మహిళా సాధికారత అనేది కేవలం సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇది ఆర్థిక అనివార్యం కూడా.


అమరావతి (ప్రజా అమరావతి)!


*మహిళా సాధికారత అనేది కేవలం సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇది ఆర్థిక అనివార్యం కూడా. ఈ సూత్రాన్ని బలంగా నమ్మిన మన ప్రభుత్వం ఆచరణలో చేసి చూపించింది. ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాలు) పేద అక్కచెల్లెమ్మల జీవితాల్లో సైతం సరికొత్త కాంతులు నింపింది*.


*"వైఎస్సార్ ఈబీసీ నేస్తం"*


*రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 629.37 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు (14.03.2024) నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి*


*వైఎస్సార్ ఈజీసీ నేస్తం" ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ లతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున అదే అక్కచెల్లెమ్మలకు 3 ఏళ్లలో మొత్తం రూ.45,000 ఆర్థిక సాయం చేస్తూ వారు స్వంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా తోడ్పాటు అందిస్తున్న మన ప్రభుత్వం..*.


*వివిధ పథకాల ద్వారా కేవలం అక్కచెల్లెమ్మలకు మాత్రమే గత 58 నెలల్లో మన ప్రభుత్వం అందించిన లబ్ది...DBT + NON DBT మొత్తం రూ. కోట్లలో 2,79,786*

*నేడు అందిస్తున్న రూ. 629.37 కోట్లతో కలిపి ఇప్పటివరకు కేవలం "వైఎస్సార్ ఈబీసీ నేస్తం" ద్వారా మన ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,876.97 కోట్లు.. ఒక్కో అక్కచెల్లెమ్మకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా మూడేళ్లలో అందించిన మొత్తం సాయం రూ. 45,000..*



*కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో జగన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ. 1,011 కోట్లతో నిర్మించనున్న నేషనల్ “లా” యూనివర్సిటీకి నేడు (14.03.2024) భూమి పూజ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి..*


రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా జగన్నాథగట్టుపై 14 మార్చి 2024 ఉదయం 10 గంటలకు నేషనల్ "లా" యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు. ఆనంతరం "వైఎస్సార్ ఈజీపీ నేస్తం" ఆర్థిక సాయాన్ని నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జను చేస్తారు.

Comments