ఐబీ ద్వారా స్వయం ఉపాధితో పాటు జీవన ప్రమాణాలు అభివృద్ధి.


*ఐబీ ద్వారా స్వయం ఉపాధితో పాటు జీవన ప్రమాణాలు అభివృద్ధి*

పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ ని కలిసిన ఐబీ ప్రతినిధులు.

అమరావతి (ప్రజా అమరావతి);


ఐబీ విద్యావిధానం ద్వారా విద్యార్థులకు గ్లోబల్ పౌరులుగా శిక్షణ ఇస్తే వారు స్వయం ఉపాధి పొందటంతో పాటు జీవన ప్రమాణాలు కూడా అభివృద్ధి చేసుకోగలుగుతారని  పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్  అన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని ఆయన ఛాంబర్లో ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) బృందం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ప్రవీణ్ ప్రకాష్ IAS ను కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు తెలుసుకున్నారు.

ఐబీ బృందం నుంచి డాక్టర్ కళా పరశురామ్ (సీనియర్ మేనేజర్, ఈక్విటీ అండ్ ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, U.K), జెన్నిఫర్ ప్లెజ్‌కోచ్ ( సీనియర్ లెర్నింగ్ ఆర్కిటెక్ట్, ప్రొఫెషనల్ లెర్నింగ్, U.S.A), డాక్టర్ ఎల్లెన్ వీవర్స్ (కరికులం స్పెషలిస్ట్ యు. కె)తో పాటు సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య , ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.  ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్  టీచర్ ట్రైనింగ్ అసెస్‌మెంట్ మొదలైన వాటిపై ఐబీ ప్రతినిధులతో చర్చిస్తూ.. రాష్ట్రంలో పొడవైన కోస్తా తీరం, హరిత పర్యావరణ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధి చొదకాలుగా ఇవి ఉపకరిస్తాయని తెలిపారు. రాష్ట్రంలోనే 70శాతం మంది యువత విద్యాభ్యాసమైన తర్వాత రాష్ట్రంలో  జీవనోపాధికి కూడా అవకాశాలు పెరుగుతాయని వీరికి అనుకూలంగా  ఐబీ విద్యావిధానంలో గ్లోబల్ పౌరులుగా శిక్షణ ఇస్తే వారు స్వయం ఉపాధి పొందటంతో పాటు జీవన ప్రమాణాలు కూడా అభివృద్ధి చేసుకోగలుగుతారని చెప్పారు. ఐబీ విద్యావిధానం ద్వారా విచారణ ఆధారిత విద్యాభ్యాసం, వృత్తి కోర్సుల మూల్యాంకనం మెరుగుపరచడం, వివిధ సబ్జెక్టుల మధ్య అనుసంధానంతో పాటు బోధన, ఆంగ్ల విద్య ప్రాముఖ్యతను పెంచుకోవడం వంటి లక్ష్యాల సాధన జరుగుతుందని ప్రవీణ్ ప్రకాష్  చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా తగిన నివేదిక రూపొందించాలని తనను కలిసిన ఐబీ బృందానికి ఆయన సూచించారు. 


Comments