శ్రీకాళహస్తి నియోజకర్గంలో వైసీపీకి షాక్.*శ్రీకాళహస్తి నియోజకర్గంలో వైసీపీకి షాక్**చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన జడ్పీటీసీలు, వైసీపీ నేతలు*


అమరావతి (ప్రజా అమరావతి):- శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. వైసీపీకి చెందిన ముగ్గురు జడ్పీటీసీలు, కౌన్సిలర్ సహా పలువురు నేతలు బుధవారం టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు సమక్షంలో శ్రీకాళహస్తి జడ్పీటీసీ కె.వెంకటసుబ్బారెడ్డి, ఏర్పేడు జడ్పీటీసీ కె.తిరుమలయ్య, తొట్టెంబేడు జడ్పీటీసీ పి.అర్చనాదేవి, శ్రీకాళహస్తి 32వ వార్డు కౌన్సిలర్ వి.హరి నాయుడు, తొట్టెంబేడు మాజీ జడ్పీటీసీ పి.వెంకటాచలం టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన జడ్పీటీసీలు మాట్లాడుతూ....జడ్పీటీసీలుగా తాము గెలిచామే తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ చేపట్టలేకపోయామన్నారు. స్థానిక సంస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. వైసీపీలో తమను బానిసలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో అవినీతి తప్ప...అభివృద్ధి జరగడంలేదని వాపోయారు. టీడీపీ హయాంలో నియోజకవర్గంలో పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటు జరిగిందని, తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలొచ్చాయని గుర్తు చేశారు. శ్రీకాళహస్తి అభివృద్ధి జరగాలంటే మళ్లీ టీడీపీనే రావాలని వారు ఆకాక్షించారు. పార్టీలో చేరిన వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Comments