ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బాలలును భాగస్వామ్యం చేయొద్దు.

 అమరావతి (ప్రజా అమరావతి);

                     

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బాలలును భాగస్వామ్యం చేయొద్దు:


రాజకీయ పార్టీలకు సూచించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ .

                  

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములోని త్వరలో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో 18 సంవత్సరాలు లోపు బాలలను ఎ టువంటి రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో గానీ,ప్రచార మాధ్యమాలులో గాని,రాజకీయ పార్టీలు యొక్క సామగ్రి సరఫరా,పంపిణీ కార్యక్రమాల్లో గానీ భాగస్వామ్యం చేయొద్దని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సభ్యులు గొండు శీతారామ్,జంగం రాజేంద్ర ప్రసాద్ మరియు త్రిపర్ణ ఆదిలక్ష్మి కోరారు.

మంగళవారం గుంటూరులోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వీరు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం బాలలను ఎన్నికల్లో భాగస్వామ్యం చేస్తే ఆయా రాజకీయ పార్టీలపై కఠిన   చర్యలు తీసుకుంటామని ఆదేశాలు తో పాటు మరిన్ని మార్గ దర్శకాలును జారీ చేశారని తెలిపారు.

   గత కొద్ది రోజులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు కొన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులు వారి ప్రచారాలకు, సామాజిక మాధ్యమాలు ద్వారా ప్రకటనలకు,సామగ్రి తరలింపుకు, సమావేశాలకు,చిన్న చిన్న పనులు కు బాలలను వినియోగిస్తున్నట్టు తమ కమిషన్ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.

బాలల మనస్సు మరియు ఆలోచన విధానం చాలా సున్నితంగా ఉంటుందని,వారి పసిహృదయాల్లో  ఎన్నికలు మరియు రాజకీయాలకు సంబంధించిన సంఘటనలు,కార్య కలాపాలు వంటివి చొరబడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు,ఇటువంటి అంశాలపై తాము డేగ కళ్ళతో వ్యవహరించనున్నామన్నారు.

Comments