సేవా సైన్యమూ స్టార్‌ క్యాంపెయినర్లే...


ఉరవకొండ, అనంతపురం జిల్లా (ప్రజా అమరావతి);




*వరుసగా నాల్గవ ఏడాది– వైఎస్సార్‌ ఆసరా.*


*నాలుగోవిడత ఆసరా కార్యక్రమంలో భాగంగా రూ.6,394.83 కోట్ల ఆర్ధిక సాయాన్ని జనవరి 23 నుంచి రెండు వారాలపాటు పండగ వాతావరణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:* 


చిక్కటి చిరునవ్వులు మధ్య ఇంతటి ప్రేమానురాగాలు మధ్య ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తున్నాం. 

ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.


*వాగ్ధానాన్ని పూర్తి చేస్తున్నాం...*

నాలుగు సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైయస్సార్‌ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్‌ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతున్నాం.

దేశ చరిత్రలోగానీ, మహిళా చరిత్రలోగానీ, మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా, ఇంత మమకారం చూపుతూ ఈ 56 నెలల్లో మనం చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి ఏకంగా ఈరోజు సొమ్ముతో కూడా కలుపుకొంటే అక్షరాలా రూ.25,570 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 


ఈ రోజు ఎక్కడైనా దేశం బాగుంది, రాష్ట్రం బాగుంది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే... ఆ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు, వాళ్ల పిల్లలకు నాణ్యమైన విద్య అంతుందా? లేదా? అన్న ప్రామాణికం. వారి అక్షరాస్యత పెరుగుదల, వారి ఆదాయంలో వృద్ధి,  వారికి లభిస్తున్న భద్రత, రక్షణ.. రాజకీయంగా అధికారంలో దక్కుతున్న వాటా ఇవన్నీ లెక్కేసుకుని మహిళా సాధికారత విషయంలో ఒక రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు ముందంజలో ఉంటే.. రాష్ట్రం కూడా మందంజలో ఉంటుందని అందరూ నమ్ముతారు.


*మన రాష్ట్రం నుంచే 21వ శతాబ్ధపు ఆధునిక మహిళ...*

ఈరోజు నేను గర్వంగా చెబుతున్నాను. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా 21 వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డమీద, గడపగడపలోనూ ఆవిర్భించాలన్న లక్ష్యంతో 56 నెల్లలో మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగూ వేసింది. 

మహిళా సాధికారతకు దన్నుగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా 56 నెలల్లో సంక్షేమం, అభివృద్ధిలో తేడా కనిపించే విధంగా అడుగులు పడుతున్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే వివక్షకు, లంచాలకు చోటు లేకుండా ప్రతి పథకం మన రాష్ట్రంలో అమలవుతోంది. 

ఈరోజు రూ. 6,400 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నేరుగా ఇచ్చేలా అడుగులు వేస్తున్నాం. 

ఈ ఒక్క పథకానికి సంబంధించి రూ. 25,570 కోట్లు ఈరోజు మనం ఖర్చు చేస్తున్నాం. 



*4 దఫాల్లో 79 లక్షల మంది మహిళలు మంచి చేస్తూ....*

79 లక్షల మందికి మంచి చేస్తూ.. ఇప్పటికే 3 దఫాల్లో రూ.19,178 కోట్లు ఇవ్వడమే కాక, నాలుగో దఫా కింద ఇవాళ ఇస్తున్న రూ.6,400 కోట్లు కలుపుకొంటే రూ.25,570 కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా ఇచ్చినట్లవుతుంది. 

ఈ 56 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద రూ.4,968 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మీ బిడ్డ ప్రభుత్వం నేరుగా ఇచ్చింది. 

వాళ్ల కాళ్ల మీద వాళ్లాను నిలబెట్టడం కోసం వైయస్సార్‌ సున్నా వడ్డీ, వైయస్సార్‌ ఆసరా రెండు కార్యక్రమాలు తీసుకుంటే రూ.31వేల కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. 


ఈరోజు నేడు విడుదల చేస్తున్న రూ.6,400 కోట్లతో కలుపుకొంటే మనందరి ప్రభుత్వం 56 నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపిన సొమ్ము రూ.2.53 లక్షల కోట్లు.  గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఎన్నడూ జరగని విధంగా, లంచాలకు వివక్షకు చోటు లేకుండా రాష్ట్రంలో మీ బిడ్డ పాలనలో చేయడం కూడా ఒక రికార్డే.  


