ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధం :- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.

 


*ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధం :- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు


*


*నీరుకొండ ప్రసాద్ రాసిన ‘అక్షరాస్త్రం’ పుస్తకావిష్కరణ*


అమరావతి (ప్రజా అమరావతి):- ప్రజాచైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా సమస్యలను వ్యాసాల రూపంలో వెలుగులోకి తీసుకొస్తూ సీనియర్ జర్నలిస్ట్ నీరుకొండ ప్రసాద్ రాసిన ‘అక్షరాస్త్రం’ పుస్తకాన్ని బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న మీడియా సంస్థలు, జర్నలిస్టులపై అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నారు. నీరుకొండ ప్రసాద్ రాసిన అక్షరాస్త్రం పుస్తకం ప్రజలను ఆలోచింపచేసేలా ఉందన్నారు. వైసీపీ నేతల అరాచాకలు, అక్రమాలను వెలుగులోకి తెస్తూ ప్రసాద్ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామక్షష్ణుడు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

Comments