నారా లోకేష్ సహకారంతో 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ.

 *నారా లోకేష్ సహకారంతో 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ


*


*స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న నారా లోకేష్*


*శిక్షణ పొందిన "52"వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ*


*కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేసిన నియోజకవర్గ తెలుగు మహిళలు*


మంగళగిరి టౌన్, ఫిబ్రవరి 27 (ప్రజా అమరావతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా దుగ్గిరాల మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్ లో నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం సర్టిఫికెట్లు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. 52వ బ్యాచ్‌లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన 60 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతి కోసం, వారి జీవనోపాధి కోసం కృషి చేస్తున్న నారా లోకేష్ కు కుట్టుమిషన్లు అందుకున్న లబ్ధిదారులు ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి మాట్లాడుతూ నారా లోకేశ్ సహకారంతో కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసిన మహిళలు స్వయం ఉపాధితో జీవితంలో స్థిరపడ్డాలని కోరారు. అధికారంలోకి రాగానే నారా లోకేష్ మహిళలకు అన్ని రంగాల్లోనూ ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర మహిళందరినీ మహారాణులుగా తీర్చిదిద్దేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘మహాశక్తి’ పథకం తెచ్చారని తెలిపారు. టీడీపీతోనే మహిళల అభ్యున్నతి సాధ్యమని, రాష్ట్రం ప్రగతి పథంలో సాగాలన్నా సంక్షేమ పథకాలు అర్హులకు అందాలన్నా టీడీపీ- జనసేన కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మీ, రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, దుగ్గిరాల మండల అధ్యక్షురాలు కేసంనేని శ్రీ అనిత, నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, పార్లమెంట్ తెలుగు మహిళ కార్యనిర్వహక కార్యదర్శి ఉన్నం ఝాన్సీ రాణి, దుగ్గిరాల వైస్ ఎంపీపీ షేక్ జబీన్, ఎంపీటీసీ చిలువూరు మరియ రోజమ్మ, సర్పంచ్ చిలువూరు మాణిక్యం, నియోజకవర్గ తెలుగు మహిళ కార్యదర్శి కంచర్ల సరోజిని, మండల తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి విస్రం స్వరూపా రాణి తదితరులు పాల్గొన్నారు.

Comments