ హుస్సేన్, చేనేత నాయకులు దీపాల కనకయ్య, ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్ వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Comments