రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ అప‌ర సంజీవ‌నిలా ఆరోగ్య‌శ్రీ.

 *జేఏఎస్ - 2 లో 13818 క్యాంపులు*

*ప్ర‌జ‌లంద‌రికీ  నాణ్య‌మైన వైద్యం ఉచితంగా అందాల‌నేది జ‌గ‌న‌న్న ల‌క్ష్యం*

*రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ అప‌ర సంజీవ‌నిలా ఆరోగ్య‌శ్రీ


*

*రోగుల‌కు ఆరోగ్య ఆస‌రా ద్వారా గొప్ప భ‌రోసా*

*ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానం దేశానికే ఆద‌ర్శం*

*జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష ద్వారా ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు*

*సొంత ఊళ్లు, వార్డుల్లోకే ఉచితంగా స్పెషాలిటీ వైద్యం*

*జేఏఎస్ -2లో ఉచితంగా ప‌రీక్ష‌లు, మందులు పంపిణీ*

*మెరుగైన వైద్యం అవ‌స‌ర‌మైన‌వారికి ఆరోగ్య‌శ్రీ ద్వారా ఉచిత వైద్యం*

*రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని*

*ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మం రెండో ద‌శ ప్రారంభం*

*చిన‌ప‌ల‌క‌లూరులో ప్రారంభించిన మంత్రి విడ‌ద‌ల ర‌జిని*

చిలకలూరిపేట (ప్రజా అమరావతి);

జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష రెండో ద‌శ కార్య‌క్ర‌మం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 13818 వైద్య శిబిరాల‌నునిర్వ‌హించ‌బోతున్నామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగ‌ళ‌వారం నుంచి జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష రెండో ద‌శ మెడిక‌ల్ క్యాంపులు ప్రారంభ‌మ్యాయి. మంత్రి విడ‌ద‌ల ర‌జిని గుంటూరు రూర‌ల్ మండ‌లం చిన‌ప‌ల‌క‌లూరులో నిర్వ‌హించిన క్యాంపున‌కు అధికారికంగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మండ‌లాల‌వారీగా గ్రామాల్లో ప్ర‌తి మంగ‌ళ‌వారం, శుక్ర‌వారం వారానికి రెండేసి చొప్పున వైద్య శిబిరాలు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు. ప‌ట్ట‌ణాల వారీగా కూడా ప్ర‌తి వారానికి రెండేసి స‌చివాల‌యాల ప‌రిధిలో వైద్య శిబిరాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. వార్డు స‌చివాలయాల ప‌రిధిలో ప్ర‌తి వారంలో బుధ‌వారం, గురువారం ఈ శిబిరాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు. ఇలా మొత్తం 13818 వైద్య శిబిరాలు జ‌రుగుతాయ‌న్నారు. మొత్తం 10032 గ్రామ స‌చివాల‌యాలు, 3786 వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో వైద్య శిబిరాలు నిర్వ‌హిస్తామని పేర్కొన్నారు. ఇప్ప‌టికే వైద్య ప‌రీక్ష‌లు కొన‌సాగుతున్నాయ‌న్నారు. అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారిని వైద్య శిబిరాలకు తీసుకురావ‌డం, ప్ర‌భుత్వ వైద్యుల ఆధ్వ‌ర్యంలో వీరికి ప‌రీక్ష‌లు జ‌రిగేలా చూడ‌టం, ఉచితంగా మందులు పంపిణీ చేయ‌డం ఈ కార్య‌క్ర‌మ ముఖ్య ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం అవ‌స‌రం ఉన్న వారిని పెద్ద పెద్ద ఆస్ప‌త్రుల‌కు పంపి ఉచితంగా వైద్యం అందేలా చేయ‌డం ఈ కార్య‌క్ర‌మంలో ఒక భాగం అని వెల్ల‌డించారు. రోగి పూర్తిగా కోలుకునే వ‌ర‌కు ఆ రోగిపై ఆరోగ్య‌మిత్ర‌, ఏఎన్ ఎం ల ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంద‌ని వివ‌రించారు. ఇలాంటి గొప్ప కార్య‌క్ర‌మాల‌ను ఏ రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేయ‌డం లేద‌ని ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మాత్ర‌మే చేస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా, వేగంగా అందించాల‌నే గొప్ప ల‌క్ష్యంతో ప‌నిచేస్తుండ‌టం వ‌ల్ల‌నే ఇలాంటి కార్య‌క్ర‌మాలు ప్ర‌వేశ‌పెట్ట‌గ‌లుగుతున్నామ‌న్నారు

