పోగొట్టుకున్న బంగారాన్ని అప్పగించిన సుల్తానాబాద్ పోలీసులు.

 రామగుండం పోలీస్ కమీషనరేట్ (ప్రజా అమరావతి);
*పోగొట్టుకున్న బంగారాన్ని   అప్పగించిన సుల్తానాబాద్ పోలీసులు* *కొద్ది గంటల్లోనే బాధితురాలికి బంగారం ఉన్న బ్యాగ్ అందజేత* అజాగ్రత్తతో  ఆటో లో మర్చిపోయిన బంగారం ఉన్న బ్యాగును సుల్తానాబాద్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సీసి కెమెరాల సహాయంతో కోల్పోయిన కొద్ది గంటల్లోనే బాధితురాలికి అందించి శభాష్ రామగుండం పోలీస్ కమీషనరేట్ సుల్తానాబాద్ పోలీస్ అనిపించుకున్నారు.


వివరాల్లోకి వెళితే.... చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన మండల వసంత, భర్త రఘు వసంత సొంత గ్రామం మైన సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి కి సమ్మక్క సారలమ్మ జాతర ముందు వచ్చి జాతరకు వెళుతున్న సందర్భంగా తనకు ఉన్న 9 తులాల బంగారాన్ని తల్లి  ఇంటి వద్ద ఉంచి జాతరకు వెళ్ళింది. తిరిగి ఆదివారం తన తల్లి వద్దకు వచ్చి బంగారం తో పాటు ఇతర సామాగ్రిని తీసుకొని  సుగ్లాంపల్లి లో ఆటో ఎక్కి సుల్తానాబాద్ లో దిగి బస్సు కరీంనగర్ కు ఎక్కే క్రమంలో తన బంగారం ఉన్న బ్యాగును మర్చిపోయిన విషయాన్ని గమనించి వెంటనే సుల్తానాబాద్ పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై వినీత వెంటనే స్పందించి సిఐ సుబ్బారెడ్డి కి సమాచారం అందించడంతో సీఐ గారు తక్షణమే సమాచారాన్ని సిపి శ్రీనివాసులు ఐపిఎస్.,డిసిపి చేతన ఐపిఎస్.,ఏసిపి గజ్జి కృష్ణ గార్లకు సమాచారం అందించచి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తక్షణమే బృందాలుగా ఏర్పడి గోదావరిఖని పెద్దపల్లి, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, కరీంనగర్ తదితర పోలీసులకు సమాచారం అందించి గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు బాధితురాలు వసంత ఇచ్చిన సమాచారం మేరకు పెద్దపల్లి నుండి వచ్చిన గ్రీన్ కలర్ ఆటో లో తాను ప్రయాణించానని సమాచారం ఇవ్వడంతో ఆటో ప్రయాణించిన మార్గంలో ఉన్న సీసీ పుటేజీలను ఉపయోగించి ఆటో ను గుర్తించి అతని మొబైల్ నెంబర్, ఆటో వివరాలను సేకరించిన పోలీసులు కరీంనగర్ కలెక్టరేట్ సమీపాన ఆటోను పట్టుకొని ఆటోలో వెతకగా బాధితురాలు మరిచిపోయిన బంగారం ఉన్న బ్యాగ్ ఆటోలో లభ్యం  అయిందని  తక్షణమే కోల్పోయిన 9 తులాల బంగారం మూడు తులాల నెక్లెస్ 3 తులాల హారం రెండు తులాల చైన్ లాకెట్ రెండు ఉంగరాలు చెవి కమ్మలను గుర్తించామని,ఆటో డ్రైవర్ కు సైతం బ్యాగు ఉన్న విషయం తెలియలేదని ఏ సి పి తెలిపారు. బంగారాన్ని  సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలకి అందించినట్లు ఎసిపి తెలిపారు.


 *బంగారాన్ని ఛేదించేందుకు చాకచక్యంగా  వ్యవహరించిన పెద్దపల్లి ఎస్సై మల్లేష్ సుల్తానాబాద్ ఎస్సై వినీత పోలీస్ కానిస్టేబుల్ మునీందర్ నాయక్ అలీ, అశోక్, రాజ్ కుమార్, వేణు లను ఎసిపి అభినందించారు.*


ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారెడ్డి ఎస్సై వినీత కానిస్టేబుల్ పలువురు పాల్గొన్నారు.

Comments