టిఎస్ పిఎస్పీ ద్వారా త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తాం:సీఎం రేవంత్ రెడ్డి.

 *టిఎస్ పిఎస్పీ ద్వారా త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తాం:సీఎం రేవంత్ రెడ్డి*


   










హైద‌రాబాద్: జనవరి 31 (ప్రజా అమరావతి);

టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా త్వరలో 15వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు చెప్పారు.


హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు..


అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉండేవని అన్నారు. ఆ సమస్యను త్వరగా పరిష్కరించగలిగామని ఆయన తెలిపారు.


వైద్యఆరోగ్య శాఖ మంత్రి పరిస్థితిపై సమీక్షించి నియామకాలు త్వరగా జరిగేలా చూశామన్నారు. ఉద్యోగ నియామకం వేళ మీ సంతోషంలో భాగస్వా ములం అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

 

విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం అన్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.గత ప్రభుత్వం వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచించిందన్నారు.


నిరుద్యోగుల సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై గత ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిం దన్నారు...

Comments