డిజిటల్ బోధన బాగుంది.



*డిజిటల్ బోధన బాగుంది


*

మెక్సికో దేశస్థులు, ఐబీ ప్రతినిధి ఆల్దో ప్రశంస

కృష్ణా జిల్లాలో వివిధ పాఠశాలలను సందర్శన

విజయవాడ (ప్రజా అమరావతి);

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు  విద్యా శాఖలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) ప్రతినిధి, మెక్సికో దేశస్థులు శ్రీ ఆల్దో (ALDO ) తన పర్యటన లో భాగంగా  మంగళవారం MK. Baig Municipal corporation High school ను సందర్శించారు. ఆల్దో గారికి NCC cadets గౌరవ వందనంతో పాఠశాలకు ఆహ్వానించారు.  ఐబీ ప్రతినిధి ఆల్దో తొలుత తరగతి గదులను సందర్శించి, ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్ల వినియోగాన్ని,  బోధనా కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబుల పనితీరును అడిగి తెలుసుకున్నరు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో సంభాషిస్తూ ఆయా బోధనా అంశాలలో ప్రశ్నలు అడిగి సమాధానాలు విన్నారు.  అనంతరం ‘జగనన్న గోరుముద్ద’ను రుచి చూసి మధ్యాహ్న భోజనం వంట కార్మికులను అభినందిచారు.  ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ఐబీ ప్రతినిధి ఆల్దొ గారిని సత్కరించారు.

*వివిధ పాఠశాలలు సందర్శించిన ఐబీ ప్రతినిధి*

అనంతరం కంకిపాడు మండలం పునాదిపాడు, ఈడుపుగల్లు  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పునాదిపాడులో భౌతిక శాస్త్ర, జీవ శాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాబ్, ఈడుపుగల్లులో డ్రాయింగ్ ప్రదర్శన, సైన్స్ ల్యాబ్ ను  పరిశీలించారు. వీటి వినియోగం పట్ల ఆల్డో ఉపాధ్యాయులను ప్రశంసాంచారు. ఈ పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ‘ఇండియన్ యోగా’ ప్రత్యేక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అలానే విద్యార్థుల ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాన్ని చూసి అభినందించారు.  అనంతరం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి, అడ్మిషన్ విధానం గురించి ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు.  విద్యార్థినుల వివరాలను, చేరే విధానాన్ని, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల కు వెళ్లి బోధనా అభ్యాసన పద్దతులు పరిశీలించారు. అక్కడ గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసాను విద్యార్ధినులు ప్రదర్శించగా, వారిని అభినందించారు. ఈ పర్యటనలో ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానా , ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ డా. వై. గిరిబాబు యాదవ్ , డీసీఈబీ సెక్రటరీ  ఉమర్ అలీ , మున్సిపల్ స్కూల్ సూపర్ వైజర్ బి. రాజేష్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది సీఆర్పీలు పాల్గొన్నారు.

Comments