స్వయం ఉపాధితో మహిళల ఆర్థిక అభివృద్ధి : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.



*స్వయం ఉపాధితో మహిళల ఆర్థిక అభివృద్ధి : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*ప్యాపిలిలో రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభం*


*మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దార్శనికతకు కృతజ్ఙతలు తెలిపిన డోన్ నియోజకవర్గ మహిళలు*


*కోటి రూపాయలతో ఆధునీకరించిన ఆర్ అండ్ బీ అతిథి గృహం, పార్కుల ప్రారంభోత్సవం*


*రూ.3కోట్లతో చేపడుతున్న వెంగలాంపల్లి చెరువు పర్యాటక అభివృద్ధి పనుల పరిశీలన*



ప్యాపిలి, నంద్యాల జిల్లా, జనవరి, 03 (ప్రజా అమరావతి); స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. రూ.8 లక్షలతో ప్యాపిలి పట్టణంలో తీర్చిదిద్దిన బీ.పి శేషారెడ్డి నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ప్యాపిలి మహిళలకు స్వయం ఉపాధితో మరింత రాణించేందుకే నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా 60 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కేంద్రం ద్వారా కుట్టుమిషన్ లో శిక్షణ పొంది..అనతి కాలంలోనే ఉద్యోగం పొంది స్వశక్తితో ఎదిగే అవకాశం అందరికీ దక్కాలన్నదే ధ్యేయమన్నారు. నంద్యాల జిల్లాలో ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలు, ఐటీఐ, పాలిటెక్నిక్ , జాబ్ మేళాలు, స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ల నిర్వహించి   గత నాలుగున్నరేళ్లలో సుమారు 5వేల మంది యువతీయువకులకి ఉద్యోగాలిచ్చినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. డోన్ పట్టణంలో పరిశ్రమల శాఖకు సంబంధించిన రెండు షెడ్లను టీడీపీ నాయకులు ఆక్రమించడానికి ప్రయత్నిస్తే నిలువరించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆ ప్రాంగంణంలోనే మహిళలకు ఉపయోగపడే ఫ్యాషన్ డిజైన్ శిక్షణ అందించి వస్త్రాల తయారీ కేంద్రంగా మార్చామన్నారు. డోన్ నుంచి 150 మంది యువతీయువకులు కియా పరిశ్రమలో ఉద్యోగావకాశాలు పొందినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి పీజీ చదివిన వారందరికీ శిక్షణ అందించి ఉద్యోగాలు ఇస్తున్నట్లు చెప్పారు. డోన్ యువతకు ఉద్యోగాలు కావాలంటే 3 నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తే చాలన్నారు.


 కొన్ని పరిస్థితుల్లో మహిళలకు దూరంగా వెళ్లి సంపాదించే మార్గాలు తక్కువగా ఉంటాయని అలాంటి వారు ఈ కేంద్రంలో అందించే నైపుణ్య సేవలను అందిపుచ్చుకుని ఎదగాలన్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 6 నియోజకవర్గాలలో ఏర్పాటైన 8 స్కిల్ హబ్స్ లలో 10వ తరగతి నుంచి పీజీ వరకే చదువుకున్న యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆటో క్యాడ్ వంటి అత్యాధునిక కోర్సులలో 920 మందికి శిక్షణనందించడమే కాకుండా 290 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. 


*మంత్రి బుగ్గన దార్శనికతకు కృతజ్ఙతలు తెలిపిన డోన్ నియోజకవర్గ మహిళలు*


డోన్ నియోజకవర్గ  మహిళలకు ఉపాధి అవకాశం కల్పించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు వారు కృతజ్ఞతలు. పట్టుదలతో శిక్షణ పూర్తి చేసి మహిళలలు ఆర్థికంగా రాణించడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. ప్యాంట్, షర్ట్ , కాలర్, చేతులు ఇలా ప్రతి అంశంపైనా మంచి  శిక్షణ అందించారు. కష్టపడి ఎదగాలనుకునే వారికిది వరం.


