ఈస్టర్ సందేశ్ సందేశము.

 * ఈస్టర్ సందేశ్ సందేశము  *

ప్రపంచవ్యాప్తం గా జరుపుకొనే ఈస్టర్ రోజున తిరిగి బ్రతికి అనేక మందికి దర్శనం ఇచ్చాడు, ఏసుప్రభు తను ముందే చెప్పినట్టు మూడవరోజు సమాధి నుండి లేచి మొదటిగా శిష్యులకు తరువాత 40 దినాలు రోజులు అనేకమందికి కనబడుతూ బలపరుస్తూ చివరగా నేను పరలోకానికి ఆరోహణం అయిపోతున్నాను, నా పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఉండడానికి పంపిస్తాను, ఆత్మరూపుగా మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తాను, మీరు ఈ గొప్ప సువార్తను లోకమన్నంతట ప్రకటించండి, మరలా తీర్పు తీర్చడానికి  వస్తాను అని చెప్పి, తాను పరలోకానికి ఆరోహణమైపోయినాడు. తను మరణాన్ని జయించి పునరుత్థానుడై 

ఏసుప్రభు శిష్యులలో ఒకడైన తోమ ఏసుప్రభు తిరిగి బ్రతికాడు అని విన్నప్పుడు, నేను ఆయన చేతిలోని గాయాల్లో వేలు పెట్టి చూస్తే గాని నమ్మను అని చెప్పాడు, యేసుప్రభు స్వయంగా తోమాక ప్రత్యక్షమై ,ఇదిగో నా చేతిలో ఉన్న గాయం లో వేలు పెట్టు అని చూపించినప్పుడు,  తోమా కుమిలిపోయాడు,  ఆ తోమానే మన ఇండియా దేశం లోని మద్రాస్ కు వచ్చాడు, అక్కడే మరణించాడు. ఇప్పటికీ మౌంట్ థామస్ గా పిలవబడే ఆయన సమాధి మద్రాస్ లో  ఉంది,.

ఏసుప్రభు జన్మించిన స్థలాలు, తిరిగిన ప్రదేశాలు, సిలువ వేయబడిన ప్రాంతం, సమాధి చేయబడిన ప్రాంతం, పరలోకానికి ఆరోహణమైన ప్రదేశం అన్ని ఇప్పటికీ భద్రంగా ఇజ్రాయిల్ దేశంలో ఉన్నాయి, అనేక మంది వెళ్లి చూసి సంతోషిస్తుంటారు. ఏసుప్రభు తాను జీవించిన కాలంలో పాపాన్ని జయించారు, పరిశుద్ధంగా జీవించాడు, తన పరిశుద్ధ రక్తం కార్చి, తన జీవితాన్ని సర్వ మానవాళి పాప విముక్తి కోసం బలిగా అర్పించాడు. ఏసుప్రభు పునరుత్థానం ద్వారా మనం కూడా పాపాన్ని జయించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి శక్తిని అనుగ్రహిస్తాడు. ఏసుప్రభు సజీవుడై బాధలలో ఉన్నవారితోను, నిరాశ ,నిస్పృహలు గురైనవారితోను, సర్వ మానవాళితో ఆయన మాట్లాడుతూ, బలపరుస్తూ, ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. శుక్రవారం సిలువ వేయబడి, సమాధిలో పెట్టబడి, ఆదివారం ఉదయమే సజీవుడిగా, పునరుద్దానుడైన రోజే , ప్రపంచమంతా జరుపుకునే ఈస్టర్ పర్వదినం .

ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ ప్రకాష్ మోసిగంటి,       

                B.Tech, M.Tech, Ph.D

 చైర్మన్, Jesus Believers Association Council (JBAC)

 మాజీ డైరెక్టర్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజెస్, గుంటూరు, Phone : 9849482182

Comments