రోబోటిక్ సర్జరీ తో నూరుశాతం కచ్చితత్వం.

 రోబోటిక్ సర్జరీ తో నూరుశాతం కచ్చితత్వం.
 రోగి పూర్వ స్థితిని సంతనించుకునే  అవకాశం


ఇన్ఫెక్షన్ స్థాయిని తగ్గించవచ్చు


 ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి 

గుంటూరు (ప్రజా అమరావతి);

 మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలలో రానున్న కాలంలో రోబోటిక్ పాత్ర చాలా కీలకకం కానుంది అని,సర్జరీలో నూరుశాతం కచ్చితత్వం  సాధించవచ్చని ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీస్పెషల్టి హాస్పిటల్స్ అధినేత  డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం కొంతమేర ఈ సర్జరీ ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ రోగికి అన్ని విధాలా అనుకూలతలను తెచ్చిపెడుతుందని తెలిపారు.

 సోమవారం స్థానిక అరండల్ పేట లోని సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కీళ్ల మార్పిడిలో రోబో పనితీరును విలేకరుల సమావేశంలో ప్రత్యక్షంగా వివరించారు.

 ఈ సందర్భంగా డాక్టర్ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలలో దొర్లే చిన్నపాటి మానవ తప్పిదాలను సైతం నూరు శాతం సరిచేసి రోగికి పూర్వ స్థితిని సంతరించుకునే అవకాశాన్ని కల్పిస్తుందని  చెప్పారు. పూర్తిస్థాయి ఆటోమేటిక్ రోబోతో నిర్వహించే మోకీలు  మార్పిడి  సర్జరీ లు ద్వారా ఇంప్లాంట్ అమరిక కచ్చితంగా ఉంటుందని ఎముక కోత తగ్గి   రోగి త్వరగా కోలుకోవడం జరుగుతుందన్నారు. సర్జరీ సమయంలో మానవ ప్రమేయం నామమాత్రంగా ఉండడం, పరికరాల వాడకం  తగ్గడం కారణంగా రక్తస్రావం జరగడం బాగా తగ్గిపోతుందని అన్నారు.తద్వారా బయటి రక్తం ఎక్కించే అవసరం లేకపోవడంతో, ఆపరేషన్ కు పట్టే సమయం  తగ్గడం కారణంగా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం దాదాపు ఉండదన్నారు.

 దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి ఆటోమేటిక్ రోబో లు 50 వరకు ఉండగా మన ఆంధ్రప్రదేశ్ లో ఇది మొదటదని తెలిపారు. ఇప్పటివరకు 150కి పైగా  సర్జరీలు నిర్వహించగా నూరు శాతం ఫలితాలు వచ్చాయన్నారు. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స లలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రోగులకు అందుబాటులోకి తీసుకురావడంలో సాయి భాస్కర్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని డాక్టర్ నరేంద్ర రెడ్డి పేర్కొన్నారు.

 అనంతరం రోబోటిక్ సర్జరీ చేయించుకున్న రోగులు తమ అనుభవాలను వివరించారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ మర్రెడ్డి శివారెడ్డి డాక్టర్ కొనకళ్ళ శ్రీనివాస్,  డాక్టర్ విజయ శేఖర్ డాక్టర్ ఎరగూటి సాంబశివారెడ్డి, డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Comments