*పథకాలు అమల్లో తేడా..  నాడు–నేడు.*

ఆశ్చర్యమేమిటంటే... ఏ పథకంలోనైనా... ఎక్కడ?  ఎవరు? ఎవరికి? ఇస్తున్నామనే వ్యత్యాసం చూపించడం లేదు. గతంలో ఏ పథకం కావాలన్నా మొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని? అంతటితో ఆగిపోయేది కాదు జన్మభూమి కమిటీలు దగ్గర నుంచి మొదలుపెట్టి, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరికీ లంచాలు ఇచ్చే పరిస్థితి. 

ఈరోజు రూ. 2.53 లక్షల కోట్లు ఎక్కడా కులం చూడటం లేదు, మతం, ప్రాంతం, వర్గం, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా.. మన పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత మాత్రమే ప్రమాణికంగా ప్రతి కుటుంబానికి నేరుగా పోతోంది. 


ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష చూపకుండా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంటింటా అక్కచెల్లెమ్మల మీద ఇంత బాధ్యతగా మమకారం చూపుతున్న ప్రభుత్వం మనది మాత్రమే. 

56 నెలల పాలనలోనే మహిళాసాధికారత కోసం ఏం చేశామో నాలుగు మాటల్లో చెబుతాను. 

ఒక్క జగనన్న అమ్మ ఒడి అనే పథకం ద్వారా అక్షరాలా 57 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికి  సొమ్ము రూ.26.67 వేల కోట్లు ఇచ్చాం. 

వైయస్సార్‌ ఆసరా ద్వారా 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.25,500 కోట్లు ఇవ్వడం జరిగింది. 

వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా 45–60 సంవత్సరాల మధ్యలో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఏకంగా 31.23 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు.. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ వారు బాగుండాలని, చిరునవ్వులు చూడాలని అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది రూ.14,129 కోట్లు.


ఈ 56 నెలల కాలంలోనే నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండాలని ఏకంగా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు 22లక్షల ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నది కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే. 


ఈ కడుతున్న ఇళ్లు పూర్తయితే రూ.2.70 లక్షలతో ఇళ్లు కడుతున్నాం. ఇళ్లు పూర్తయితే .... ఒక్కో ఇంటి విలువ ప్రాంతాన్ని బట్టి రూ.5–20 లక్షల దాకా పలుకుతోంది. వాళ్లకు ఇస్తున్న ఆస్తి విలువ రూ.2–3 లక్షల కోట్లు. 

అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద తమ కాళ్ల మీద నిలబెట్టేందుకు కోటీ 5 లక్షల మందికి మంచి జరిగిస్తూ  వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద ఇచ్చినది రూ.4,968 కోట్లు. 

ఈ 56 నెలల కాలంలోనే 25.40 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ పిల్లల కోసం విద్యాదీవెన కింద రూ.11,900 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.4275 కోట్లు ఇచ్చాం. 


వీటితో పాటు కాపు అక్కచెల్లెమ్మలకు కాపు నేస్తం కింద రూ.2028 వేల కోట్లు ఇచ్చాం. పేద ఓసీ అక్కచెల్లెమ్మల సాధికారత కోసం ఈబీసీ నేస్తం కింద రూ.1,257 కోట్లు ఇచ్చాం. 


పేదల పెన్షన్‌ అందుకుంటున్న వారు దాదాపు 66.34 లక్షల మంది ఉంటే.. ఇందులో నా  43,78,000 మంది పెన్షన్లు అందుకుంటున్న వారు నా అవ్వలు, నా అక్కచెల్లెమ్మలే.  ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకుండా, అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ.. చిరునవ్వుతో ఏకంగా వాలంటీర్‌ ఇంటికి వచ్చి అవ్వా బాగున్నావా ? అని అడుగుతూ పెన్షన్‌ సొమ్ము చేతిలో పెట్టి పోతున్నారు. ఇది జరుగుతున్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే. 

