రాష్ట్రంలో అరాచక పాలన.


 --- రాష్ట్రంలో అరాచక పాలన

--- బీజేపీకి తొత్తులుగా మారిన వైసీపీ, టీడీపీ ఎంపీలు

--- కాంగ్రెస్ ద్వారానే రాష్ట్రానికి న్యాయం

--- పీసీసీ చీఫ్ షర్మిల   

  కాకినాడ, జనవరి 25 (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలనలో సాగుతోందని దాన్ని ప్రజలు తిరస్కరించాలని రాష్ట్రంలో ఉన్న వైసీపీతోపాటు టీడీపీకి చెందిన ఎంపీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లిన తర్వాత బీజేపీ ఎంపీలుగా వ్యవహరిస్తున్నారంటూ షర్మిల మండిపడ్డారు. గురువారం కాకినాడలోని సూర్య కళామందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది.

   ఈ సమావేశంలో పలువురు ప్రసంగించగా ముఖ్య అతిథిగా హాజరైన షర్మిల అధికార వైసీపీ పాలన వైఫల్యాలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అరాచక పాలన, సంక్షేమ పాలన జరుగుతోందనే ఆశపడ్డ ప్రజలకు సీఎం జగన్ నేతృత్వంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. తమ తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశించిన విధంగా వైకాపా పార్టీలో సంక్షేమం అందుతుందని తాను గ్రహించానని దానికి విరుద్ధంగా అక్కడ రాక్షస పాలనను జగన్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వచ్చిన వెంటనే రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విభజన హామీలు వంటి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రత్యేక హోదా పదేళ్లు సాగుతుందని పదేళ్లు ఇస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రకటించిందని  చివరి 5 ఏళ్లలో జగన్ ఆ హామీని పూర్తిస్థాయిలో నిర్వహించకపోగా ఆ పార్టీ చెందిన ఎంపీలు ఢిల్లీలో కేంద్రంలోని బీజేపీ వారికి తొత్తులుగా వ్యవహరించారన్నారు. రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష జనసేన, టీడీపీలకు ఓట్లు వేయవద్దని వారిలో ఎవరికి వేసిన బీజేపీ ఖాతాలోకే వెళతాయని చెప్పారు. కాంగ్రెస్ ద్వారానే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ, సుస్థిర పాలన అందుతుందని ప్రధాని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని కేవలం రాక్షస పాలన, అరాచక పాలన నడుస్తుందంటూ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారుటకు నాడు చంద్రబాబు, నేడు జగన్ తీరే కారణమన్నారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలిపోవడానికి ప్రధాన కారణం జగనే అని దీనిని సాక్ష్యం తమ అమ్మ విజయలక్ష్మి అని అన్నారు.    

  దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు పక్షపాతం అని ఆయన వ్యవసాయాన్ని పండగనే వారని ప్రస్తుతం ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పిల్లలు, కుటుంబాన్ని వదులుకొని పాదయాత్ర చేశానని షర్మిల చెప్పారు. సీఎం అవ్వకముందు జగన్ ఒకలా ఉన్నారని అయిన తర్వాత మరోగా మరోలా మారారంటూ చెప్పారు. సీఎం జగన్ అయోమయ, అసమర్ధ పాలన వల్ల రాష్ట్రానికి రాజధాని కూడా లేని పరిస్థితి తీసుకొచ్చారన్నారు. వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలు కేవలం కీలుబొమ్మలుగా మారారని షర్మిల అన్నారు. ఈ ఏడాది జరిగే ఎన్నికలలో వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనలకు ఓట్లు వేయకండని సంక్షేమ పాలన   అందించి విభజన హామీలు అమలు చేసి రాష్ట్రానికి న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయాలని షర్మిల కోరారు.    

   ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎంఎం పల్లంరాజు, జెడి శీలం, సుంకర పద్మశ్రీ, గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, పి రఘువీరారెడ్డి, ఎస్ఎన్ రాజా, కామన ప్రభాకర రావు, చిలుకోటి పాండురంగారావు, ఆకుల లలిత, ఆకుల వెంకటరమణ, బాలేపల్లి మురళి, తుమ్మల దొరబాబు, దాట్ల గాంధీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments