19 న గ్రీవెన్స్ డే....19 న గ్రీవెన్స్ డే....


ఇదే చివ‌రి అవ‌కాశం

 -ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ జె.నివాస్‌


అమ‌రావ‌తి  (ప్రజా అమరావతి);- వేత‌నాల‌కు సంబంధించి ఎలాంటి స‌మ‌స్య‌లున్నా కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులూ నెల 19న(మంగ‌ళ‌వారం) ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారుల‌కు విన్న‌వించుకోవాల‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ జె.నివాస్(commissioner, Health and family welfare J.Nivas IAS) నేడొక ప్ర‌క‌ట‌న‌(in a statement/press release)లో తెలిపారు. ఇదే చివ‌రి అవ‌కాశ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం  చేశారు. ఈ నెల 19న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారుల‌కు విన్న‌వించుకోవ‌ల‌ని ఆయ‌న పేర్కొన్నారు. విన‌తుల‌న్నింటినీ స‌మీక‌రించి(compile) గొల్ల‌పూడిలోని(విజ‌య‌వాడ‌) ప్ర‌జారోగ్య‌ కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్ట‌ర్‌(డైరెక్ట‌ర్  హెల్త్‌)కు నివేదించాల‌ని(send report)  వైద్య ఆరోగ్య శాఖాధికారులు  క‌మీష‌న‌ర్ నివాస్ ఆదేశించారు.

Comments