నూతన ఆర్టీఐ కమీషనర్లచే ప్రమాణం చేయించిన సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి.

 నూతన ఆర్టీఐ కమీషనర్లచే ప్రమాణం చేయించిన సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి
విజయవాడ,11 మార్చి (ప్రజా అమరావతి):రాష్ట్ర సమాచార కమీషన్ కు నూతనంగా నియమించబడిన ముగ్గురు సమాచార కమీషనర్లు చావలి సునీల్,రెహానా బేగం,అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వారిచే సమాచార కమీషనర్లుగా ప్రమాణం చేయించారు.ఈ మేరకు సోమవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో సమాచార కమీషనర్ల ప్రమాణ స్వీకార (Administer the Oath)జరిగింది.

ఈకార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా,ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్,సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా,శామ్యూల్ జొనాతన్,కాకర్ల చెన్నారెడ్డి,సమాచార కమీషన్ లా సెక్రటరీ జి.శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు(పబ్లిక్ పాలసీ) నేమాని భాస్కర్,నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Comments