యూనిసెఫ్ సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న పధకాలపై వార్షిక రిప్లెక్సన్ సమావేశం.

 యూనిసెఫ్ సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న పధకాలపై వార్షిక రిప్లెక్సన్ సమావేశం


అమరావతి,7 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):రాష్ట్రంలో యూనిసెఫ్ సహకారంతో అమలవుతున్న వివిధ పధకాలపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన వార్షిక సంయుక్త రిప్లెక్సన్ సమావేశం జరిగింది.ఈసమావేశంలో చిన్నారుల విద్యపై(Early Childhood Education)పై అంగన్ వాడీ వర్కర్లు,సూపర్ వైజర్లు,సిడిపిఓలకు అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ రూపొందించిన ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సును సిఎస్ ప్రారంభించారు.ఈసందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యూనిసెఫ్ సహకారంతో అమలువుతున్న వివిధ పధకాలను సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా నిర్దేశిత లక్ష్యాల సాధనకు మరింత కృషి చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలు,చిన్నారుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు,పధకాలను విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.మహిళలు,చిన్నారుల సంక్షేమానిక సంబంధించిన వివధ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో యూనిసెఫ్ సహకారం కూడా అవసరం ఉందని ఆదిశగా తగిన తోడ్బాటును అందించాలని సిఎస్ విజ్ణప్తి చేశారు.

ఈసమావేశంలో యూనిసెఫ్ చీఫ్ ఫీల్డు అధికారి డా.జీలలెం బి.టాఫ్సే(Zelalem B.Taffesse)మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నారుల సంక్షేమానికి అధ్బుతమైన చర్యలు తీసుకుంటోందని అభినందించారు.చిన్నారులు మహిళలకు సంబంధించిన నిర్దేశిత సుస్థిరాభి వృద్ధి లక్ష్యాల సాధనలో యూనిసెఫ్ రాష్ట్ర ప్రభుత్వానికి తమవంతు తోడ్పాటును అందిస్తుందని చెప్పారు.

ఇంకా ఈసమావేశంలో ఇప్పటి వరకూ రాష్ట్రంలో యూనిసెఫ్ సహకారంతో అమలవుతున్న వివిధ పధకాలు వాటి ద్వారా సాధించిన ఫలితాలు,లక్ష్యాలు తదితర  అంశాలపై సమీక్షించారు. అదే విధంగా 2024 సంయుక్త వర్కు ప్లాన్ వే పార్వార్డ్ పై విస్తృతంగా చర్చించారు.

ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ జైన్,బి,రాజశేఖర్,డైరెక్టర్ జనరల్ ఎపి హెచ్ఆర్డిఐ ఆర్పి సిసోడియా,స్త్రీ శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎం.గిరిజా శంకర్,స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి జి.చంద్రుడు,గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ హెచ్.ఎం.ధ్యాన చంద్ర,యూనిసెఫ్ కు చెందిన వివిధ రంగాల స్పెషలిస్టులు వెంకటేశ్ అరలి కట్టి(Venkatesh Aralikatty) డా.శ్రీధర్,డా.శాలిమా భాటియా, ప్రోసన్ సేన్,శేషగిరి,కె.మదుసూధన రావు,రేణి కురియన్,చైల్డ్ ప్రొటెక్సన్ అధికారి మురళీ కృష్ణ,దక్షిణ భారత డిఆర్ఆర్ అధికారి డా.మహేంద్ర రాజారామ్,ఇంకా వెంకట సుబ్బారెడ్డి,రేశా నికుంజి దేశాయ్,సోనీ అబ్రహాం తదితరులు పాల్గొన్నారు.


Comments