రూ.26 కోట్లతో నిర్మించే పాలిటెక్నిక్ కళాశాలకు పునాది రాయి వేసిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.



*రూ.26 కోట్లతో నిర్మించే పాలిటెక్నిక్ కళాశాలకు పునాది రాయి వేసిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*విద్యాలయాలు నిర్మించిన మంత్రి బుగ్గన కృషికి పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రశంసలు*


*పాలుట్ల రంగస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు  ముందడుగు*


*రూ.1.10 కోట్లతో చేపట్టనున్న పనులకు  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భూమిపూజ*


*పట్టణంలో రూ.78 లక్షలతో నిర్మించిన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవం*


*మంత్రి బుగ్గన సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 కుటుంబాలు*


బేతంచెర్ల, నంద్యాల జిల్లా, మార్చి, 08 (ప్రజా అమరావతి);  బేతంచెర్లలోని గోరుమాను కొండ గ్రామంలో రూ.26 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కోసం  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దానికి సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు.  అనంతరం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో మంత్రి బుగ్గన ముచ్చటించారు. వెనుకబడిన ప్రాంతంలో సకల సదుపాయాలు, అత్యాధునిక వసతులతో ఇంత గొప్ప విద్యాలయాలు నిర్మించిన మంత్రి బుగ్గన కృషికి విద్యార్థులు రూప, రజనీప్రియ, జగదీష్  కృతజ్ఞతలు తెలిపారు. చదువుకోడానికి దూరంగా వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడే తమలాంటి బాలికలకు  స్థానికంగానే కళాశాల ఏర్పాటు చేసినందుకు తాము ఎప్పటికి రుణపడి ఉంటామన్నారు. విద్యార్థుల చదువులు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించాలని మంత్రి ప్రిన్సిపల్ ని ఆదేశించారు. ఉన్నతమైన చదువులు చదివి గొప్ప స్థాయికి చేరాలన్న ఆకాంక్షతో ఐటిఐ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. 


అనంతరం బేతంచెర్ల పట్టణంలో రూ.78లక్షలతో సరికొత్తగా తీర్చిదిద్దిన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను ఆయన ప్రారంభించారు.  అంతకు ముందు  ఉదయం బేతంచెర్ల పట్టణంలో కొత్తగా నిర్మించిన 'రైల్ రోడ్ రెసిడెన్సీ' లాడ్జ్ ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు.


ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చొరవతో వెల్దుర్తి మండలంలోని పాలుట్ల రంగస్వామి ఆలయ అభివృద్ధికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చొరవతో ముందడుగు పడింది. శుక్రవారం ఉదయం  రంగస్వామి ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి మంత్రి బుగ్గన భూమి పూజ నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు కంగాటి శ్రీదేవితో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలుట్ల స్వామి క్షేత్రాన్ని దర్శనాంతరం కలియతిరుగుతూ పరిశీలించారు. అంతకుముందు రహదారి మార్గ ప్రస్తుత పరిస్థితిని పరిశీలించేందుకు అత్యంత క్లిష్టమైన రాళ్లదారిలో మంత్రి ప్రయాణిస్తూ పాలుట్ల స్వామి క్షేత్రానికి చేరుకున్నారు. రూ.1.10 కోట్లతో తీర్చిదిద్దనున్న ఆలయాభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించారు. బేతంచెర్ల సరిహద్దు గ్రామం గూటుపల్లి నుంచి పాలుట్ల ఆలయానికి చేరే రోడ్డు మార్గాన్ని రూ.6.50 కోట్లతో చేపట్టనున్నట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఆలయ చరిత్ర చెక్కు చెదరకుండా ప్రత్యేకమైన రాయితో ఆలయాన్ని నిర్మించేందుకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. రంగస్వామి క్షేత్రాల పురాణ గాథలు, స్వామి ఆలయాల నిర్మాణ శైలి తదితర అంశాలపై స్థానికులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ గోపురం, వర్షాకాలంలో ఆలయంలోకి నీరు రాకుండా ప్రత్యేక మార్గాలు నిర్మించడంలో అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాకతో  స్థానిక ప్రజలు , ఆలయానికి చెందిన వేదపండితులు ఆయనకు ఘనస్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి సత్కరించారు.


*మంత్రి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కొలములపల్లె గ్రామంలోని 100 కుటుంబాలు*


అంతకు ముందు బేతంచెర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి బుగ్గన సమక్షంలో పార్టీలోకి చేరికలు జరిగాయి. కొలములపల్లె గ్రామానికి చెందిన వంద మందికి మంత్రి బుగ్గన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.  అభివృద్ధికి చిరునామాగా మారిన బుగ్గన నాయకత్వంలో పని చేయాలనే తాము వైసీపీ పార్టీలో భాగస్వామ్యం అవుతున్నట్లు కొలములపల్లె గ్రామస్తులు పేర్కొన్నారు. డోన్ నియోజకవర్గం సామాన్య ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఆలయాల అభివృద్ధి, పర్యాటక వసతుల ఏర్పాటుతో  సమగ్రాభివృద్ధి చెందిందని, అందరూ మరోసారి పేద ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కలిసి పని చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బేతంచెర్ల లోని గోర్లగుట్ట గ్రామస్తులు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేపట్టిన అభివృద్ధిని ప్రశంసించారు. రహదారి లేని ఊరే లేకుండా   బేతంచెర్లను తీర్చిదిద్దడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల ఎంపీపీ నాగభూషణం రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ చలం రెడ్డి, బేతంచర్ల వైసిపి నాయకులు బాబుల్ రెడ్డి, ఎంపీటీసీ రామ నాథం,ఆర్డీవో మహేశ్వర్ రెడ్డి,  గోరుమానుకొండ గ్రామ సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు,  తదితరులు పాల్గొన్నారు.



Comments