దేశానికే ఆదర్శం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం.

 


*దేశానికే ఆదర్శం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం


*


*కృష్ణా జిల్లాలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎం.టి.కృష్ణ బాబు*


*రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్-2 కార్యక్రమం*


*బాపట్ల జిల్లాలో పర్యటించిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్*


*పల్నాడు జిల్లాలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల*


అమరావతి (ప్రజా అమరావతి):

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందుల్ని సక్రమంగా సరఫరా  చేయాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు అన్నారు. పేదల వద్దకు స్పెషలిస్ట్ వైద్యుల సేవల్ని అందుబాటులోకి తేవడం ద్వారా దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. 


జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఫేజ్ 2 ప్రారంభం రోజైన మంగళవారం నాడు కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని పెద్ద మద్దాలి గ్రామంలో నిర్వహించిన శిబిరాన్ని కృష్ణ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం విజయవంతమయ్యిందని ,  దీంతో ఫేజ్-2 కార్యక్రమానికి పూనుకున్నామని అన్నారు.

ఎం. ఎల్. హెచ్. పి.లు, ఎ ఎన్. ఎం లు, ఆశా లు ప్రతి ఇంటిని సందర్శించి వారికి ఆరోగ్యశ్రీ యాప్ ఎలా ఉపయోగించాలో వివరించాలనీ , అలాగే యాప్ ను డౌన్లోడ్ చేయించాలని ఆదేశించారు.  అసంక్రమణ వ్యాధులైన(NCDs) డయాబెటిస్, గుండె జబ్బులు, బిపి ,క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను సందర్శించి మందులు సరిగా వాడుతున్నారో లేదో తెలుసుకోవడమే కాకుండా మందులు వాడే విధానాన్ని  కూడా తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రిఫరల్ కేసుల్ని ఫాలో అప్ చేయాలన్నారు. రిఫరల్ కేసులకు ప్రయాణ ఖర్చుల నిమిత్తం 500 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో  క్యాటరాక్ట్ సర్జరీలు చేయించుటకు గుర్తించిన వారందరికీ ఆపరేషన్లకు ఏర్పాట్లు చేయటం,  అవసరమైన వారందరికీ కళ్ళజోళ్ళు  పంపిణీ చేయటం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు  ఒక నెల నుండి మూడు నెలలకు సరిపడా మందులు వారి ఇంటి వద్దకే పోస్టు ద్వారా అందేటట్లు ఈ నెలలో  తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఇలాంటి కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు  జరుగుతోందని కృష్ణ బాబు స్పష్టం చేశారు. అవసరమైన వారికి స్పెషలిస్ట్ వైద్య సేవల్ని జగనన్న ఆరోగ్య సురక్ష- 2(జెఎఎస్2) క్యాంపుల ద్వారా అందుబాటులోకి తెచ్చామన్నారు. జెఎఎస్ ఫేజ్-1లో కూడా  స్పెషలిస్ట్ వైద్యుల సేవల్ని గ్రామీణ పేదలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.

స్పెషల్ చీప్ సెక్రటరీ శ్రీ టి. కృష్ణ బాబు, కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజబాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ జి. గీతాబాయి, ఎం.హెచ్.ఎన్ జాయింట్ డైరెక్టర్

డాక్టర్ చిత్ర గురుస్వామి, కనుమూరు పి. హెచ్. సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, ఎమ్మార్వో  భరత్ రెడ్డి  , ఎంపిడిఓ వై. రామకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు. 

   


Comments