*క‌నివిని ఎరుగ‌ని సంస్క‌ర‌ణ‌లు*

వైద్య ఆరోగ్య రంగంలో క‌నీవిని ఎరుగ‌ని సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య‌శ్రీ ద్వారా అందుతున్న చికిత్స‌ల సంఖ్య‌ను ఏకంగా 3257కు జ‌గ‌నన్న పెంచార‌ని పేర్కొన్నారు. ఆరోగ్య‌శ్రీ కార్డుల‌ను కూడా కొత్త‌వి మంజూరు చేసి జేఏఎస్ -2 లో భాగంగా ఇంటింటికీ తిరిగి అంద‌జేస్తున్నామ‌ని చెప్పారు. ఆరోగ్య‌శ్రీ వైద్య ఖ‌ర్చును ఏకంగా రూ.25 లక్ష‌ల‌కు పెంచిన నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అని ప్ర‌శంసించారు. ఆరోగ్య ఆస‌రా అనే ఒక గొప్ప ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి రోగుల‌కు చికిత్స కాలంలో ఆర్థిక సాయం అంద‌జేస్తున్న ఏకైక ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మాత్ర‌మే అని చెప్పారు. రోజుకు రూ.225 చొప్పున గ‌రిష్టంగా రూ.5వేల వ‌ర‌కు అందిస్తున్న ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని చెప్పారు. ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టివ దేశంలోనే సంచ‌ల‌నాన్ని జ‌గ‌న‌న్న సృష్టించార‌ని  మంత్రి పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఇళ్ల‌కే వైద్యులు వ‌చ్చి రోగుల‌కు చికిత్స అందిస్తున్నార‌ని తెలిపారు. పాఠ‌శాల‌లు, అంగ‌న్ వాడీ స్కూళ్ల‌లోని పిల్ల‌ల‌కు కూడా ఉచితంగా వైద్యం అందుతోంద‌న్నారు. నాడు - నేడు కింద ఏకంగా రూ.17 వేల కోట్ల ను ప్ర‌భుత్వ ఖ‌ర్చు చేసింద‌న్నారు. దీనివ‌ల్ల ప్రాథ‌మిక స్థాయి నుంచి టీచింగ్ ఆస్ప‌త్రుల వ‌ర‌కు అన్ని ద‌శ‌లో వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేసిన గొప్ప ప్ర‌భుత్వం త‌మ‌ది అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త వైద్య క‌ళాశాల‌ల‌ను ఏకంగా రూ.8500 కోట్ల ఖ‌ర్చుతో నిర్మిస్తున్నామ‌న్నారు. వీటిలో 5 ప్ర‌భుత్వ క‌ళాశాల‌లు మొద‌ల‌య్యాయ‌ని, మిగిలిన‌వి కూడా రానున్న రోజుల్లో ప్రారంభ‌మ‌వుతాయ‌ని వెల్ల‌డించారు. క‌లెక్ట‌ర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్ర‌జ‌లంద‌రి ఆరోగ్యాన్ని ప్ర‌భుత్వం భ‌రోసా ఇస్తోంద‌ని చెప్పారు. జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌లు వారి ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుచునే అవ‌కాశం ఏర్ప‌డింద‌న్నారు. కార్యక్ర‌మంలో ఆరోగ్య‌శ్రీ సీఈవో డీకే బాలాజీ, డీఎంఈ న‌ర్సింహం, డీఎంఅండ్‌హచ్‌వో శ్రావ‌ణ్‌కుమార్‌, జెడ్పీటీసీ తుమ్మ‌ల  సుబ్బారావు, ఎంపీపీ ఇంటూరి ప‌ద్మావ‌తి, స‌ర్పంచి ఎదురుపాక వెంక‌ట్, ఎంపీడీవో ఆదినారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments