ఐ.టి.విభాగం పనితీరుని అభినందించిన సంస్థ ఎం. డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్.

 విజయవాడ (ప్రజా అమరావతి);ఐ.టి.విభాగం పనితీరుని అభినందించిన సంస్థ ఎం. డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్. 


నిన్న కోల్ కతా లో అవార్డు అందుకున్న అధికారులు 

ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.కి మరోసారి దక్కిన ప్రతిష్టాత్మక అవార్డు 


2024 వ సంవత్సరానికి గాను  ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ విభాగంలో వరుసగా

6వ సారి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డుకు ఎంపికై, నిన్న అనగా 02.03.2024వ తేదీన కోల్ కతలో   జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో వివిధ ప్రభుత్వ సంస్థలతో పోటీపడి  ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఈ అవార్డు గెలుచుకుంది. 

కాగా, ఈ రోజు సంస్థ ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్.,   ఐ. టి. విభాగం అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా తన ఛాంబర్ కి పిలిపించి  అభినందించారు. దేశంలో ఏ ఇతర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలలో లేని  విధంగా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి మాత్రమే ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు మరియు కాగిత రహిత టిక్కెట్లను సులభంగా జారీ చేసే సౌలభ్యాన్ని ప్రవేశపెట్టినందుకు ఈ అవార్డు గెలవడం సంతోషంగా ఉందని అన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ముందుకు దూసుకెళ్తుందని, ఆ క్రమంలో ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా  ఎం.డి. తెలియజేశారు. 

ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.కి సొంతమయ్యేలా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తమ వంతు సేవలందించాలని తెలిపారు.  

ఈ అభినందన కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ&ఐ.టి)                       శ్రీ కె.ఎస్.బ్రహ్మానంద రెడ్డి, ఛీఫ్ ఇంజినీర్(ఐ.టి), శ్రీ వి. సుధాకర్, డిప్యూటీ ఛీఫ్ మేనేజర్(ఐ.టి) శ్రీ వై. గంగాధర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (ఐ.టి) శ్రీ సాయి చరణ్ తేజ, SO(ఐ.టి) శ్రీమతి ఫణి చక్ర తేజ, ఏ.టి.ఎం.(e –POS) శ్రీమతి సిహెచ్. సునీత, ఏ.ఎం. (ఐ.టి) శ్రీ శరత్ బాబు, ఏ.ఎం. (ఐ.టి) శ్రీ శ్రీను నాయక్ పాల్గొన్నారు.       

Comments