ఈ పెన్షన్ల సొమ్ము కింద ఖర్చు చేసిన సొమ్ము రూ.84,730 కోట్లు. ఇందులో రూ. 56,000 కోట్లు అవ్వలు, అక్కచెల్లెమ్మల పెన్షన్‌  కోసం ఖర్చు చేశాం. 


చిరువ్యాపారాలు చేసుకుంటున్న అక్కచెల్లెమ్మలకు జగనన్న తోడు ద్వారా ఇచ్చిన వడ్డీ లేని రుణాలు రూ.2,610 కోట్లు అయితే, చేదోడు ద్వారా వాళ్లకు ఇచ్చిన సొమ్ము రూ.404 కోట్లు. 


*గతంలో ఇన్ని కార్యక్రమాలు చూశామా...*

ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా గతంలో ఈ మాదిరిగా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచన చేసిందిగానీ, వారి పిల్లల గురించి, కుటుంబాల గురించి గాని పట్టించుకున్నది ఎప్పుడైనా చూశామా?

గతంలో కూడా ఒక పాలన ఉండేది. అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. మిగలినవన్నీ మామూలే. అప్పుల గ్రోత్‌ రేటు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే. 


మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి అక్కచెల్లెమ్మ  ముఖాన చిరునవ్వు ఎలా కనిపిస్తోంది. గతంలో ఐదేళ్ల కాలంలో ఎందుకు ఈ మంచి జరగలేదనేది ఆలోచన చేయమని అడుగుతున్నాను.


*కారణం ఒక్కటే.*

గతంలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లు ఉంటే... ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. 

ఎవరూ లంచం అడగడం లేదు, వివక్ష చూడం లేదు. 



*పండగలా–ఆసరా కార్యక్రమం..*

ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 5వ తేదీ దాకా పండుగ వాతావరణంలో నాలుగో విడత వైయస్సార్‌ ఆసరా కార్యక్రమం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.6400 కోట్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. 

ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాలు పంచుకుంటారు. అక్కచెల్లెమ్మల సంతోషాల్లో వీళ్లు ఏకమవుతారు. 

గ్రామ సచివాలయాల్లో మాట్లాడినప్పుడు అక్కచెల్లెమ్మలకు మైకులిచ్చి ఈ 56 నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది, అక్కచెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయన్న కథలు.. రాష్ట్రానికే కాదు.. దేశానికే వినిపించాలి. 


ఈ రాష్ట్రంలో వైయస్సార్‌ ఆసరా, చేయూత, అమ్మఒడి మూడు కార్యక్రమాలతో పాటు సున్నావడ్డీ కలవడం రాష్ట్రంలో ఎంత మంచి జరిగిందనేది ఆలోచన చేయాలి. గతానికి ఇప్పటికీ తేడా గమనించాలి. 


*2014లో బాబు కట్టుకథలు...*

2014 ఎన్నికల ముందు చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని, కట్టొద్దని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు. కనపడకుండా చేశాడు. మాఫీ చేస్తానని చెప్పిన మాట గాలికొదిలేశాడు. అక్టోబర్‌ 2016 నుంచి అక్కచెల్లెమ్మలకు కడుతున్న సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. 

అప్పట్లో రూ.14,205 కోట్లు ఉన్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు కాస్తా తడిసి మోపుడై వడ్డీలు,చక్రవడ్డీలు కట్టే పరిస్థితిలోకి పోయి రూ.25,500 కోట్లకు ఎగబాకాయి. 

చంద్రబాబు మాటతో ఏ రకంగా అక్కచెల్లెమ్మలు దెబ్బతిన్నారన్నదానికి ఇవే ఉదాహరణలు.


చంద్రబాబు చేసిన మోసం వల్ల ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌ నుంచి సంఘాలు చంద్రబాబు హయాంలో ఏకంగా 19 శాతానికి పడిపోయాయి. 

ఈరోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడుతున్నాయి. 19శాతానికి పడిపోయిన పరిస్థితి నుంచి ఈరోజు ఏకంగా 91 శాతం అక్కచెల్లెమ్మలు ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌లో సంఘాలుగా ఉన్నాయి.

