రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా.


కాకినాడ, జనవరి 19.   (ప్రజా అమరావతి);.


*రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా.


.*


జిల్లాలోని వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్-2024 రూపకల్పనలో భాగంగా జిల్లాలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలు, ఫారం 6, 7, 8 లకు పరిష్కారాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రాజకీయ పార్టీ ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఈ నెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు. ఈ ఓటర్ల జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఆమె వివరించారు. జిల్లాలోని 1,637 పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన కనీస సౌకర్యాలైనా విద్యుత్, ఫర్నిచర్, తాగునీరు, మురుగు దోడ్లు, ర్యాంప్ నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ఈవీఎం ద్వారా ఓటు హక్కు వినియోగంపై ప్రత్యేక కేంద్రాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు.

     సమావేశంలో ఇన్చార్జి డీఆర్వో, డీఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, రాజకీయ పార్టీల ప్రతినిధులు రావూరి వెంక‌టేశ్వ‌ర‌రావు (వైసీపీ), పెద్దిరెడ్డి రవికిరణ్ (భాజ‌పా), గదులు సాయి బాబా(టీడీపీ), సబ్బారపు అప్పారావు(బీఎస్పీ), మోర్త రాజశేఖర్ (సీపీఎం), నరాల శివ (ఆప్ప్,) కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటీ ఎం.జగన్నాథం ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments