బాల రాముడి ప్రతిష్ట వేడుకల్లో పాల్గొనడం మహాద్భాగ్యం!

 బాల రాముడి ప్రతిష్ట వేడుకల్లో పాల్గొనడం మహాద్భాగ్యం!


డాక్టర్ బూసిరెడ్డి దంపతులు.  

గుంటూరు (ప్రజా అమరావతి);

  అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట వేడుకలను కనులారా వీక్షించడం, ఆ పుణ్య కార్యక్రమములో భాగస్వాములు కావడం మన మహాభాగ్యమని సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్  అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి దంపతులు పేర్కొన్నారు.

 బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని  అరండల్ పేట లోని సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ బూసిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో రోగులు, వారి సహాయకులు శ్రీ సీతారాముల చిత్రపటాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జైశ్రీరామ్ పేరుతో రూపొందించిన ప్రత్యేక కండువాలు భుజానా వేసుకొని జండాలను చేతబట్టి జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.

 ఈ సందర్భంగా డాక్టర్ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ నాడు భద్రాద్రి,తిరుమల లలో జరిగిన విగ్రహ ప్రతిష్ట ను చూడలేకపోయామని.. నేడు  ఎంతో ప్రాశస్తమైన అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్టను కనులారా వీక్షించడం మన పూర్వజన్మ సుకృతం అని అన్నారు.

 ఈ కార్యక్రమంలో డాక్టర్ బూసిరెడ్డి దీప్తిరెడ్డి,చేపూరి కోటేశ్వరమ్మ, టంగుటూరి అరుణ, లంకిరెడ్డి రాజ్యలక్ష్మి ఆస్పత్రి  వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.

Comments