గతంలో ఔట్‌ స్టాండింగ్‌ కింద 18 శాతం అక్కచెల్లెమ్మల రుణాలన్నీ (నాన్‌ ఫెర్ఫార్మింగ్‌ అసెట్స్‌) ఎన్‌పీఏలుగా పడిపోయే కార్యక్రమం అప్పట్లో జరిగితే.. ఈరోజు పొదుపు సంఘాల్లో రుణాల రికవరీ 99.83 శాతంతో ఎన్‌పీఏలు కేవలం 0.17 శాతం మాత్రమే కనిపిస్తున్నాయి. తేడా గమనించండి.


అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మనందరి ప్రభుత్వం ఎంతగా నిలబడగలిగిందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలే. 

ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ల కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తపన, తాపత్రయంతో అడుగులు పడిన రోజులు ఈ 56 నెలల కాలంలోనే అన్నది గమనించాలి.



*అక్కచెల్లమ్మలకు అండగా నామినేటెడ్‌ పనులు–పదవుల్లోనూ..* 

ఈ 56 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలు సాధికారత దిశగా అడుగులు వేసే కార్యక్రమం జరిగింది. అంతే కాకుండా ఏకంగా అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం వారికే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని అడుగులు పడ్డాయి. 


నామినేషన్‌లో ఇచ్చే కాంట్రాక్ట్‌ పనులు కూడా 50 శాతం అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని చట్టం చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వమే. ఈ రోజు ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ఒక మహిళా కానిస్టేబుల్‌ అక్కచెల్లెమ్మల కోసమే నియమితులయ్యారు. 


ఇవాళ అక్కచెల్లెమ్మల కోసం దిశ యాప్‌ తీసుకొచ్చాం. ఏకంగా 1.46 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ అయ్యింది. ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే చాలు, ఐదు సార్లు ఫోన్‌ షేక్‌ చేసినా చాలు.. పోలీస్‌ సోదరుడి దగ్గర నుంచి ఫోన్‌ వస్తుంది. 10 నిమిషాల్లోనే పోలీస్‌ సోదరుడు వచ్చి ఏమైందని అడిగే గొప్ప వ్యవస్థ పుట్టుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే. 


*చెడు మాత్రమే చేసిన చంద్రబాబు ముఠా...*

ఇంత మంచి మనం చేసినా... ఏమీ చేయని వారికి, చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న వారికి, చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠా, ఆయనకు తోడు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. రోజూ ఇలాంటి వారికి సమాధానం ఇవ్వాల్సి రావడమే నిజంగా కలికాలం అనిపిస్తుంది. 



*నేడు ప్రతి ఇంట్లో చేసిన మంచి కనిపిస్తుంది.*

కారణం ప్రతి ఇంట్లోనూ జరిగిన మంచి కనిపిస్తోంది. అయినా రోజూ అబద్ధాలు, ఎక్కువ మంది వాళ్లవైపు ఉన్నారు కాబట్టి, టీవీ చానళ్లు ఉన్నాయి కాబట్టి రోజూ అబద్దాలతో వడ్డించడం, దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే దీన్నే కలికాలం అంటారు. 


*చేసిన మంచి లేకపోయినా బాబుకు–స్టార్‌ క్యాంపైనర్లు...*

ఏ మంచీ చేయకపోయినా, ఏ స్కీములూ ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ చంద్రబాబుకేమో స్టార్‌ క్యాంపెయినర్లు దండిగా.. మంది ఉన్నారు. 


బాబు కోసం చంద్రబాబును భుజానికెత్తుకొని మోసే ముఠా. చాలా మంది ఉన్నారు. 

మన రాష్ట్రంలో ఎవరూ ఉండరు. వాళ్లు ఇళ్లు, కాపురాలు,సంసారాలు పక్క రాష్ట్రంలో ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మినెంట్‌ రెసిడెంట్‌గా ఉన్న దత్తపుత్రుడు స్టార్‌ క్యాంపెయినర్‌ అయితే, చంద్రబాబు వదినగారు.. ఆమె పక్కపార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మరో స్టార్‌ క్యాంపెయినర్‌. ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుంది. 

పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటున్న ముగ్గురు మీడియా అధిపతులు. వీళ్ల ముగ్గురూ పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటారు. అక్కడున్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. వీళ్లంతా బాబుకు స్టార్‌ క్యాంపెయినర్లే. 



*పసుపు కమలాలు...*

వీళ్లుకాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్న ఇంకొంత మంది స్టార్‌ క్యాంపెయినర్లు.. వీళ్లంతా చంద్రబాబుకు తోడుగా ఉన్నారు. 

బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న.. అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా ఇంకొంత మంది బాబుకు స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారు. 


అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ, ఇతర పార్టీల్లోనూ రకరకాల రూపాల్లో చంద్రబాబుకు బినామీలు ఇప్పటికీ స్టార్‌ క్యాంపెయినర్లుగా కొనసాగుతున్నారు. 


టీవీలు ఆన్‌ చేస్తే విశ్లేషకుల పేరిట కనిపిస్తారు, వేదికల పేరు మీద, మేధావులు అని చెప్పుకుంటూ కనిపిస్తారు. 

రక రకాల స్టార్‌ క్యాంపెయినర్లు బాబు కోసం పని చేస్తారు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీళ్లందరూ భాగస్వాములే. 



*మీ బిడ్డకు ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు..*

ఏ అభివృద్ధీ చేయని వారికి, ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంత మంది స్టార్‌  క్యాంపెయినర్లు ఉన్నారు గానీ, ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికీ మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్‌ క్యాంపెయినర్లూ లేరు. 

కానీ మీ బిడ్డ వీళ్లందరినీ నమ్ముకోలేదు. వీళ్లందరికీ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాడు. వీళ్లందరికన్నా ఎక్కువ స్టార్‌ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారని చెప్పడానికి సంతోషపడుతున్నాడు. 



*జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్‌ అజెండా...*

మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా? ఈ జెండాలు జతకట్టిన వారంతా అనుకుంటున్నారు.. మీ బిడ్డకకు స్టార్‌ క్యాంపెయినర్లు లేరని.. వారికీ నాకూ తేడా ఏమిటో తెలుసా? కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్‌ ఎజెండా.. 

కాబట్టే వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్‌ క్యాంపెయినర్లు, దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలోనే ఎవరూ ఉండరని ఈ సందర్బంగా తెలియజేస్తున్నాను.


మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లు.. ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లూ.. ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరూ మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. 

ఒక వైయస్సార్‌ ఆసరా అందుకున్న నా 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. 

సున్నావడ్డీ అందుకున్న కోటి మందికిపైగా మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. 57 లక్షల మంది తల్లులు, కోటికిపైగా ఉన్న ఆ పిల్లలు వీళ్లంతా కూడా మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. 

చేయూత అందుకున్న 31 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. 


31 లక్షల మంది ఇళ్ల పట్టాలందుకున్న నా అక్కచెల్లెమ్మలు, వాళ్ల కుటుంబాలు, అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ఈ కుటుంబాలన్నీ కూడా మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. 

రైతు భరోసా అందుకుంటున్న అరకోటికిపైగా ఉన్న 52 లక్షల మంది ఆ రైతన్నలందరూ మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. 

నెలనెలా పెన్షన్లు అందుకుంటున్న 65 లక్షల మంది నా అవ్వాతాతలు, నా వికలాంగులు, వికలాంగ సోదరులు, అక్కచెల్లెమ్మలు, వితంతు అక్కచెల్లెమ్మలు వీళ్లందరూ మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. 


ఆరోగ్యశ్రీ ద్వారా మంచి జరిగిన 30 లక్షల మంది కుటుంబాలు.. వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. 

దిశ యాప్‌ ద్వారా రక్షణ పొందుతున్న అక్కచెల్లెమ్మలందరూ మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. 



*ప్రభుత్వ బడుల ఇంగ్లిషు మీడియం పిల్లలూ స్టార్‌ క్యాంపెయినర్లే...* 

ఇంగ్లిషు మీడియం ద్వారా బడులు, బతుకులు మారుతున్నాయని అర్థం చేసుకున్న గవర్నమెంట్‌ బడి పిల్లలు, వారి తల్లిదండ్రులంతా మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. గ్రామంలో వచ్చిన మార్పులు కళ్లారా చూసిన గ్రామీణ ప్రజలందరూ మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. 



