అసైన్మెంట్ పట్టాలను పంపిణీ చేసిన మంత్రి, రాజం పేట మరియు చిత్తూరు ఎం పి లు.*పుంగనూరులో రూ.2.35 కోట్ల తో నూతనంగా నిర్మించిన జెడ్ పి అతిధి గృహం నకు  ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి* 


 *అసైన్మెంట్ పట్టాలను పంపిణీ చేసిన మంత్రి, రాజం పేట మరియు చిత్తూరు ఎం పి లు*


 


పుంగనూరు,మార్చి 08 (ప్రజా అమరావతి): 

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అర్హత గల  ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది  చేకూరే విధంగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక,భూగర్భ గనుల శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు. 


       శుక్రవారం పుంగనూరు లో  రూ.2.35 కోట్ల జిల్లా పరిషత్ మరియు ఏపీఎండిసి నిధులు తో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ అతిధి గృహం ను రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూ గర్భ గనుల శాఖ మంత్రి   ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మంత్రి గారి వెంట రాజంపేట పార్లమెంటు సభ్యులు మరియు లోక్ సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, 

చిత్తూరు ఎం పి ఎన్.రెడ్డెప్ప, సంబంధింత అధికారులు,

ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా *ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..* 


రాష్ట్ర ముఖ్యమంత్రి అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూరే విధంగా పాలన

సాగిస్తున్నారనన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తో పుంగనూరు నియోజక వర్గం  5 సం.రాల లో అభివృద్ధి చెందిందనన్నారు.  పుంగనూరు నియోజకవర్గం  అభివృద్ధి కి రాజం పేట  ఎం పి చొరవ తో పుంగనూరు కు బైపాస్ రోడ్డు   మంజూరు కావడం జరిగిందని, ఈ పనులు జరుగు తున్నాయని, దీనితో పాటు పట్టణ సుందరీకరణ పనులు చేయడం మరియు మౌలికసదుపాయాల కల్పన లో భాగంగా ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు,ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టామనన్నారు. పడమటి ప్రాంతం లో త్రాగునీటి సమస్య పరిష్కారం నిమిత్తం ముఖ్య మంత్రి గారు 3 సాగు నీటి ప్రాజెక్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో మన ప్రాంతము లో రెండు ప్రాజెక్టులు కలవనన్నారు.దీనితో పాటు గండి కోట రిజర్వాయర్ నుండి పైపు లైన్ ద్వారా ఈ ప్రాంతము లో గల ప్రాజెక్ట్ లు నింపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు .సాగు,త్రాగు నీరు కు ఎటువంటి సమస్య లేకుండా చర్యలు చేపట్టామనన్నారు. పుంగనూరుమునిసిపాలిటీ లో విద్యుత్ ఖర్చు ను తగ్గించేందుకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పుంగనూరు లో జర్మనీ కంపెనీ పెప్పర్ మోషన్ ఏర్పాటు ద్వారా రానున్న కాలంలో ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని,ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. *రాజం పేట ఎం పి మరియు లోక్ సభ  ప్యానల్ స్పీకర్  పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మాట్లాడుతూ...* 


రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యా రంగం లో పలు సంస్కరణ లు తీసుకొని వచ్చి పాఠశాలల లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు

నాడు- నేడు పథకం ద్వారా పాఠశాలల రూపు రేఖలు మార్చడం జరిగిందనన్నారు.అమ్మ ఒడి పథకం ద్వారా తల్లి దండ్రుల కు విద్యా భారం ను తగ్గించడం తో పాటు జగనన్న గోరు ముద్ద పథకం ద్వారా విద్యార్థులకు మంచి భోజనము ను అందిస్తున్నామన్నారు. అర్హులైన విద్యార్థులకు ఉన్నత విద్య ను అభ్యసించేందుకు అవసరమైన ఫీజులు చెల్లించడం జరుగు తున్నదని తెలిపారు. పూర్తి పారదర్శకత తో అర్హులైన వారందరికీ అన్ని సంక్షేమ పథకాలను అందించడం, ఇంటి వద్దకే సంక్షేమ పథకాల లబ్ది అంద జేస్తున్న మనన్నారు.ఎన్నికల హామీలలో భాగంగా తెలిపిన సంక్షేమ పథకాలను అన్నింటినీ ముఖ్య మంత్రి అమలుచేస్తున్నారని తెలిపారు.వాటర్ గ్రిడ్ పథకం కింద ఇంటిoటి కి కుళాయిల ద్వారా  త్రాగునీరు ను  అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఇందుకు  సంబంధించిన సర్వే  పనులు జరుగుతున్నాయని,2 సం. రాలలో ఈ పనులు పూర్తి కావడం జరుగుతుందని తెలిపారు.. రానున్న కాలంలో ఈ ప్రాంతానికి సాగు నీరు, త్రాగునీరు కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ ప్రాంతము అభివృద్ధి లో భాగంగా గ్రామాలకు రోడ్డు లు వేయడం జరుగుతున్నదని తెలిపారు.ఈ ప్రాంతము లో ఉన్న  వారికి ఉపాధి  నిమిత్తం రాష్ట్రంలో అతి పెద్ద పరిశ్రమ అయిన  పెప్పర్ మోషన్ కంపెనీ  ఏర్పాటు లో భాగంగా  ఇందుకు సంబంధించిన భూమి సర్వే పనులు జరుగుతున్నవని తెలిపారు.ఈ కార్య్రక్రమం లో భాగంగా  పుంగనూరు మండలం లో 146 మంది లబ్ధిదారులకు  అసైన్మెంట్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్  ఎస్ ఈ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ సీఈఓ గ్లోరియా,మైనార్టీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్ రెడ్డి, పి ఆర్ డి ఈ చంద్రశేఖర్, పుంగనూరు  రాష్ట్ర జానపద కళల కార్పొరేషన్ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం,  పికెఎం ఉడా ఛైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్,పుంగనూరు ఎంపిపి భాస్కర్ రెడ్డి, పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీం బాషా,బోయ కొండ గంగమ్మ పాలక మండలి చైర్మన్ నాగరాజ రెడ్డి, తహశీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి,ఎంపిడిఓ వెంగ ముని రెడ్డి,నాయకులు జింకాచలపతి, కృష్ణమూర్తి,  ఇతర సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.   


Comments