*_ నయ్యూంబీ, డోన్* 


ఇటీవల భర్తను కోల్పోయిన తన ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో శిక్షణ పొందడం చక్కని అవకాశంగా మారింది. మొత్తం మహిళలే సహోద్యోగులుగా ఉండడం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా  స్వేచ్ఛగా పని చేసుకుంటున్నాను. పాతిక మందికి పైగా మహిళలు డోన్ నియోజకవర్గం నలుమూలల నుంచి శిక్షణ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. 


*_విజయలక్ష్మి, డోన్*


డోన్ పట్టణంలో కుట్టుమిషన్ లో కీలకమైన కట్టింగ్ విషయంలో చాలా బాగా శిక్షణనిచ్చారు. స్వతహాగా నాకు ఉపాధి అవకాశాలే కాకుండా మా అమ్మాయికి అమ్మఒడి, అబ్బాయికి ఫీజు రీయింబర్స్ మెంట్, తనకు ఇల్లు సహా అనేక పథకాల ద్వారా కుటుంబమంతా లబ్ధిపొందాం. అందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. కుట్టు మెషిన్ అంటే ఏ అవగాహన లేని నేను ఇపుడు ఏవైనా రిపేర్లు వచ్చినా సరిచేసుకునే స్థాయిలో శిక్షణ ఉపయోగపడింది.


*_బీ.లక్ష్మిదేవి, డోన్ పట్టణం*


*ప్యాపిలి పట్టణంలో కోటి రూపాయాలతో ఆధునీకరించిన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, పార్కు ప్రారంభం*


ప్యాపిలి పట్టణంలో కోటి రూపాయాలతో ఆధునీకరించిన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, పార్కు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతుల మీదుగా బుధవారం ప్రారంభోత్సవం జరిగింది. పైలాన్ ఆవిష్కరణతో పాటు రిబ్బన్ కటింగ్ చేసి గెస్ట్ హౌస్ ను నిరాడంబరంగా మంత్రి బుగ్గన ప్రారంభించారు. అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సోఫాలు, ఫ్యాన్లు, టేబుళ్లను మంత్రి పరిశీలించారు. రూ.64 లక్షలతో అద్భుతంగా తయారైందన్నారు. అనంతరం రూ.46 లక్షలతో ఏర్పాటు చేసిన పార్కుకు సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం పార్కు స్థలంలో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఉయ్యాల వంటి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆరోగ్యం కోసం  శ్రద్ధపెట్టే వారికై ప్రత్యేకంగా మైదానంలో ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలను చూశారు. అనంతరం ఇంకా షటిల్ కోర్టు, వాలీబాల్ వంటి క్రీడల కోసం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని, గెస్ట్ హౌస్ వెనుక ఏర్పాటు చేసిన టాయిలెట్స్ ను కూడా మంత్రి పరిశీలించారు.


డోన్ కు వెళ్లే దారిలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెంగలాంపల్లి చెరువు పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.3 కోట్లతో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తయితే చుట్టపక్కల ఆహ్లాదకర వాతావరణం   నెలకొంటుందన్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్, అధికారులను మంత్రి బుగ్గన ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగుల శ్యామ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దిలీప్ చక్రవర్తి, ఏపీఐఐసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి, ప్యాపిలి వైసీపీ మండల అధ్యక్షులు బొర్రా మల్లికార్జునరెడ్డి, ప్యాపిలి జెడ్పీటీసీ శ్రీరామ్ రెడ్డి, మండల వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ మెట్టు వెంకటేశ్వర్లు రెడ్డి,  సింగిల్ విండో ఛైర్మన్ బోరెడ్డి రామచంద్రారెడ్డి, ప్యాపిలి సర్పంచ్ చెవిటి లక్ష్మిదేవి, ఏపీ సీడాప్ సీఈవో శ్రీనివాసులు, ఏపీఎస్ఎస్డీసీ డీఎస్డీవో ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.



Comments