*సేవా సైన్యమూ స్టార్‌ క్యాంపెయినర్లే...*

ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ ఆదివారమైనా, సెలవురోజైనా ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికంటే ముందే తలుపుతట్టి గుడ్‌మార్నింగ్‌ చెబుతూ పెన్షన్‌ డబ్బులు అందజేస్తున్న 2.50 లక్షల మంది వాలంటీర్‌ తమ్ముళ్లు, చెల్లెమ్మలు సేవా సైన్యం కూడా మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లే. 

మన నవరత్నాల పాలనలో ఎలాంటి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఏకంగా 2.53 లక్షల కోట్లు బటన్‌ నొక్కగానే అందుకున్న ఆ ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు మీరే మీ బిడ్డకు శ్రీరామరక్ష అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నాను.


*మీ బిడ్డ పైన దేవుడుని– కింద మిమ్మల్నే నమ్ముకున్నాడు...*

మీ బిడ్డ మిమ్మల్నే నమ్ముకున్నాడు. చంద్రబాబు మాదిరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి అండదండలు లేవు. 

మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద మిమ్మల్ని తప్ప ఇంకొకర్ని మీ బిడ్డ నమ్ముకోలేదు. రాబోయే రోజుల్లో అబద్ధాలు మోసాలు చేస్తారు. కేజీ బంగారం ఇస్తామంటారు. ప్రతి ఇంటికీ బెంజ్‌ కారు కొనిస్తామంటారు. ఆలోచన చేయమని కోరుతున్నా. 


మీ ఇంట్లో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్‌ క్యాంపెయినర్లుగా రండి అని మిమ్మల్నందరినీ కోరుతున్నా. మీ బిడ్డకుసైనికులుగా మీరే నిలబడండి. 

జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు, మనం నొక్కే బటన్‌ ఎందుకు నొక్కుతున్నారో గుర్తుపెట్టుకోవాలి. 


కారణం మీరు వేసే ఓటు జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కాదు.. మీరు వేసే ఓటు ఆ ప్రతి పేద కుటుంబం పేదరికం నుంచి బయట పడాలి అంటే మీరు వేసే ఆ ఓటు వల్ల  జగన్‌ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుందన్న వాస్తవాన్ని మాత్రం మర్చిపోకండని గుర్తు చేస్తున్నాను.

 

మంచి చేసే అవకాశం, పరిస్థితులు ఇంకా ఎక్కువ దేవుడు ఇవ్వాలి, మీ అందరి ముఖాన చిరునవ్వులు ఇంకా చూడాలి,మీ పిల్లల బతుకులు ఇంకా బాగుపడాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను.


*చివరిగా...*

కాసేపటి క్రితం విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గానికి జరిగిన మంచి గొప్పగా చెపుతూ.. మరోవైపు జరగాల్సినవి, చేయదగినవిఅడిగాడు. తాను అడిగినట్టు జీడిపల్లి రిజర్వాయరు, బెలుగుప్ప మండలానికి సంబంధించి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకు సంబంధించి పనులు వేగవంతం చేస్తాం. 76వేల ఎకరాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ ఛానెల్‌ సిస్టం కోసం రూ.68 కోట్లు అడిగాడు. దీని గురించి అడుగులుముందుకు పడతాయి. బీసీ రెసిడెన్షియల్‌ పెన్నా అహోబిలంలో అడిగాడు. దీనికోసం రూ.33 కోట్లు కేటాయిస్తున్నాం. అదే విధంగా 12 మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల కోసం రూ.20 కోట్లు అడిగాడు. ఇది కూడా మంజూరు చేస్తున్నాం. ఉరవకొండ పట్టణంలో 10వేలు ఇళ్లు గతంలో ఉంటే మనం మరో 8వేలు ఇళ్లు కడుతున్నాం అని చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. దేవుడి దయతో ఇంతమంది అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతుంది. దీనికి దేవుడికి రుణపడి ఉంటానని, మీ అందరికీ మంచి జరగాలని మనసారా ప్రార్ధిస్తూ సెలవు తీసుకుంటున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.

Comments
Popular posts
టూల్స్ మరియు కిట్‌ల పంపిణీతో ఆంధ్రప్రదేశ్‌లోని చేతివృత్తుల వారికి అధికారం కల్పించిన KVIC చైర్మన్.
Image
Harshavardhan selected for Chennai Super Kings team
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image
అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణ.
Image
India is on high-growth trajectory to achieve its development goals by 2047: Minister Hardeep S Puri.